Baby Trailer: భావోద్వేగమైన లవ్ స్టోరీ: ‘బేబీ’ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. హృదయాన్ని హత్తుకునేలా డైలాగ్స్-anand devarakonda vaishnavi chaitanya baby movie trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baby Trailer: భావోద్వేగమైన లవ్ స్టోరీ: ‘బేబీ’ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. హృదయాన్ని హత్తుకునేలా డైలాగ్స్

Baby Trailer: భావోద్వేగమైన లవ్ స్టోరీ: ‘బేబీ’ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. హృదయాన్ని హత్తుకునేలా డైలాగ్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 07, 2023 10:24 PM IST

Baby Trailer: బేబీ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఈ ట్రైలర్ చాలా ఎమోషనల్‍గా ఉంది.

బేబీ సినిమా పోస్టర్
బేబీ సినిమా పోస్టర్

Baby Trailer: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన బేబీ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. నేషనల్ అవార్డు గెలిచిన కలర్ ఫొటో చిత్రానికి కథను అందించిన సాయి రాజేశ్.. బేబీ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. బేబీ సినిమా ట్రైలర్ నేడు (జూలై 7) విడుదలైంది. హృదయాన్ని హత్తుకునే ప్రేమ, భావోద్వేగాలు, మంచి డైలాగ్‍లతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వివరాలివే..

పాఠశాలలో చదువుతున్న సమయంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మధ్య ప్రేమ చిగురించే సీన్‍తో బేబీ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్‌ పాత్రలో ఆనంద్ నటిస్తున్నాడు. వీరి ప్రేమ చాలాకాలం చాలా ఆనందంగా సాగుతుంది. అయితే, కాలేజీకి వెళ్లిన తర్వాత విరాజ్ అశ్విన్‍తో వైష్ణవికి పరిచయం ఏర్పడుతుంది. అనంతరం వైష్ణవి జీవితంలో మార్పులు వస్తాయి. వైష్ణవిని విరాజ్ ప్రేమిస్తాడు. దీంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం సాగుతుందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇద్దరి ప్రేమ మధ్య నగిలే అమ్మాయిలా వైష్ణవి, చిన్నతనం నుంచి నిజంగా ఆమెను ప్రేమించే పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్భుతంగా చేసినట్టు ట్రైలర్‌లో అర్థమవుతోంది. ఎమోషనల్ డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో హైలైట్‍గా నిలిచాయి.

“ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని” అని వైష్ణవి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడంటూ ఆనంద్ చెప్పే డైలాగ్ మెప్పిస్తుంది. “మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు” అని వైష్ణవి చెప్పే ఎమోషనల్ డైలాగ్‍తో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తంగా 3 నిమిషాల 18 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఎమోషనల్‍గా సాగింది. “నువ్వేమైనా అర్జున్ రెడ్డి అనుకుంటున్నావా” అంటూ వైష్ణవి చెప్పిన డైలాగ్ కూడా ఈ ట్రైలర్‌లో ఉంది. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం కూడా సినిమాకు తగ్గట్టు హృద్యంగా ఉంది. జూలై 14వ తేదీన బేబీ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

బేబి చిత్రంలో నాగబాబు, లిరిష్, కుసుమ, సాత్విక్ ఆనంద్ కీలకపాత్రల్లో నటించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‍కేఎన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రముఖ డైరెక్టర్ మారుతీ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.

Whats_app_banner