(1 / 6)
James Anderson Fitness: ఇంగ్లండ్ జట్టులో ఈ మధ్య ఇండియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన స్పిన్నర్లు షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్ లాంటి వాళ్లు జేమ్స్ ఆండర్సన్ కెరీర్ ప్రారంభించినప్పటికి ఇంకా పుట్టనే లేదు. అలాంటిది ఇప్పటికీ అతడు వాళ్లతో కలిసి ఆడుతున్నాడంటే 41 ఏళ్ల ఆండర్సన్ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
(2 / 6)
James Anderson Fitness: పేస్ బౌలర్ కు అందరి కంటే ఎక్కువ ఫిట్‌నెస్ ఉండాలి. అందులోనూ టెస్ట్ క్రికెట్ లో ఆడాలంటే మరింత సత్తా కావాలి. చాలా మంది యువ క్రికెటర్లు కూడా టెస్టులకు గుడ్ బై చెప్పి టీ20 ఫార్మాట్ కు పరిమితమవుతున్నా.. ఆండర్సన్ మాత్రం ఈ సాంప్రదాయ క్రికెట్ లోనే కొనసాగుతున్నాడు.
(3 / 6)
James Anderson Fitness: టెస్ట్ క్రికెట్ చరిత్రలో 650 వికెట్లు తీసుకున్న ఏకైక పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కావడం విశేషం.
(4 / 6)
James Anderson Fitness: 41 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ టెస్టు క్రికెట్ కే జేమ్స్ ఆండర్సన్ ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం. దీనికోసం అతడు తన ఫిట్‌నెస్ ను కాపాడుకుంటున్న తీరు అద్భుతమనే చెప్పాలి.
(5 / 6)
James Anderson Fitness: జేమ్స్ ఆండర్సన్ 2003లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అంటే 21 ఏళ్లుగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకూ 180 టెస్టులు ఆడటం గమనార్హం. సచిన్ తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్ అతడే.
(6 / 6)
James Anderson Fitness: జేమ్స్ ఆండర్సన్ ఇప్పుడు ఇండియాతో మూడో టెస్టుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పట్లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరయ్యే ఉద్దేశం కూడా తనకు లేదని అతడు చెబుతుండటం విశేషం.
ఇతర గ్యాలరీలు