విటమిన్ డీ పుష్కలంగా ఉండే 5 రకాల వెజిటేరియన్ ఆహారాలు
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Sep 03, 2023
Hindustan Times Telugu
శరీరంలో 'విటమిన్ డీ' తగ్గితే ఎముకల సాంద్రత తగ్గడం, కండరాల నొప్పి, బలహీనత లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎముకల సాంద్రత తగ్గితే అది ఓస్టియోపోరోసిస్‍కు కూడా దారితీయొచ్చు. అందుకే విటమిన్ డీ పుష్కలంగా ఉండే ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.
Photo: Pexels
వెజిటేరియన్ల కోసం విటమిన్ డీ పుష్కలంగా ఉండే ఐదు రకాల ముఖ్యమైన ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
పొట్టగొడుగు (మష్రూమ్స్)ల్లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. పుట్టగొడుగులు తింటే శరీరంలోని ఎముకల సాంద్రత మెరుగవుతుంది. ఎముకుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Photo: Pexels
పనీర్ కూడా విటమిన్ డీ పుష్కలంగా ఉండే ఆహారం. దీంట్లో కాల్షియమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే పన్నీర్ తింటే మీ ఎముక దృఢత్వానికి తోడ్పడుతుంది.
Photo: Pexels
సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ లాంటి ఫోర్టిఫైడ్ పాలల్లోనూ విటమిన్ డీ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా మీ డైట్‍లో వీటిని యాడ్ చేసుకొని తాగితే విటమిన్ డీ మీ శరీరానికి కావాల్సినంత అందుతుంది.
Photo: Pexels
క్యారెట్‍ను జ్యూస్‍గా చేసి తాగినా శరీరానికి విటమిన్ డీ ఎక్కువగా అందుతుంది. కంటి ఆరోగ్యానికి ఇది చాలా తోడ్పడుతుంది. విటమిన్ డీ లోపం ఉన్నా భర్తీ అవుతుంది.
Photo: Pexels
సోయా చంక్స్, టోఫూ, సోయా మిల్క్ లాంటి సోయా ప్రొడక్టుల్లో విటమిన్ డీ, కాల్షియమ్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి