యాపిల్ ఎప్పుడెప్పుడు తింటే మంచిది? ఏ సమయంలో తినకూడదు?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 08, 2024

Hindustan Times
Telugu

యాపిల్ పండులో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ప్రతీ రోజు యాపిల్ తినాలి. అయితే, సరైన టైమ్‍లో తినడం కూడా ముఖ్యం.

Photo: Pexels

రోజులో యాపిల్ పండ్లను ఎప్పుడు తింటే మంచిది అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి. 

Photo: Pexels

వైద్యనిపుణుల ప్రకారం, యాపిల్ పండును ఉదయం బ్రేక్‍ఫాస్ట్ చేసిన ఒక గంట తర్వాత తినాలి. అలాగే, మధ్యాహ్నం భోజనం చేసిన ఓ గంట తర్వాత తీసుకోవాలి. ఈ సమయాల్లో తినడం వల్ల యాపిల్ నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

Photo: Pexels

యాపిల్ పండ్లను సాయంత్రం, రాత్రివేళ్లలో తినకూడదు. రాత్రి యాపిల్ తింటే జీర్ణమవడం కష్టమవుతుంది. నిద్ర కూడా సరిగా పట్టకపోవచ్చు. అలాగే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కూడా యాపిల్ తినకూడదు.

Photo: Pexels

యాపిల్‍ను తొక్క తీయకుండా తింటే ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే, నీటితో శుభ్రంగా పండ్లను కడిగిన తర్వాత తినాలి. 

Photo: Pexels

యాపిల్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఫైబర్, విటమిన్ సీ, విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు సహా చాలా పోషకాలు శరీరానికి అందుతాయి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. 

Photo: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels