Good Night Sleep | త్వరగా నిద్రపట్టాలంటే ఇవి తినండి!-follow this night diet for a tight sleep ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Follow This Night Diet For A Tight Sleep

Good Night Sleep | త్వరగా నిద్రపట్టాలంటే ఇవి తినండి!

HT Telugu Desk HT Telugu
Mar 10, 2022 09:31 PM IST

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయం అవ్వాలన్నా, జీవక్రియ రేటు మెరుగుపడాలన్నా, మెదడు చురుగ్గా పనిచేయాలన్నా మనిషికి కనీసం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు ఎలాంటి అంతరాయం లేని నిద్ర ఉండాలని నిపుణులు అంటున్నారు.

foods for good night sleep
foods for good night sleep (shutter stock )

కొన్నిసార్లు వెంటనే నిద్రపడుతుంది, ఇంకొన్నిసార్లు పడుకుందామని ఎంత అనుకున్నా నిద్రపట్టదు. ఇందుకు మనం రాత్రిపూట తినే ఆహారం కూడా ఒక కారణం అవుతుందట. పడుకునే ముందు కొన్ని ఆహారపదార్థాలు తినడం, కొన్ని పానీయాలు సేవించడం వల్ల అవి నిద్రకు అంతరాయం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా వినే ఉంటారు సాయంకాలం కాఫీ తాగితే రాత్రికి నిద్రపట్టదు అని. ఇలా కొన్ని నిద్రకు భంగం కలిగిస్తే మరికొన్ని మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా సహకరిస్తాయట. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయం అవ్వాలన్నా, జీవక్రియ రేటు మెరుగుపడాలన్నా, మెదడు చురుగ్గా పనిచేయాలన్నా మనిషికి కనీసం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు ఎలాంటి అంతరాయం లేని నిద్ర ఉండాలని నిపుణులు అంటున్నారు.

బాదం

బాదం మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది, ఇది మన శరీరంలోని జీవ గడియారాన్ని నియంత్రించి సరైన సమయంలో నిద్ర కలిగించేందుకు ఉపకరిస్తుంది. బాదంపప్పులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం బాధను తగ్గించడమే కాకుండా ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది - దీంతో మనకు రిలాక్స్‌గా, కలతలేని నిద్రను ఆస్వాదించడానికి సహాయపడుతుంది. ఒక 30 గ్రాముల బాదంపప్పు తింటే మంచిదని సిఫారసు చేస్తున్నారు.

కివి పండ్లు

కివి పండ్లలో కేలరీలు తక్కువ ఉంటాయి, పోషకాలు ఎక్కువ ఉంటాయి.అంతేకాకుండా ఇందులో మెరుగైన నిద్రను కలిగించే గుణాలున్నాయని చెబుతున్నారు. కాబట్టి పడుకునేముందు ఒకటి, రెండు కివి పండ్లను తినాలని సూచిస్తున్నారు. ఈ పండు తినని వారితో పోలిస్తే తినేవారిలో నిద్ర నాణ్యతను 42% అలాగే నిద్రించే సమయం 5% నుండి 13% వరకు మెరుగుపడిందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

వాల్‌నట్

ఇంతకుముందు చెపిన్నట్లుగా శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగితే నిద్ర ఆవహిస్తుంది. పడుకునే ముందు కొన్ని వాల్‌నట్స్ తినడం ద్వారా ఈ హర్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. వీటిలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్ వంటి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం