నారింజ పండ్లలో చాలా పోషకాలు.. శరీరానికి చాలా ప్రయోజనాలు

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Jun 04, 2024

Hindustan Times
Telugu

నారింజ (ఆరెంజ్) పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ పండ్లలో ప్రొటీన్, విటమిన్ సీ, ఫైబర్, జింక్, ఐరన్, సోడియం, మెగ్నిషిమ్, క్యాల్షియమ్‍తో పాటు మరిన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

Photo: Pexels

చాలా పోషకాలు ఉన్న నారింజ పండ్లను రెగ్యులర్‌గా తింటే ఎన్నో లాభాలు దక్కుతాయి. ఈ పండు వల్ల ఆరోగ్యానికి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే. 

Photo: Pexels

నారింజ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లు తరచూ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

Photo: Pexels

నారింజ పండ్లు తరచూ తింటే శరీరంలో రక్తం కూడా పెరిగే ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఐరన్, విటమిన్ సీ ఉండడమే ఇందుకు కారణం. కీళ్ల నొప్పులు తగ్గేందుకు కూడా ఈ పండ్లు తోడ్పడతాయి. 

Photo: Pexels

నారింజ పండులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీంతో డైలీ పండును తింటే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. యాంటీఆక్సిడెంట్ కారకాలు ఉన్నందు వల్ల ఈ పండు తింటే చర్మపు మెరుపు కూడా పెరుగుతుంది.  

Photo: Pexels

కాల్షియం ఉండడం వల్ల నారింజ పండ్లను ప్రతీ రోజూ తింటే ఎముకల దృఢత్వానికి మేలు జరుగుతుంది.  శరీరంలోని యురిక్ యాసిడ్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

అందాలతో కాకా రేపుతోన్న కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ

Instagram