Running Technique | పరుగెత్తేటపుడు నోటితో శ్వాస తీసుకుంటే ఏం జరుగుతుంది?-to lose your over weight follow this running technique ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  To Lose Your Over Weight Follow This Running Technique

Running Technique | పరుగెత్తేటపుడు నోటితో శ్వాస తీసుకుంటే ఏం జరుగుతుంది?

Running
Running (Pixabay)

రన్నింగ్ చేస్తే కేలరీలు చాలా ఖర్చు అవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు రన్నింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఎలా రన్నింగ్ చేయాలనే దానిపై నిపుణులు కొన్ని టెక్నిక్స్ తెలిపారు. అవేంటో మీరూ తెలుసుకోండి.

ఫిట్‌నెస్‌ సాధించడం విషయంలో ఒకప్పటికి, నేటికి పరిస్థితులు మారాయి. ఇంతకుముందు బరువు తగ్గాలి, శరీరాన్ని సన్నగా మార్చాలి అంటే జిమ్‌కి వెళ్లడం, భారీ బరువులు ఎత్తడం జిమ్‌లో అనేక రకాల పరికరాలతో కసరత్తులు చేయడం జరిగేది. అయితే కరోనా కారణంగా చాలాకాలం పాటు జిమ్‌లు మూతబడ్డాయి. దీంతో ప్రజలు మళ్లీ సాంప్రదాయ పద్ధతులను అవలంబించడం ప్రారంభించారు. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం పెరిగింది. రన్నింగ్, జాగింగ్, వాకింగ్ లాంటివి చేయడంతో పాటు ఇంట్లోనే ఉండి ఫిట్‌నెస్ ట్యుటోరియల్‌లను వీక్షిస్తూ ఇంట్లోనే ప్రాథమిక కార్డియో, యోగా భంగిమలను చేయడం ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇవి ఎంతో ప్రభావవంతంగా పనిచేయడంతో ప్రజలు ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చారు. జిమ్‌లో ఏడాదికి రుసుము చెల్లించి కొద్దిరోజులు మాత్రమే జిమ్ ఉపయోగించుకోవడం కంటే సంప్రదాయ పద్ధతులను అనుసరించడమే అన్ని విధాల మేలనే భావనలోకి వచ్చారు.

రన్నింగ్ అనేది గొప్ప ఫిట్‌నెస్ యాక్టివిటీ. రన్నింగ్ చేయడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు, అనుకున్న ఫిట్‌నెస్ లక్ష్యాన్ని సాధించవచ్చు. రన్నింగ్ చేయడానికి ఎలాంటి యాంత్రిక సంపత్తి అవసరం లేదు. మీ అంత మీరుగా ప్రేరణ పొంది ఒక దూరాన్ని నిర్ధేషించుకొని పరుగు తీయడం ప్రారంభించండి. తక్కువ వ్యవధిలో మంచి సంఖ్యలో కేలరీలను బర్న్ చేసుకోగలరు. తక్కువ వ్యవధిలో మంచి సంఖ్యలో కేలరీలను బర్న్ చేస్తుంది. 30 నిమిషాల మోడరేట్-స్పీడ్ రన్ కూడా వందల కొద్దీ కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. వేగంగా పరుగుతీస్తే మరిన్ని ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు అంటున్నారు.

ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి, వేగంగా అలాగే ఎక్కువసేపు పరుగెత్తడంలో సహాయపడే బ్రీతింగ్ ట్రిక్‌ను నిపుణులు డీకోడ్ చేసారు.

పరుగెత్తేటపుడు ప్రతీ మూడు అడుగులకు శ్వాసతీసుకోవాలి, అలాగే ప్రతీ రెండు అడుగులకు శ్వాస వదలాలి. ఎక్కువ ఒత్తిడి కలిగేలా శ్వాస తీసుకోకూడదు. ఉఛ్వాస- నిశ్వాసలు లయబద్ధంగా సాగాలి. శ్వాసను అదిమి పట్టుకోవడం ద్వారా రక్తపోటును పెంచుతుంది, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటును కూడా ప్రేరేపిస్తుంది. అందువల్ల రన్నింగ్ లేదా ఇంటెన్సివ్ వర్కవుట్‌లు చేసేటపుడు సరిగ్గా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకుంటుండటం వల్ల కండరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. పరుగెత్తేటపుడు వెన్నెముకను నిటారుగా ఉంచండి. ఇలా చేస్తే ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. భుజాలు, కండరాలను సడలిస్తుంది. 

తీవ్రంగా రన్నింగ్ చేస్తున్నపుడు.. కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి, నీరసం నిరోధించడానికి గాలి పీల్చడం, వదలడం రెండూ - నోటి ద్వారా చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్