Hyderabad : హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్
Police Foiled Terrorist Attack : భాగ్యనగరంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశారు. అయితే పోలీసులు దీనిని భగ్నం చేశారు. పలుచోట్ల విధ్వంసాలు సృష్టించేందుకు ఐఎస్ఐ ప్రణాళికలు వేసింది.

భాగ్యనగరంలో ఉగ్రదాడి(Terror Attack)ని పోలీసులు భగ్నం చేశారు. జన సమూహాలు, బహిరంగ సభలపై గ్రనేడ్లు విసిరి మత కలహాలు సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తున్న ముగ్గురిని పోలీసులు(Police) అరెస్ట్ చేశారు. నాలుగు హ్యాండ్ గ్రనేడ్లు, ఐదున్నర లక్షల క్యాష్, ఐదు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. దిల్సుఖ్నగర్ సహా పలు పేలుళ్లకు పాకిస్థాన్ నుంచి కుట్రపన్నిన నిందితులే మరోసారి వాహెద్ ద్వారా దాడులకు తెగబడేదుంకు యత్నించినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాదులో పలుచోట్ల విధ్వంసాలు సృష్టించేందుకు ఐఎస్ఐ(ISI) ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఉగ్రవాదులతో లింకులు ఉన్న జాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, జాహిద్ అరెస్ట్‌లో కీలక అంశాలు బయటకు వచ్చాయి. పాకిస్థాన్‌లో ఉండి హైదరాబాద్(Hyderabad)లో పలు పేలుళ్లతో సంబంధమున్న ఫర్హతుల్లా గోరి, అబ్దుల్ మాజిద్, అబు అంజాలాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటంతో జాహిద్‌పై నిఘా ఉంది.
దసరా(Dussehra) ఉత్సవాలను జాహిద్ టీమ్ టార్గెట్ చేసుకుంది. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర చేయాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలపై దాడులకు సైతం ప్లాన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలంటూ పాక్ నుంచి జాహిద్‌కు ఆదేశాలు అందిన్నట్టు తెలుస్తోంది. నాలుగు గ్రనేడ్స్‌ను జాహిద్(Zaheed)కు పాకిస్థాన్ నుంచి వచ్చాయి.
హైదరాబాద్ సీసీఎస్, సిట్‌లో జాహిద్ టీమ్‌పై కేసు నమోదు అయింది. జాహిద్‌తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. సుజి, సమీయుద్దీన్, అదీల్, అప్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషిను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌లోని హ్యాండర్ల ద్వారా నిధులు సేకరిస్తున్నట్టుగా తెలుసుకున్నారు.
గతంలో పలు బ్లాస్ట్ కేసుల్లో జాహిద్ నిందితుడిగా కూడా ఉన్నాడు. 2005లో బేగంపేట్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై సూసైడ్ అటాక్ జాహిద్ ప్రణాళిక వేశాడు. ఫర్హతుల్లా ఘోరీ, అణు హంజాల, అబ్దుల్ మజీద్‌లతో కలిసి కుట్రకు ప్రయత్నించారు. 2002 సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ వద్ద కుట్ర, 2005లో బేగంపేట్ టాస్క్‌ఫోర్స్ మానవ బాంబు పేలుళ్లను సైతం జాహిద్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.
గ్రనేడ్లు విసిరి దాడి చేయడమే లక్ష్యంగా ఈసారి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. గుంపులుగా ఉన్న ప్రజల్లోకి గ్రనేడ్లు విసిరి దాడి చేయడమే లక్ష్యమని పోలీసుల విచారణలో జాహిద్ తెలిపాడు. ఈ కేసుకు సంబంధించి.. అధికారులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు.