Kalki 2898 AD: అతను లేకపోతే సినిమా బయటకు రాదు.. ఏపీ సీఎంపై కల్కి నిర్మాత కామెంట్స్ ఇవే!
Kalki 2898 AD Producer About Prabhas Cooperation: ప్రభాస్ నటించి లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ నిర్మాత సి అశ్వనీదత్ ఇటీవల ఆసక్తికర విశేషాలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రభాస్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కామెంట్స్ చేశారు.
Ashwini Dutt About Chandrababu: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ మూవీ కల్కి 2898 ఏడీ మూవీ. ఇప్పటికే రూ. 550 కోట్లు సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి 2898 ఏడీ నిర్మాత సి అశ్వనీదత్ ఆసక్తికర విశేషాలు చెప్పారు.
ఇందులో 'బుజ్జి' (కారు)ని కూడా ఒక పాత్ర చేశారు. ఈ ఆలోచన ఎలా అనిపించింది?
ఇదంతా నాగ్ అశ్విన్ విజన్. ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాలో చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు.
ఈ కథ అనుకున్నప్పుడే పార్ట్ 2 ఐడియా ఉందా ?
అవునండీ. ఈ స్టొరీ అనుకున్నప్పుడే పార్ట్ 2 థాట్ వచ్చింది. కమల్ హాసన్ గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. కమల్ గారిది అద్భుతమైన పాత్ర.
కల్కి విషయంలో ఎలాంటి టెన్షన్ పడ్డారు?
టెన్షన్ ఏమీ లేదండీ. మిడ్ సమ్మర్‌లో రిలీజ్ అయితే బావుంటుందని అనుకున్నాం. అయితే మే 9 పోస్ట్ పోన్ అయింది. తర్వాత జూన్ 27 కరెక్ట్ అనుకోని ఆ డేట్‌కి తీసుకొచ్చాం. నాగీ, స్వప్న, ప్రియాంక ఈ ముగ్గురే కాపీ చూశారు. దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందనే ఉద్దేశంతోనే తీశాం. ఆ ఉద్దేశం నెరవేరింది.
పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడు?
ఇప్పుడే ఏం తెలీదండి. నెక్ట్స్ ఇయర్ సమ్ వేర్ ఈ టైంలోనే రావచ్చు.
గతంలో శక్తి పీఠాలు నేపథ్యంలో శక్తి లాంటి సినిమా చేసినప్పుడు అలాంటి సబ్జెక్ట్ ఎందుకని కొందరు చెప్పారని అన్నారు. ఇప్పుడు దానికంటే పవర్‌ఫుల్ మహాభారతం సబ్జెక్ట్ చేయడం భయం అనిపించలేదా?
లేదండీ. నాగీ ఈ కథ చెప్పినప్పుడే చాలా పకడ్భందీగా ఫెంటాస్టిక్‌గా చెప్పారు. దీంతో నేను ఎలాంటి ప్రశ్నే వేయలేదు.
స్వప్నగారు రికార్డ్స్ గురించి అడిగితే సినిమాపై ప్రేమతో చేశామని అన్నారు? మీరు ఏం చెప్తారు?
రికార్డ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి. కానీ, ఈసారి వస్తున్న రికార్డ్స్ చాలా అద్భుతం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ ఈ అద్భుతాన్ని చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం.
ప్రభాస్ గారి కోపరేషన్ ఎలా ఉంది?
చాలా బావుంది అండీ. ప్రభాస్ గారి కోపరేషన్ లేకపోతే అసలు సినిమా బయటికి రాదు. డార్లింగ్ అంటే నిజంగా డార్లింగ్ లానే పని చేశారు.
మీరు క్లోజ్‌గా ఉన్న తెలుగుదేశం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇండస్ట్రీకి ఎలా ఉండబోతుంది?
ఇకపై చింతపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. పరిశ్రమకు అద్భుతంగా ఉంటుంది.
రాజమౌళి-ప్రభాస్ గారి ఎపిసోడ్ గురించి?
రాజమౌళి-ప్రభాస్ గారి ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్ గోపాల్ వర్మ క్యామియోస్‌ని కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
వైజయంతి మూవీస్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నారా?
ఇదొక అద్భుతమైన ప్రయాణం. నా మొదటి సినిమా నుంచి, నేటి కల్కి వరకూ అందరికీ రుణపడి ఉంటాను. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ సొంత మనిషిలా నన్ను దగ్గరకి చేర్చుకొని సినిమాలు చేశారు. అందరికీ హ్యాట్సాప్.
మీ అమ్మాయిలను చూసి తండ్రిగా ఎలా ఫీలౌతున్నారు?
నేను గొప్ప అదృష్టవంతుడిని. మా అమ్మాయిలు సంస్థని గొప్ప శిఖరాలకి తీసుకెళుతున్నారు. తండ్రిగా చాలా గర్వపడుతున్నాను.
కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లో ఇంకా ఎన్ని పార్ట్స్ రావచ్చు?
ఈ రెండే వస్తాయి. తర్వాత ఎలా ఉంటుందనేది స్క్రిప్ట్‌ని బట్టి చూడాలి.
వైజయంతీ మూవీస్ నుంచి రాబోయే సినిమాలు గురించి ?
శ్రీకాంత్ గారి అబ్బాయితో ఓ సినిమా ఉంటుంది. అలాగే దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా చేస్తున్నాం.
టాపిక్