CM Revanth Reddy : డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై షార్ట్ వీడియోలు చేయాలి- సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండీషన్లు-cm revanth reddy condition to tollywood release videos on drug cyber crime awareness videos ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై షార్ట్ వీడియోలు చేయాలి- సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండీషన్లు

CM Revanth Reddy : డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై షార్ట్ వీడియోలు చేయాలి- సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండీషన్లు

Bandaru Satyaprasad HT Telugu
Jul 02, 2024 03:29 PM IST

CM Revanth Reddy : తెలంగాణలో దురదృష్టవశాత్తు డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదు.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై నటీనటులు అవగాహన కల్పించాలని కోరారు.

డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై షార్ట్ వీడియోలు చేయాలి- సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి షరతు
డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై షార్ట్ వీడియోలు చేయాలి- సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి షరతు

CM Revanth Reddy : హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టీజీ న్యాబ్, సైబర్ సెక్యూలరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం నార్కోటికి బ్యూరో ఫొటో ఎగ్జిబిషన్ ను వీక్షించారు. అక్కడ మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని వాల్ బోర్డుపై సీఎం రేవంత్ రెడ్డి రాశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అందుకే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించామన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్ అన్నారు. నేరాలను ఎదుర్కోవడంలో రాష్ట్రంలో సైబర్ క్రైం టీమ్ సమర్థవంతంగా పని చేస్తోందని కితాబు ఇచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతు మాత్రమే, నేరగాళ్లు కాదు

"ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణలో దురదృష్టవశాత్తు గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించాం. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి. చిన్నారులపై దారుణ ఘటనలకు కారణం మాదకద్రవ్యాలే. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదు.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలి. డ్రగ్స్ నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన వారికి పదోన్నతి కల్పిస్తాం. ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తాం. మీడియా.. రాజకీయ వివాదాలపై కాకుండా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదు" - సీఎం రేవంత్ రెడ్డి

నటీనటులు డ్రగ్స్ దుర్వినియోగంపై వీడియో చేయాలి- సీఎం

టిక్కెట్ల రేట్లు పెంచాలన్నా, షూటింగ్‌లు చేయాలన్నా సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు షరతు విధించారు. నటీనటులు డ్రగ్స్ దుర్వినియోగం, సైబర్ క్రైమ్‌పై వీడియో విడుదల చేయాలని కోరారు. సినిమా ప్రారంభం కావడానికి ముందు, డ్రగ్స్ దుర్వినియోగం, సైబర్ క్రైమ్‌పై రెండు వీడియోలను థియేటర్లలో ప్రదర్శించాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నానన్నారు. ప్రతీ సినిమా థియేటర్ లో సినిమాకు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలన్నారు. ఈ నిబంధనలకు సహకరించినవారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉందన్నారు.

థియేటర్లకు కండీషన్స్

డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై సినిమాకు ముందు కానీ సినిమా ముగిసిన తర్వాత అయిన మూడు నిమిషాల వీడియోతో అవగానే కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలా చేయకపోతే వారి సినిమాలకు టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అలాంటి నిర్మాతలకు, డైరెక్టర్లకు, నటీనటులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందవని తేల్చిచెప్పారు. సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలని సీఎం కోరారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన వీడియోలు థియేటర్లలో ప్రసారం చేయకపోతే అలాంటి థియేటర్లకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం