తెలుగు న్యూస్ / ఫోటో /
Healthy Lifestyle | మీ లైఫ్‌స్టైల్లో ఈ 5 మార్పులు చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
ఇప్పటి మన లైఫ్‌స్టైల్‌కు ఏదో ఒక వ్యాధి బారిన పడటం సాధారణమైపోయింది. అందులోనూ రెండేళ్లకుపైగానే ఈ కొవిడ్ మహమ్మారి మనల్ని వేధిస్తోంది. ఇప్పటికే కొవిడ్ బారిన పడిన వాళ్లు దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతూనే ఉన్నారు. అయితే మందుల జోలికి వెళ్లకుండా మీ లైఫ్‌స్టైల్లో కొన్ని మార్పులు చేసుకొని ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటించండి.
ఇప్పటి మన లైఫ్‌స్టైల్‌కు ఏదో ఒక వ్యాధి బారిన పడటం సాధారణమైపోయింది. అందులోనూ రెండేళ్లకుపైగానే ఈ కొవిడ్ మహమ్మారి మనల్ని వేధిస్తోంది. ఇప్పటికే కొవిడ్ బారిన పడిన వాళ్లు దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతూనే ఉన్నారు. అయితే మందుల జోలికి వెళ్లకుండా మీ లైఫ్‌స్టైల్లో కొన్ని మార్పులు చేసుకొని ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటించండి.
(1 / 6)
కొవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఇప్పటికే చాలా మంది ఆరోగ్యవంతమైన జీవన విధానం వైపు అడుగులు వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. హెల్తీ లైఫ్‌స్టైల్‌ను అలవాటు చేసుకోకుండా.. ఆరోగ్య సమస్యలపైనే దృష్టి సారిస్తుండటం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు మోదీ నేచురల్స్ లిమిటెడ్ ఎండీ అక్షయ్ మోదీ అంటున్నారు. అంతేకాదు ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను అలవరచుకోవడానికి 5 టిప్స్ కూడా చెప్పారు.(Photo by Peter Conlan on Unsplash)
(2 / 6)
1. శరీరానికి ఏదో ఒక పని చెప్పండి - ఈ కాలంలో గంటల కొద్దీ సీట్లో నుంచి కదలకుండా చేయాల్సిన పనులు ఎక్కువవుతున్నాయి. ఈ కారణంగానే ఎక్కువ శాతం రోగాలు మనిషిని చుట్టుముడుతున్నాయి. అలా కాకుండా ప్రతి రోజూ ఎంతోకొంత శారీరక శ్రమ ఉండటం ఆరోగ్యానికి అత్యవసరం. ప్రతి రోజూ ఉదయాన్నే వర్కవుట్స్ చేయడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి చేయడం వల్ల శరీరంలోని కండరాలు యాక్టివ్‌గా మారుతాయి. ఇది రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇక 24 గంటలూ మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయే మన కళ్లకు కూడా విశ్రాంతి అవసరం. ఉదయాన్నే ఏదో ఒక స్పోర్ట్ ఆడటం, డ్యాన్స్ చేయడం వంటివి శరీరానికి మేలు చేస్తాయి. యోగా, మెడిటేషన్ కూడా ట్రై చేయొచ్చు.(Pixabay)
(3 / 6)
2. పౌష్టికాహారం తప్పనిసరి - ఈ రోజుల్లో చాలా మంది ఏదో కడుపు నింపుకోవడానికి తింటున్నారు తప్ప.. అసలు శరీరానికి అవసరమైన పౌష్టికాహారం జోలికి వెళ్లడం లేదు. శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు అందించే ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని గుర్తించండి. ఇక మీకు రోజూ అన్నం తినే అలవాటు ఎక్కువగా ఉంటే.. దానిని తగ్గించి రొట్టెలు, క్వినోవా వంటి వాటివైపు చూడటం మంచిది. వీలైనంత వరకూ ఆలివ్ ఆయిల్ వాడగలిగితే మరీ మంచిది. అతిగా తినొద్దు. వీలైతే రెండు గంటలకోసారి కొద్దికొద్దిగా తినండి. రసాయనాలు లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వాటిని తీసుకోవడం ఉత్తమం.(Pixabay)
(4 / 6)
3. సరైన నిద్రతో శరీరానికి బూస్ట్ - ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఎవరికైనా తప్పనిసరి. మన శరీరం రీఛార్జ్ అయ్యేది నిద్రలోనే. అలాంటి నిద్ర సరిగా లేకపోతే.. ఒంట్లో నీరసం వస్తుంది. రోజూ ఒకే విధంగా సమయానికి పడుకోవడం, లేవడం చేస్తే మీరు ఊహించనివిధంగా శరీరంలో మార్పులు వస్తాయి. మరీ తక్కువ నిద్ర, మరీ ఎక్కువ నిద్ర కూడా ప్రమాదమే. అన్నింటికంటే ముఖ్యంగా పడుకోవడానికి కనీసం అరగంట ముందు మీ మొబైల్, ల్యాప్‌టాప్, టీవీలకు దూరంగా ఉండటం మంచింది.(File Photo)
(5 / 6)
ఒత్తిడిని జయించండి - ఒత్తిడి అనేది మన గుండెకు అస్సలు మంచిది కాదు. అందుకే ఒత్తిడిని జయించడం నేర్చుకోవాలి. యాంగ్జైటీ లేదా మానిసిక ఆదుర్దాతో బాధపడుతున్న వాళ్లు ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్లూ రోజూ తాము చేయాల్సిన పనులను ఓ లిస్ట్‌గా రాసుకొని, ప్రాధాన్యత ప్రకారం ఆయా పనులు పూర్తి చేసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులకు ఓసారి సరదాగా ఓ ట్రిప్ ప్లాన్ చేయడం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇష్టమైన పనులు చేయడం వంటివి ఒత్తిడిని జయించడానికి ఉపయోగపడతాయి. చుట్టూ ఉన్న వాళ్లతో సానుకూల బంధాలు ఏర్పర్చుకోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది.(Unsplash)
(6 / 6)
5. చెడు అలవాట్లను మానుకోండి - ఇప్పటి ఒత్తిడితో కూడిన లైఫ్‌స్టైల్ చాలా మందిని స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అనారోగ్యకరమైన వాటికి దగ్గర చేస్తోంది. ఇలాంటివి చేయడం వల్ల తాత్కాలికంగా మీకు ఒత్తిడి నుంచి బయటపడినట్లు అనిపిస్తుందేమో కానీ.. దీర్ఘకాలంలో ఇవి చాలా ప్రమాదకరం. క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలూ రావచ్చు. కాబట్టి వీటిని క్రమంగా దూరం చేసుకుంటే మంచిది.(Getty Images/iStockphoto)
ఇతర గ్యాలరీలు