Actress Hema: వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నా! డ్రగ్స్ వినియోగం కేసు విచారణకు రాలేనని లేఖ రాసిన నటి హేమ
Actress Hema: బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగంపై సీసీబీ పోలీసుల విచారణకు హాజరు కాలేనంటూ సినీ నటి హేమ బెంగుళూరు పోలీసులకు లేఖ రాశారు. బెంగుళూరు రేవ్ పార్టీలో తాను లేనంటూ హేమ వీడియో రిలీజ్ చేశారు. హేమ పార్టీలో ఉన్నారంటూ బెంగుళూరు పోలీసులు ఫోటో రిలీజ్ చేశారు.
Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ పోలీసుల విచారణకు హాజరుకాలేనని గళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాశారు. తన రేవ్ పార్టీలో లేనని వీడియో రిలీజ్ చేసిన నటి హేమకు బెంగుళూరు పోలీసులు షాక్ ఇచ్చారు ఆమె ఫోటోలను విడుదల చేశారు.
సోమవారం జరిగే విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు హేమ బెంగుళూరు పోలీసులకు లేఖరాశారు. సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు బెంగులూరు సీసీబీ పోలీసులు సిద్ధమయ్యారు. నేడు జరిగే విచారణకు హాజరుకావాలంటూ గతంలోనే హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో సహా 8 మందిని విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేవించారు. ఈ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఇప్పటికే తేల్చారు
వీడియో విడుదల…
రేవ్ పార్టీ జరిగిన సమయంలో నటి హేమ పేరు బయటకు రావడంతో ఆ రోజు తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, హైదరాబాద్‌లో చిల్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. తాజాగా విడుదల చేసిన మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చని, అబద్దం చెబితే దానిని కవర్ చేయడానికి 100 అబద్దాలు చెప్పాల్సి వస్తుందని అందుకే అబద్దాలు చెప్పకుండా ఉండటం మేలంటూ మరో వీడియోని పోస్ట్ చేశారు. మనసులో ఏమి పెట్టుకోకూడదని, తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కాసేపట్లోనే డిలీట్ చేశారు.
రేవ్ పార్టీలో నటి హేమ కూడా పోలీసులకు దొరికారు. కానీ తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ హేమ ఓ వీడియోను విడుదలచేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు కర్ణాటక పోలీసులు ధృవీకరించారు. తొలుత ఆమె పేరును కృష్ణవేణిగా నమోదు చేశారు.
బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గోన్న వారిలో చాలామంది డ్రగ్స్ వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం 156మందిని ఫాం హౌస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 109మంది డ్రగ్స్ వినియోగించినట్టు రక్త పరీక్షల్లో తేలింది. వీరిలో 59మంది పురుషులు, 27మంది మహిళలు ఉన్నారు. పార్టీలో పాల్గొన్న వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారు. హేమ.. కృష్ణవేణి పేరుతో రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బెంగుళూరు పోలీసులు స్పష్టం చేశారు. ఆమె కూడా మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు నిర్ధారించారు.
బెంగుళూరులో సన్‌సెట్ టూ సన్ రైజ్ పేరిట నిర్వహించిన పార్టీలో దాదాపు 200మంది పాల్గొన్నారు. వీరిలో ప్రధాన నిందితులు నలుగురు మినహా మిగిలిన వారిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఒక్కొక్కరి నుంచి పార్టీలో పాల్గొనడానికి రూ.2లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. రక్త పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని విచారించనున్నారు.
ఏం జరిగిందంటే…
బెంగుళూరులో గత సోమవారం తెల్లవారు జాము వరకు జరిగిన రేవ్ పార్టీని స్థానిక పోలీసులు భగ్నం చేశారు. కాన్‌కర్డ్ ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీపై దాడి చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో విజయవాడకు చెందిన క్రికెట్ బుకీ లంకపల్లి వాసు పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సినీ నటులు మాజరైనట్టు పోలీసులు గుర్తించారు.