Sai Dharam Tej: నా లైఫ్‌లో ముగ్గురు గొప్ప మహిళలు ఉన్నారు.. సాయి దుర్గ తేజ్ కామెంట్స్-sai dharam tej about three best women in his life at satya press meet on international womens day ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sai Dharam Tej About Three Best Women In His Life At Satya Press Meet On International Womens Day

Sai Dharam Tej: నా లైఫ్‌లో ముగ్గురు గొప్ప మహిళలు ఉన్నారు.. సాయి దుర్గ తేజ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 10, 2024 05:52 AM IST

Sai Dharam Tej In Satya Press Meet: తన పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నట్లు చెప్పిన సాయి ధరమ్ తేజ్ తన జీవితంలో ముగ్గురు గొప్ప మహిళలు ఉన్నారని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. షార్ట్ ఫిల్మ్ సత్య ప్రెస్ మీట్‌లో సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నా లైఫ్‌లో ముగ్గురు గొప్ప మహిళలు ఉన్నారు.. సాయి దుర్గ తేజ్ కామెంట్స్
నా లైఫ్‌లో ముగ్గురు గొప్ప మహిళలు ఉన్నారు.. సాయి దుర్గ తేజ్ కామెంట్స్

Sai Durga Tej At Satya Press Meet: సమాజం పట్ల బాధ్యత, దేశం ప‌ట్ల ప్రేమ, మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వం ఉన్న హీరో జాబితాలో ముందు వ‌రుస‌లో ఉంటారు హీరో సాయి దుర్గ తేజ్. అదేనండి సాయి ధరమ్ తేజ్. తన పేరును సాయి దుర్గ తేజ్‌ను మార్చుకున్నట్లు ఇటీవలే సాయి తేజ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించిన సాయి ధరమ్ తేజే తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు.

విజయవాడలోని వృద్ధాశ్రమంతో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్‌లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు సాయి ధరమ్ తేజ్. ఈ సామాజిక కోణంలోనే ఆలోచించి మ‌హిళల ప‌ట్ల త‌న‌కున్న అమిత‌మైన గౌర‌వం, సైనికుల ప‌ట్ల ఉన్న ప్రేమ‌తో ఆయ‌న ప్రధాన పాత్ర‌లో న‌టించిన మ్యూజిక‌ల్ షాట్ ఫీచ‌ర్ సినిమా స‌త్య‌. సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా భార్యగా క‌ల‌ర్స్ స్వాతి న‌టించిన ఈ మ్యూజిక‌ల్ షాట్ ఫీచ‌ర్‌ను దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంతో క‌లిసి హీరో సొంత సంస్థ విజ‌య దుర్గ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ నిర్మించింది.

సత్య షార్ట్ ఫిల్మ్‌కి హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మాత‌లు. కాగా శుక్ర‌వారం (మార్చి 8) మ‌హిళా దినోత్సం సంద‌ర్భంగా ఈ సత్య చిత్రం ప్ర‌త్యేక షోను మీడియాకు ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో చిత్రం గురించి మాట్లాడారు. "నా జీవితంలో ముగ్గురు గొప్ప మ‌హిళ‌లు ఉన్నారు. మా అమ్మ‌మ్మ అంజ‌నా దేవి గారు, మా అమ్మ విజ‌య దుర్గ , మా పిన్ని మాధ‌వి. వీరే నా బిగ్గెస్ట్ హ్య‌పీనెస్‌" అని హీరో సాయి దుర్గ తేజ్ తెలిపాడు.

"ఇక ఈ సినిమా నా స్నేహితులు న‌వీన్‌, హ‌ర్షిత్ చేస్తున్నార‌ని తెలియ‌గానే, ఇంత గొప్ప సినిమాలో నేను భాగ‌మ‌వుతాన‌ని అడిగి జాయిన్ అయ్యాను. ఈ సినిమా ద్వారా న‌వీన్ నాలో కొత్త యాంగిల్‌ను తీసుకొచ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 25 ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో ఈ చిత్రం ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. చాలా అవార్డులు కూడా వ‌చ్చాయి" అని సాయి దుర్గ తేజ్ చెప్పాడు.

"గ‌త సంవ‌త్సరం ఈ సంస్థ‌లో బ‌ల‌గం నిర్మించాం. మ‌ళ్లీ స‌త్య లాంటి ఓ మంచి షాట్ ఫీచ‌ర్‌ను నిర్మించాం. ఈ సోసైటీకి త‌న వంతుగా ఏమైనా చేయాల‌ని నిత్యం త‌ప‌న ప‌డ‌తాడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. ఆయ‌న‌తో పాటు ఈ సినిమా టీమ్ అంతా స‌మాజానికి త‌మ వంతు ఏమైనా చేయాల‌ని చేసిన సినిమా ఇది. త‌ప్ప‌కుండా మా అంద‌రి ప్ర‌య‌త్నం మంచి ఫ‌లితాన్ని ఇస్తుంద‌ని నమ్ముతున్నాను" అని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు.

"సోల్జ‌ర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షాట్ ఫీచర్‌ను చెప్పాల‌నేది హ‌ర్షిత్ ఐడియా. ఆ ఐడియా న‌చ్చి నేను, సాయి జాయిన్ అయ్యాం. ఇండియాలో ఎంతో గొప్ప మ‌హిళ‌లు ఉన్నారు. అలాంటి కొంత మంది గురించి అంద‌రికి తెలియాలి. చాలా మంది వీర‌నారిల క‌థ అంద‌రికి తెలియాలి. నేడు మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ముందున్నారు. వారు అనుకుంటే సాధించ‌నిది ఏమీ లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మా చిత్రానికి 25 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు వ‌చ్చాయి. ఎన్నోఅంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్ ఈసినిమాను ప్ర‌ద‌ర్శించాం" అని ద‌ర్శ‌కుడు న‌వీన్ విజ‌య‌క్రిష్ణ చెప్పుకొచ్చారు.

"శ్రుతిరంజ‌ని అందించిన షాట్ సాంగ్‌కు ఈ షాట్ ఫీచ‌ర్‌కు ప్రేర‌ణ‌గా నిలిచింది. న‌వీన్, సాయి నేను మంచి స్నేహితులం, మా కాంబినేష‌న్‌లో ఓ మంచి ప‌ర్ప‌స్‌ఫుల్ ఫీచ‌ర్‌ను, సాయిధ‌ర‌మ్ తేజ్ ఓన్ బ్యాన‌ర్‌తో క‌లిసి ఇది నిర్మించినందుకు ఆనందంగా ఉంది" అని హర్షిత్ రెడ్డి అన్నారు. కాగా సత్య ప్రెస్ మీట్‌లో బాల‌న‌టి సాయి తేజ‌స్విని కూడా పాల్గొన్నారు.

IPL_Entry_Point