TGSRTC Jobs : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీలో 3035 పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్-hyderabad tg govt approval to tgsrtc job notification for 3035 jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Jobs : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీలో 3035 పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGSRTC Jobs : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీలో 3035 పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Bandaru Satyaprasad HT Telugu
Jul 02, 2024 02:43 PM IST

TGSRTC Jobs : తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

టీజీఎస్ఆర్టీసీలో 3035 పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
టీజీఎస్ఆర్టీసీలో 3035 పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGSRTC Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులు భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలు భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పోస్టులు వివరాలను టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రకటించింది.

పోస్టులు వివరాలు

  • డ్రైవర్ పోస్టులు-2000
  • శ్రామిక్ -743
  • డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)-114
  • డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)-84
  • డీఎం/ఏటీఎం/మెకానిక్ ఇంజినీర్-40
  • అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)-23
  • మెడికల్ ఆఫీసర్-14
  • సెక్షన్ ఆఫీసర్(సివిల్)-11
  • అకౌంట్స్ ఆఫీసర్-6
  • మెడికల్ ఆఫీసర్(జనరల్, స్పెషలిస్ట్)-14

కొత్త బస్సులకు అనుగుణంగా పోస్టుల భర్తీ

టీజీఎస్‌ఆర్టీసీలో 3035 కొలువులు భర్తీ చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి ఎక్స్ లో పోస్టు చేశారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్‌ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు బలోపేతం చేసేందుకు ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో రద్దీ పెరిగిందన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు వివరించారు. త్వరలో 3035 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని ఇటీవల ఎండీ సజ్జనార్ తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందననారు. ఉద్యోగాల భర్తీకి తాజాగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ‌ ప్రభుత్వం నుంచి ఇటీవల మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వైద్యారోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల భ‌ర్తీకి మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. జులై 2వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరణ ప్రారంభం అయ్యింది. జులై 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు :

ఉద్యోగ ప్రకటన - మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం.

మొత్తం ఖాళీలు - 435 ( సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్)

అర్హతలు - ఎంబీబీఎస్ పాటు పాటు తగిన అర్హతలు ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.

వయసు - 18 నుంచి 46 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం - రూ. 58,850 – రూ. 1,37,050

దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో

దరఖాస్తులు ప్రారంభం - జులై 2 , 2024.

దరఖాస్తులకు చివరి తేదీ - జులై 11, 2024.

దరఖాస్తు రుసుం - రూ. 500 , ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్ - https://mhsrb.telangana.gov.in/

Whats_app_banner

సంబంధిత కథనం