World Diabetes Day 2024: డయాబెటిస్ ఉన్న వారు ఈ 6 పోషకాలు తీసుకోవాల్సిందే.. నిర్లక్ష్యం వద్దు!
World Diabetes Day 2024: డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్‌గా తమ ఆహారంలో కొన్ని రకాల పోషకాలు ఉండేలా చేసుకోవాలి. ఈ పోషకాల వల్ల బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్‍లో ఉండేందుకు సహకరిస్తాయి. అవేంటంటే..
పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం అందరికీ చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తలు వహించాలి. రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రించే పోషకాలు ఉండే ఆహారాలను తినాలి. దీనివల్ల డయాబెటిస్ కంట్రోల్‍లో ఉంటుంది. వీటి వల్ల పూర్తిస్థాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. పోషకాల విషయంలో డయాబెటిక్స్ నిర్లక్ష్యం చేయకూడదు. మరో రెండు రోజుల్లో నవంబర్ 14వ తేదీన వరల్డ్ డయాబెట్స్ డే ఉంది. ఈ సందర్భంగా.. డయాబెటిస్ ఉన్న వారు తప్పకుండా తమ డైట్‍లో ఉండేలా చూసుకోవాల్సిన ఆరు పోషకాలు ఏవో ఇక్కడ చూడండి.
ఫైబర్
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటంతో పాటు షుగర్ శోషణ నెమ్మదవుతుంది. సోలబుల్ ఫైబర్, ఇన్‍సోలబుల్ ఫైబర్స్ ఉండే ఆహారాలను డయాబెటిస్‍తో బాధపడే వారు తమ డైట్‍లో తప్పకుండా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు (షుగర్ తక్కువగా ఉండేవి), బీన్స్, పప్పు ధాన్యాలు, నట్స్, సీడ్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ డీ
ఇన్సులిన్ సెన్సివిటీని విటమిన్ డీ మెరుగుపస్తుంది. గ్లోకోజ్ విషయంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే విటమిన్ డీని తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది. విటమిన్ డీ లోపం ఉండే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే డయాబెటిస్ కంట్రోల్‍లో ఉండేందుకు సరిపడా విటమిన్ డీని శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్లు, ఫ్యాటీ ఫిష్‍లు, ఫోర్టిఫైడ్ ఆహారాల్లో విటమిన్ డీ ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా కూడా విటమిన్ డీ అందుతుంది.
మెగ్నిషియం
శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు మెగ్నిషియం తోడ్పడుతుంది. ఇన్సులిన్ నిరోధాన్ని, గ్లూకోజ్ జీవక్రియను ఈ మినరల్ మెరుగుపరుస్తుంది. మెగ్నిషియం లోపం ఉంటే గ్లెసెమిక్ కంట్రోల్‍లో ఉండదు. అందుకే డయాబెటిస్ ఉన్న వారు మెగ్నిషియం తప్పకుండా తీసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉండేందుకు మెగ్నిషియం తోడ్పడుతుంది. ఆకుకూరలు, నట్స్, కూరగాయాలు, సీడ్స్, ధాన్యాల్లో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది.
జింక్
జింక్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. ఇన్సునిన్ స్రావం, ఉత్పత్తి జింక్ ముఖ్యంగా ఉంటుంది. అయితే, మోతాదు మేరకే జింక్ తీసుకునేలా జాగ్రత్త పడాలి. కాయధాన్యాలు, నట్స్, సీడ్స్ మాంసం లాంటి వాటిల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది.
పొటాషియం
బ్లడ్ ప్రెజర్‌ను పొటాషియం కంట్రోల్ చేయగలదు. అందుకే హైపర్ టెన్షన్ రిస్క్ ఉన్న మధుమేహగ్రస్తులకు ఈ పోషకం చాలా ముఖ్యమైనది. శరీరంలో ద్రవాలను కూడా పొటాషియం సమతుల్యం చేయగలదు. నాడీ సంకేతాలను మెరుగుపరుస్తుంది. అరటి, నారింజ, టమాటోలు, బంగాళదుంపలు, పాలకూరల్లో పొటాషియం అధికంగా ఉంటుంది.
క్రోమియం
క్రోమియం.. ఇన్సులిన్ చర్యను మెరుగుపచగలదు. గ్లూకోజ్ సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణంలో ఉండేందుకు ఉపకరిస్తుంది. బ్రకోలీ, బార్లీ, ఓట్స్, గ్రీన్ బీన్స్, బాదంల్లో క్రోమియం అధికంగా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్న వారు వైద్యులు సూచించిన మందులను వాడుతూ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా సమస్యలు తలెత్తితే వైద్యులను వెంటనే సంప్రదించాలి.