Undisturbed Sleep : మంచి నిద్ర కావాలా? అయితే ఇలా చేయండి-you want undisturbed sleep at night here are some tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Undisturbed Sleep : మంచి నిద్ర కావాలా? అయితే ఇలా చేయండి

Undisturbed Sleep : మంచి నిద్ర కావాలా? అయితే ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu
Feb 13, 2023 08:10 PM IST

Tips For Good Sleep : ఈ కాలంలో చాలా మందికి నిద్ర సమస్య. బిజీబిజీ లైఫ్.. ఎవరూ ఏ టైమ్ కు పడుకుంటున్నారో తెలియదు. 8 గంటలు పడుకున్నా.. సరిగా నిద్రపోనట్టుగానే అనిపిస్తుంది. అందుకే మంచి నిద్రపోవాలంటే.. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

నిద్ర
నిద్ర

మన శరీరానికి నిద్ర(Sleep) చాలా అవసరం. కానీ జీవితంలో హెక్టిక్ షెడ్యూల్ కారణంగా.. నిద్రలేమీ సమస్య వెంటాడుతోంది. మన శరీరం, మనసు సక్రమంగా పనిచేయడానికి నిద్ర ముఖ్యం. మీకు రాత్రిపూట సరైన నిద్ర లేకపోతే.. రక్తపోటుకు కారణమవుతుంది. ఇది గుండె జబ్బుల(Heart Disease) ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు రక్తపోటు పెరిగినప్పుడు అవయవాలు సక్రమంగా పనిచేయవు. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇలా ఎన్నో సమస్యలు.

ప్రశాంతమైన విశ్రాంతి శరీరానికి ఉంటేనే మనిషికి ఆరోగ్యం. రోజంతా మనల్ని యాక్టివ్ గా ఉండేలా చేసేది శరీరానికి విశ్రాంతి. నిద్ర అనేది మన దినచర్యలో సహజమైన, ఆవశ్యకమైన భాగం. ఇది మనకు శక్తిని అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని(Health Life) గడపడానికి అవసరం. సరైన నిద్ర మనసు, శరీరానికి పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. తాజాగా అనిపిస్తుంది. మనల్ని శక్తివంతంగా, సంతోషంగా చేస్తుంది. మధ్యలో ఎందుకో తెలియకుండా.. కొంతమందికి మెలుకువ వస్తుంది. సగం సగం అసంపూర్తిగా నిద్రపోవడం వల్ల బాధ, బలహీనత, నీరసం, తక్కువ జీవితకాలం మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి.

సరైన నిద్ర పొయేందుకు ఏం చేయాలి

పడుకునే ముందు మీ పాదాలను కడగాలి. అరికాళ్లకు మసాజ్ చేయడం కూడా మంచిది.

నిద్రపోతున్నప్పుడు, గాలి ప్రసరించేలా వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులను ధరించండి.

నిద్రపోయే ముందు దీర్ఘంగా లోతైన శ్వాస తీసుకోండి. ధ్యానం చేయండి.

దక్షిణం వైపు మీ పాదాలను ఉంచి నిద్రించకండి. గురువు, దేవుని విగ్రహం, దేవతలు, దేవతల చిత్రాలు, వ్యక్తులు, వస్తువులు, గౌరవప్రదమైన ప్రదేశాల వైపు పెట్టొద్దు.

వంటగదిలో నిద్రించవద్దు. పడకగదిలో ఆహార పదార్థాలను ఉంచవద్దు.

పడకగదిలో స్వచ్ఛమైన గాలి ఉండేలా చూసుకోండి.

చీకటి, తడి గదిలో ఎప్పుడూ నిద్రపోకండి.

తలను కొంచెం పైకి లేపి, సన్నని దిండు పెట్టుకోండి.

ఆహారపు అలవాట్లు నిద్ర సంపూర్ణతను ప్రభావితం చేస్తాయి. సరిగ్గా, సరైన సమయంలో తినండి. లేట్ డిన్నర్లు(Late Dinner) చేస్తే జీర్ణం కావడానికి గంటల సమయం పడుతుంది. శరీర కణాలు విశ్రాంతి మోడ్‌కు రావాలంటే.. రాత్రి భోజనం చాలా ముఖ్యం. దాన్ని సరైన సమయంలో తీసుకోవాలి.

రాత్రిపూట కెఫిన్, కొవ్వులు, సుగంధ ద్రవ్యాలు, చక్కెర(Sugar) అన్నీ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. ఆహార శోషణ శరీర వేడి, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు, కండరాలను ప్రేరేపిస్తుంది. ఇవన్నీ మిమ్మల్ని మరింత మేల్కొల్పుతుంది.

సంబంధిత కథనం