Post Workout Tips : వ్యాయామం చేసిన తర్వాత ఈ నియమాలు పాటించాలి-you must follow these post workout tips for weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Post Workout Tips : వ్యాయామం చేసిన తర్వాత ఈ నియమాలు పాటించాలి

Post Workout Tips : వ్యాయామం చేసిన తర్వాత ఈ నియమాలు పాటించాలి

Anand Sai HT Telugu
Jan 17, 2024 05:30 AM IST

Weight Loss Tips : చాలా మంది బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేస్తారు. కానీ వ్యాయామం తర్వాత చేయాల్సిన విషయాలను మరిచిపోతారు. దీంతో ఫలితం ఉండదు.

వ్యాయామం చిట్కాలు
వ్యాయామం చిట్కాలు

బరువు తగ్గాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది వ్యాయామం. చెమట పట్టడం వల్ల మాత్రమే బరువు తగ్గుతారని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ఆలోచన పూర్తిగా తప్పు. బరువు తగ్గడానికి, మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం తర్వాత కొన్ని విషయాలను పాటించాలి.

నిజానికి బరువు తగ్గేందుకు ఎంతో కష్టపడుతాం. కొంతమంది జిమ్‌లో చెమటలు పట్టిస్తారు. కొందరు యోగా చేస్తారు. రోజులో కొంతసేపు వాకింగ్ చేస్తారు. ఇంత చేసినా ఫలితాలు రావు. కేవలం వ్యాయామం మాత్రమే చేస్తే సరిపోదు.. పోస్ట్ వర్కౌట్ రొటీన్‌ను కూడా అనుసరించాలి. వ్యాయామం తర్వాత శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం..

వ్యాయామం తర్వాత కూల్‌డౌన్ చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. వ్యాయామం తర్వాత కొంచెం కూర్చుంటే, నెమ్మదిగా మీ శరీరం మునుపటి ఉష్ణోగ్రత, సాధారణ హృదయ స్పందన రేటుకు వస్తుంది. లేదంటే మీరు మైకం, రక్తం గడ్డకట్టడం, మూర్ఛ కూడా అనుభవించవచ్చు. మీరు ఏ వ్యాయామం చేసినా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.

వ్యాయామం తర్వాత శరీరాన్ని సాగదీయడం కూడా చాలా మంచిది. 30 సెకన్ల పాటు సాగదీయడం మీ కండరాలు కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. వర్కవుట్‌ల సమయంలో చాలా చెమటలు పట్టడం సాధారణం. చెమటతో ద్రవం బయటకు వస్తుంది. వర్కవుట్ చేసిన తర్వాత ఎక్కువగా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. దీని వల్ల బరువు తగ్గడంతోపాటు కండరాలకు మంచిది. నీరు కండరాలను సరిచేయడానికి, కోలుకోవడానికి సాయం చేస్తుంది.

వ్యాయామం తర్వాత ఆకలిగా అనిపించడం సహజం. వ్యాయామం తర్వాత చిరుతిండి లాంటివి తింటే బెటర్. మరీ కడుపు నిండుగా తినొద్దు. ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలి. అంటే వేయించిన ఆహారం కాదు, ప్రొటీన్లు, కూరగాయలు అధికంగా ఉండే వాటిని తినవచ్చు. మీరు ప్రోటీన్ షేక్ తీసుకోవచ్చు. ఒక యాపిల్, కొన్ని బాదంపప్పులు వ్యాయామం తర్వాత చక్కటి స్నాక్స్. కానీ మితంగా తినాలి..

చెమటలు పట్టాక బర్గర్, చిప్స్ ప్యాకెట్ తింటే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటారు. అలా చేయడం ప్రమాదకరం. వ్యాయామం తర్వాత మీ శరీరానికి పోషకాహారం అవసరం. మీ కండరాలు, కీళ్ళు, ఇతర అవయవాలను పునరుజ్జీవింపజేసేది తీసుకోవాలి.

వ్యాయామం శరీరంపై చాలా ఒత్తిడిని తెస్తుంది. శరీరానికి కొంత సమయం విశ్రాంతి ఇవ్వాలి. లేకపోతే కండరాల నొప్పి ప్రారంభవుతుంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ కండరాలకు కూడా విశ్రాంతి లభిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడతాయి. వర్కవుట్ తర్వాత కండరాలను వదులుగా చేయాలి. లేదంటే కండరాల ఒత్తిడి, నొప్పి మొదలవుతాయి. తేలికపాటి వ్యాయామం మీ కండరాలను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. వర్కౌట్‌ల వల్ల విపరీతమైన చెమట పడుతుంది. శరీరం అసౌకర్యంగా ఉంటుంది. తాజాగా ఉండేందుకు స్నానం చేయండి.

Whats_app_banner