ఎప్పుడూ నీరసంగా ఎందుకు? ఇలా హుషారుగా ఉండండి!-tips on how to energise yourself ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఎప్పుడూ నీరసంగా ఎందుకు? ఇలా హుషారుగా ఉండండి!

ఎప్పుడూ నీరసంగా ఎందుకు? ఇలా హుషారుగా ఉండండి!

Mar 11, 2022, 10:55 PM IST HT Telugu Desk
Mar 11, 2022, 10:53 PM , IST

అలిసిపోయినట్లుగా బాగా నీరసంగా అనిపిస్తుందా? అంటే మీకు శక్తి సరిగ్గా లభించండం లేదని అర్థం. మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని పవర్ ఫుల్ టిప్స్ అందిస్తున్నాం. ఫాలో అయిపోండి..

పనిచేసేటపుడు పరధ్యానంలోకి వెళ్లడం, అన్ని పనులు వదిలేసివెళ్లి పడుకోవాలనిపించడం.. ఇలా మీకేమైనా అనిపిస్తుందా? అయితే మీరు ఈ విషయంలో ఒంటరి కాదు. ఇలా చాలా మంది ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారు. మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ చిట్కాలు పాటించండి.

(1 / 8)

పనిచేసేటపుడు పరధ్యానంలోకి వెళ్లడం, అన్ని పనులు వదిలేసివెళ్లి పడుకోవాలనిపించడం.. ఇలా మీకేమైనా అనిపిస్తుందా? అయితే మీరు ఈ విషయంలో ఒంటరి కాదు. ఇలా చాలా మంది ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారు. మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ చిట్కాలు పాటించండి.(Unsplash)

మొదటగా మీరు మీ నిద్రపై దృష్టి పెట్టండి. శరీరానికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తారు. పడుకునే ముందు మీ శరీరాన్ని బార్లా చాపండి, ఆపై మీ మనస్సును ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకోండి. అయితే నిద్రపోయే కనీసం ఒక గంట ముందు ఎలాంటి మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ స్క్రీన్ వైపు చూడొద్దని సలహా.

(2 / 8)

మొదటగా మీరు మీ నిద్రపై దృష్టి పెట్టండి. శరీరానికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తారు. పడుకునే ముందు మీ శరీరాన్ని బార్లా చాపండి, ఆపై మీ మనస్సును ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకోండి. అయితే నిద్రపోయే కనీసం ఒక గంట ముందు ఎలాంటి మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ స్క్రీన్ వైపు చూడొద్దని సలహా.(Unsplash)

మానసిక ఒత్తిడి మన శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి మెంటల్ హెల్త్ ఎంతో ముఖ్యం. మీ మనస్సు, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోవడానికి యోగ, ధ్యానం, ఇతర వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు మీ ఒత్తిడిని అదుపులో ఉంచుకోగలుగుతారు. తద్వారా ప్రశాంతంగా ఉండగలుగుతారు.

(3 / 8)

మానసిక ఒత్తిడి మన శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి మెంటల్ హెల్త్ ఎంతో ముఖ్యం. మీ మనస్సు, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోవడానికి యోగ, ధ్యానం, ఇతర వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు మీ ఒత్తిడిని అదుపులో ఉంచుకోగలుగుతారు. తద్వారా ప్రశాంతంగా ఉండగలుగుతారు.(Unsplash)

మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మానసికంగా ఆరోగ్యం ఉండటం ముఖ్యం. మీకు కేటాయించిన పనుల్లోనే మీ వర్క్ ఏదైనా ఉంటే పూర్తిచేసుకోండి. మిగతా సమయాల్లో వాటి గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా, నిశ్చింతగా ఉండండి.

(4 / 8)

మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మానసికంగా ఆరోగ్యం ఉండటం ముఖ్యం. మీకు కేటాయించిన పనుల్లోనే మీ వర్క్ ఏదైనా ఉంటే పూర్తిచేసుకోండి. మిగతా సమయాల్లో వాటి గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా, నిశ్చింతగా ఉండండి.(Unsplash)

మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి, ఎవరితో మాట్లాడటం ఇష్టం లేకపోతే పాటలు వినండి. ఇలా మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోండి.

(5 / 8)

మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి, ఎవరితో మాట్లాడటం ఇష్టం లేకపోతే పాటలు వినండి. ఇలా మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోండి.(Unsplash)

మీ అభిరుచిని ఒక అలవాటుగా మార్చుకోండి. వారంలో కొన్ని గంటలు తప్పకుండా ఆ పనికి కేటాయించండి. డాన్స్, సింగింగ్, పెయింటింగ్, క్రికెటింగ్, గార్డెనింగ్ ఏదైనా సరే. ఇది మీ మైండ్, బాడీని చురుగ్గా మారుస్తుంది.

(6 / 8)

మీ అభిరుచిని ఒక అలవాటుగా మార్చుకోండి. వారంలో కొన్ని గంటలు తప్పకుండా ఆ పనికి కేటాయించండి. డాన్స్, సింగింగ్, పెయింటింగ్, క్రికెటింగ్, గార్డెనింగ్ ఏదైనా సరే. ఇది మీ మైండ్, బాడీని చురుగ్గా మారుస్తుంది.(Unsplash)

ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. గో.. గోవా.. గాన్!

(7 / 8)

ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. గో.. గోవా.. గాన్!(Unsplash)

ఇతర గ్యాలరీలు