Diabetes: షుగర్ తక్కువగా ఉండే ఐదు పండ్లు.. డయాబెటిస్ ఉన్న వారు దిగులు లేకుండా తినేయవచ్చు!
Diabetes: డయాబెటిస్ ఉన్న వారు షుగర్ తక్కువగా ఉండే పండ్లను తినవచ్చు. వీటివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం తక్కువగానే ఉంటుంది. షుగర్ స్వల్పంగా ఉండే పండ్లు ఏవంటే..
డయాబెటిస్‍తో బాధపడుతున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ ఉండటంతో పండ్లను కూడా వీరు తినకూడదనే నమ్ముతారు. అది నిజం కూడా. షుగర్ ఎక్కువగా ఉండే పండ్లు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగని అన్ని పండ్లను ఒకేలా చూడకూడదు. షుగర్ కంటెంట్ తక్కువగా ఉండే పండ్లు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని డయాబెటిస్ ఉన్న వారు తినవచ్చు. ఇవి తీసుకున్నా రక్తంలో చెక్కర స్థాయి ఎక్కవగా పెరగదు. అలా షుగర్ తక్కువగా ఉండే ఐదు రకాల పండ్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీలు లాంటి బెర్రీలు రుచికరంగా ఉంటాయి. అలాగే వీటిలో షుగర్ చాలా స్వల్పంగా ఉంటుంది. వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్లెసెమిక్ ఇండెక్స్, కార్బొహైడ్రేట్లు కూడా ఈ పండ్లలో తక్కువే. అందుకే డయాబెటిస్ ఉన్న వారు బెర్రీలను తినొచ్చు. తీపి పదార్థాలు తినాలనే కోరికను కూడా బెర్రీలు తగ్గిస్తాయి. ఇలా కూడా డయాబెటిక్స్‌కు ఇవి మేలు చేస్తాయి.
యాపిల్
యాపిల్‍లో షుగర్ చాలా స్వల్పంగా ఉంటుంది. ఇతర చాలా పండ్లతో పోలిస్తే యాపిల్‍లో షుగర్ కంటెంట్ చాలా తక్కువ. గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉండటంతో బ్లడ్ షుగర్ లెవెళ్లపై ప్రభావం అత్యల్పమే. సోలబుల్ ఫైబర్ ఉండటంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా ఈ పండు తోడ్పడుతుంది. అందుకే మధుమేహం ఉన్న వారు ఎలాంటి ఆందోళన లేకుండా యాపిల్ పండ్లను తినేయవచ్చు.
నారింజ
నారింజ పండ్లలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మెండుగా ఉంటాయి. గ్లెసెమిక్స్ ఇండెక్స్ కూడా దీంట్లో తక్కువే. అందుకే డయాబెటిస్ ఉన్న వారు నారింజ పండ్లను తినొచ్చు. అయితే, మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మోస్తరుగా తినాలి.
దానిమ్మ
దానిమ్మ పండ్లలో షుగర్‌తో పాటు గ్లెసెమిక్ ఇండెక్స్, గ్లెసెమిక్ లోడ్ అత్వల్పంగా ఉంటాయి. గ్లోకోజ్ లెవెల్స్ అధికంగా ఉండే వారికి ఇది సూటవుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ కూడా ఈ పండులో మెండుగా ఉంటాయి. ఓవరాల్ ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది.
బొప్పాయి
బొప్పాయిని డయాబెటిస్ ఉన్న వారు తినొచ్చు. ఈ పండులో షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా స్వల్పమే. అందుకే ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగవు. బొప్పాయిలో విటమిన్లు, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.