Fish Eyes Benefits : చేప కళ్లు తింటే చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. ఇక వదలకండి
Fish Eyes Benefits In Telugu : చేపలు ఆరోగ్యానికి మంచివి. కానీ మనం చేప కళ్లను మాత్రం తినకుండా వదిలివేస్తాం. దీనితో అనేక ప్రయోజనాలను కోల్పోతున్నాం.
చేప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది వైద్యులు వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేపలను తినాలని చెబుతారు. ఎందుకంటే చేపలో మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్. ఈ కొవ్వు ఆమ్లం ఇతర ఆహారాలలో ఉన్నప్పటికీ, ఇది చేపలలో పుష్కలంగా ఉంటుంది.
కొంతమంది చేపల కండకలిగిన భాగాలను మాత్రమే తిని తల తీసేస్తారు. నిజానికి చేపల తల, కళ్లలో చాలా పోషకాలు ఉంటాయి. మీరు చేపల పూర్తి ప్రయోజనాలను పొందాలనుకుంటే పారేయకండి. దాని కళ్లను తప్పకుండా తినండి. చేప కళ్లు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలియాలంటే ఈ కథనం చదవండి. ఎందుకంటే చేప కళ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.
కంటి చూపు బాగుంటుంది
చేప కళ్లను తింటే కంటి చూపు బాగుంటుంది. కంటి చూపు సమస్య ఉన్నవారు చేపకళ్లను నిత్యం తింటే కంటి చూపు సమస్య నయమవుతుంది. దీనికి ప్రధాన కారణం చేపల కళ్లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. మీకు కంటిచూపు సమస్యలు ఉంటే చేపకళ్లను తినండి.
గుండె ఆరోగ్యానికి మంచిది
గుండె ఆరోగ్యానికి చేప చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చేపల్లోని పోషకాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రోజూ చేపల కళ్లు తినేవారికి గుండెపోటు, పక్షవాతం, ఇతర గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చేపల కళ్లను క్రమం తప్పకుండా తినండి.
ఆటిజం సమస్య తగ్గుతుంది
ఆటిజం వంటి మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు చేపలు సహకరిస్తాయి. ఆటిజం ఉన్న వ్యక్తి చాలా ఆత్రుతగా ఉంటారు, చాలా అలసిపోతారు. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. కానీ తరచూ చేపల కళ్లు తింటే అందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజంతో పోరాడి ఉపశమనం కలిగిస్తాయి.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది
రోజూ చేపలు తినేవారిలో జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి మెదడు సంబంధిత సమస్యల ముప్పు తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల కంటిని తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భావోద్వేగాలు సమతుల్యంగా ఉంటాయి.
మధుమేహులకు మంచిది
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు దీర్ఘకాలిక మంటను తగ్గించగలవని పరిశోధనలో తేలింది. చేపల కళ్లను తింటే మంటను తగ్గిస్తాయని మరొక అధ్యయనం కనుగొంది. మంట ఉంటే చేపల కళ్లు తినండి. చేపలను కళ్లతో తింటే మరో ప్రయోజనం మధుమేహం రాకుండా ఉంటుంది. చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. చేపలను క్రమం తప్పకుండా తింటే అది టైప్-1 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చేపల కళ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి ప్రశాంతమైన నిద్రను పొందడంలో మీకు సహాయపడుతుంది. సాల్మన్ చేపలు తింటే ఇంకా మంచిది. ఇతర చేపల కంటే ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం, ఫిష్ ఐ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చేపలు, దాని కళ్లను క్రమం తప్పకుండా తీసుకునే వారికి జీర్ణక్రియ, నోటి, స్వరపేటిక, పెద్దప్రేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది.