Crime news : హైదరాబాద్‌లో దారుణం.. తల్లీకూతుళ్లను ఇంట్లో బంధించి, ఇటుకలతో గోడ కట్టి!
Woman bricked to wall : భూవివాదం నేపథ్యంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. తల్లీకూతుళ్లు, వారి బంధువులు.. ఇంట్లో బంధించి, ఇటుకలతో గోడ కట్టేశారు.
పాకిస్థాన్ సింధ్ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో దారుణ, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భూవివాదం నేపథ్యంలో తల్లీకూతుళ్లను ఇంట్లో బంధించిన బంధువులు.. ఏకంగా ఇటుకలతో గోడ కట్టేశారు!
ఇదీ జరిగింది..
హైదరాబాద్‌లోని లాతిఫాబాద్ నెం.5 ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. తల్లీకూతుళ్లను ఇటుకలతో గోడ కట్టారని స్థానికులకు తెలిసింది. వారు వెంటనే సంబంధిత ఇంటికి వెళ్లి, గోడను కూల్చేసి, బాధితులను రక్షించారు.
ఈ ఘటనపై సమాచారం అందిన అనంతరం ఘటనాస్థలానికి వెళ్లారు పోలీసులు. జరిగిన విషయాన్ని వారికి బాధిత మహిళ వివరించింది.
సుహైల్‌గా పిలిచే తన మరిది, అతని కొడుకులతో తన ఇంటికి వచ్చినట్టు, భూమి విషయంపై గొడవపడినట్టు చెప్పింది. వారి వద్ద తమ డాక్యుమెంట్లు ఉన్నాయని, అది అడ్డంపెట్టుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. చివరికి.. తమను ఇంట్లో బంధించి, ఇటుకలతో గోడ కట్టినట్టు వివరించింది. ఆ సమయంలో తాము చాలా భయపడినట్టు పేర్కొంది.
ఇదీ చూడండి:- New Criminal Laws : కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాక అన్ని కేసులూ వాటి కిందే నమోదు చేస్తారా?
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకుంటామని హామీనిచ్చారు. ఇంతటి హీనమైన నేరానికి పాల్పడిన వారిని పట్టుకునే బాధ్యత తమపై ఉందని, ప్రజలు వ్యవస్థపై నమ్మకం ఉంచాలని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ డా. ఫారుఖ్ లింజర్ తెలిపారు. కానీ ఇప్పటివరకు నిందితులను పట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్థాన్‌లో నేరాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. భూ వివాదం చుట్టూ మర్డర్ల నుంచి కిడ్నాప్‌ల వరకు కృరమైన నేరాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.
పేషావర్‌లోని చంకానీ ప్రాంతంలో మే 24న ఐదుగురు దారుణ హత్యకు గురయ్యారు. భూవివాదం ఇందుకు కారణమని తెలుస్తోంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడం, తుపాకులతో కాల్చుకోవడంతో ఈ ఘటన జరిగింది. భూమి విషయంలో చాలా కాలంగా ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు, ఉద్రిక్తత ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
ఇలాంటి ఘటనలు పాకిస్థాన్‌లో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటున్నాయి అని స్థానిక మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తూ ఉంటాయి.
అంతేకాదు.. పాకిస్థాన్‌లో రేప్‌లు, సామూహిక అత్యాచారాలు సైతం నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి.
సంబంధిత కథనం