Women Less Exercise : పురుషులకంటే మహిళలు తక్కువ వ్యాయామం చేయాలి! ఎందుకు?
Women Less Exercise : వ్యాయామం అనేది అందరికీ మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతీరోజూ వ్యాయామం చేయాలి. కానీ పురుషుల కంటే మహిళలు కాస్త తక్కువ వ్యాయామం చేయాలి.. ఎందుకు?
వ్యాయామ పురుషులు, మహిళలు కచ్చితంగా చేయాల్సిన పని. వ్యాయామం చేయకుండా ఉంటే శరీరం మన ఆధీనంలో ఉండదు. లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజూ చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తే మీ మెుత్తం ఆరోగ్యం బాగుంటుంది. అయితే వ్యాయామం విషయంలో పురుషులు ఎక్కువగా జిమ్‌లో గడుపుతారు. మహిళలు కాస్త తక్కువ సమయమే కేటాయిస్తారు. నిజానికి పురుషులకంటే మహిళలు తక్కువ వ్యాయామం చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా ఎందుకో తెలుసుకోవాలి..
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం పురుషులు వారానికి 300 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం చేయగలరు. కానీ మహిళలు అలా చేయలేరు. వారు 140 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామం చేయవచ్చు. లేకపోతే వారి మరణ ప్రమాదం క్రమంగా పెరుగుతుంది.
ఈ పరిశోధనలో నిపుణులు మాట్లాడుతూ పురుషులతో పోలిస్తే మహిళల్లో కండర ద్రవ్యరాశి కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పారు. మహిళలు తక్కువ కండర ద్రవ్యరాశి కారణంగా ఎల్లప్పుడూ కఠినమైన వ్యాయామాలు చేయలేరు. అయితే అధిక బరువుతో వ్యాయామం చేస్తే రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తక్కువ బరువుతో వ్యాయామం చేయడం ప్రారంభిస్తే శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఫలితంగా మహిళల ఊపిరితిత్తులు, పల్స్, కార్డియోపల్మనరీ (సీపీఆర్) పనితీరు మెరుగ్గా పని చేస్తుంది.
నేషనల్ హెల్త్ 1997 నుండి 2017 వరకు అంటే 20 సంవత్సరాల వరకు ఒక సర్వే నిర్వహించింది. దాదాపు 4 లక్షల మంది పెద్దలపై ఈ సర్వే చేశారు. పురుషుల కంటే మహిళలకు తక్కువ వ్యాయామం అవసరమని ఇది చెబుతుంది. అయితే దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉంది. చాలా మంది నిపుణులు ఈ పరిశోధనతో విభేదిస్తున్నారు. దీనిపై ఫిట్‌నెస్ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అధ్యయనంతో తాను ఏకీభవించడం లేదని ఫిట్‌నెస్ కోచ్ జితేంద్ర అన్నారు. ఒక్కో వ్యక్తి శరీరానికి ఒక్కోరకమైన వ్యాయామాలు అవసరమని చెప్పారు. ఒకరు ఎంత వర్కవుట్ చేయగలరు అనేది వారి శరీర బలాన్ని బట్టి ఉంటుంది. ఓ ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ మాట్లాడుతూ.. మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల వారు తరచూ రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల మహిళలు తమ కండర ద్రవ్యరాశిని, ఎముక సాంద్రతను పెంచుకోవాలి. ప్రతి మహిళ శరీరంలో టెస్టోస్టెరాన్ లోపం వల్ల ఎముకల సాంద్రత క్రమంగా తగ్గుతోందని తెలిపారు. ప్రతి వ్యక్తి ఫిట్‌నెస్ స్థాయి వారి రోజువారీ వ్యాయామ దినచర్యపై ఆధారపడి ఉంటుంది.