Tuesday Motivation : మీ జీవితంలో వారిని మరచిపోయారంటే.. మీకన్నా మూర్ఖులు మరొకరుండరు..
Tuesday Motivation : మనతో అన్ని ఉన్నప్పుడూ చుట్టూ చాలా మంది ఉంటారు. కానీ మన దగ్గర ఏమిలేనప్పుడు మనతో ఉండేవారిని ఎప్పటికీ మరచిపోకండి. ఎందుకంటే.. అన్ని ఉన్నప్పుడే ఎవరైనా మీకు తోడుగా ఉంటారు. కానీ మన దగ్గర ఏమిలేనప్పుడు మనల్ని నమ్మి.. మనతో ఉన్నవారే మనవారు.
Tuesday Motivation : అందరూ మనవారే అనుకోవడంలో తప్పులేదు. కానీ అందరూ మిమ్మల్ని మన అనుకోవాలిగా. కొందరు మనతో అన్ని ఉన్నప్పుడు.. ఎలాంటి ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడు మన దగ్గరికి వస్తారు. మరికొందరు మన సక్సెస్ అయ్యాక.. మావాడే అని చెప్పుకుంటారు. అప్పటివరకు మీరు అడుక్కుని తింటున్నా పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం మనకు ఏమిలేనప్పుడు.. ఏమి సాధించనప్పుడు.. మనతోనే ఉంటూ.. మన కష్టాలు పంచుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే వారే మనవాళ్లు.
కష్టాల్లో తోడున్న వారే నిజమైన స్నేహితులు. అన్నిసార్లు మనకి తోడుగా.. మన పక్కనే వాళ్లు ఉండనవసరం లేదు. మనం ఒంటరిగా ఉన్నా.. లేదా ఎవరూ లేరు అనుకునే సమయంలో.. పర్లేదు నా అనుకునేవాళ్లు ఉన్నారులే.. వాళ్లు నన్ను కచ్చితంగా అర్థం చేసుకుంటారు అనే భావన మనకి కల్పిస్తారు. అలాంటివాళ్లని జీవితంలో మీరు ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా మరచిపోకండి. మీరు వారిని మరచిపోయారంటే.. మీరు జీవితంలో ఎంత సంపాదించినా.. ఎప్పటికీ గొప్పవారు కాలేరు.
ఎందుకంటే ఎంత ఎదిగినా నేల మీదనే ఉండాలి అనేది కచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరూ గొప్పవారు అవ్వాలి అనుకుంటాము. దానికోసం కృషి చేస్తూ ఉంటాము. అయితే ఒక్కసారి సక్సెస్ అయ్యాక.. ఈ ప్రయాణంలో మనకి తోడున్న వారిని మరచిపోతూ ఉంటాము. ఒక్కోసారి వర్క్ బిజీలో ఉంటాము. అలా ఉండి.. కొంచెం గ్యాప్ తీసుకుంటే పర్లేదు. కానీ గర్వం తలకెక్కి.. అయినవారికి అందుబాటులో లేనంత బిజీగా మారిపోవడం అనేది ఎన్నటికీ హర్షించదగినది కాదు.
మనం జీవితంలో ఎన్ని సాధించినా.. మనం ఎక్కడినుంచి వచ్చాము అనేది మరచిపోకూడదో.. అలానే మనతో ఎవరూతోడుగా ఉన్నారనేది కూడా మరచిపోకూడాదు. మన అనుకునే వాళ్లని దూరం పెట్టారంటే.. మీరు అన్ని ఉన్నా.. సంతోషంగా ఉండలేరు. మీరు కష్టంలో ఉన్నా.. బాధలో ఉన్నా.. మీకు సంతోషాన్ని అందించేవారికి ఎప్పుడూ దూరంగా ఉండకండి. మీకు ఆనందాన్ని ఇస్తూ.. కష్టాల్లో కృంగిపోకుండా చూసేవారితో మీ జీవితం చాలా బాగుంటుంది.
సంబంధిత కథనం
టాపిక్