Lime Water Benefits : నిమ్మకాయ నీళ్లు తాగితే చాలా అంటే చాలా మంచిది
Lime Water Benefits In Telugu : నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయ నీటిని తాగితే శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
నిమ్మకాయ సిట్రస్ పండు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని విష కణాల నుండి రక్షిస్తాయి. మన శరీరం 60 శాతం నీటితో నిర్మితమైంది. అందుకే నీరు మనకు చాలా ముఖ్యం. మనం కొన్ని రోజులు తినకుండా ఉండగలం. కానీ నీరు లేకుండా మాత్రం ఉండలేం. ఈ నీరే మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి, శరీరానికి తగిన హైడ్రేషన్, శక్తిని అందిస్తుంది. సగటు వ్యక్తి రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలి. కేవలం నీరు తాగలేకపోతే జ్యూస్ రూపంలో తీసుకోండి. ముఖ్యంగా ఇందులో నిమ్మరసం కూడా ఉండాలి.
నిమ్మకాయల్లో పొటాషియం, విటమిన్ ఎ, బి, సి, డి పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే పండ్లలో నిమ్మకాయ చాలా ముఖ్యమైనది. చర్మం జుట్టు రాలడం, బరువు తగ్గడం, క్యాన్సర్ నివారణ, ఇన్ఫెక్షన్ నివారణ వరకు అన్నింటికి పరిష్కారం చూపుతుంది.
చర్మానికి ఉపయోగాలు
మీ చర్మాన్ని అందంగా, తాజాగా ఉంచుకోవడానికి బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. మీ ముఖం తాజాగా ఉండాలంటే నిమ్మరసం సరిపోతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మొదలైనవి స్కిన్ కొల్లాజెన్‌ను బలోపేతం చేసి చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి.
కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. అయితే ఈ నిమ్మరసాన్ని నేరుగా చర్మంపై అప్లై చేసి బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే సూర్యరశ్మి ఫైటోఫోటోడెర్మాటిస్ అని పిలువబడే బాధాకరమైన చర్మపు చికాకును కలిగిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
లెమన్ వాటర్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆహారం తిన్నప్పుడు ఎక్కువ లాలాజలం స్రవించడంతోపాటు సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మీకు మలబద్ధకం సమస్యలు ఉన్నట్లయితే లేదా మీకు గుండెల్లో మంట, త్రేన్పులు, అసిడిటీ సమస్యలు ఉంటే.. గోరువెచ్చని నీటిలో 2 టీస్పూన్ల నిమ్మరసం కలిపి భోజనానికి 30 నిమిషాల ముందు తాగడం వల్ల సమస్యలు పరిష్కరించబడతాయి.
జలుబు, ఫీవర్ వ్యాప్తి సమయంలో అంటువ్యాధులు మరింత తీవ్రంగా ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నిమ్మరసం తాగండి. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.
ఈ నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ మన శరీరంలోని మెటబాలిజాన్ని పెంచి, శరీరంలోని కొవ్వును కరిగించి శరీరంలోని కొవ్వును కోల్పోవడానికి సహాయపడుతుంది. 30 నిమిషాల వ్యాయామం, పండ్లు, కూరగాయలతో పాటు ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల మీ శరీర బరువులో మార్పు కనిపిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది
నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక నెల పాటు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో నిమ్మరసం తాగండి. అప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేయండి.
నిమ్మకాయలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన హృదయానికి మేలు చేస్తాయి. పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్‌లను నివారిస్తుంది.
రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి మన అవయవాలలో క్యాన్సర్ కణాలు పెరుగుతాయి. క్యాన్సర్ కణితులను ఏర్పరుస్తాయి. నిమ్మరసం తాగినప్పుడు అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించి, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
వాపు సమస్యలకు చెక్
కీళ్లనొప్పులు వంటి సమస్యలు వాపు వల్ల వస్తాయి. నిమ్మరసంలోని విటమిన్ సి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఆర్థరైటిస్, కీళ్ల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అన్నల్స్ ఆఫ్ రుమాటిక్ డిసీజెస్ ప్రకారం విటమిన్ సి లోపం ఉన్నవారు ఆర్థరైటిస్‌తో బాధపడే అవకాశం ఉంది. నిమ్మరసం శరీరంలో పేరుకునే యూరిక్ యాసిడ్ మొత్తాన్ని తగ్గిస్తుంది.