Skin Green With Copper : రాగి ఆభరణాలు చర్మాన్ని ఆకుపచ్చగా ఎందుకు చేస్తాయి?-ragi benefits why does copper ornaments turn skin into green heres reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Green With Copper : రాగి ఆభరణాలు చర్మాన్ని ఆకుపచ్చగా ఎందుకు చేస్తాయి?

Skin Green With Copper : రాగి ఆభరణాలు చర్మాన్ని ఆకుపచ్చగా ఎందుకు చేస్తాయి?

Anand Sai HT Telugu
Feb 23, 2024 04:30 PM IST

Skin Green With Copper Reasons : రాగి ఉంగరాలు, బ్రాస్లెట్ ధరిస్తే కొన్నిసార్లు చర్మం ఆకుపచ్చగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. దీని గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు.

రాగి ప్రయోజనాలు
రాగి ప్రయోజనాలు (Unsplash)

రాగి ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయని మనందరికీ తెలుసు. ముఖ్యంగా కీళ్ల మంట, కీళ్ల సమస్యలు, జింక్ లోపం రాగి నగలు ధరించడం ద్వారా సరిదిద్దుకోవచ్చు. శరీరంలో వేడి కూడా రాగిని ధరిస్తే తగ్గుతుంది. అయితే, మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. రాగి ఆభరణాలు ధరించిన ప్రదేశంలో చర్మంపై ఆకుపచ్చగా అగుపిస్తుంది. అలా పచ్చగా మారడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందా లేదా అనే విషయాలను తెలుసుకోండి.

మీరు రాగి కంకణాలు లేదా ఉంగరాలు ధరించి ఎండలో బయటకు వెళ్లినప్పుడు, శరీరం నుండి చెమట, చర్మం నుండి నూనె చర్మంపై ఆకుపచ్చ కాపర్ కార్బోనేట్ ఫిల్మ్‌ను కలిగిస్తుంది. ఇది ఆక్సీకరణ చర్య కారణంగా జరుగుతుంది.

గాలి చాలా తేమగా ఉంటే లేదా గాలిలో చాలా సల్ఫర్ ఉంటే, రాగి ఆభరణాలు త్వరగా చర్మంపై ఆకుపచ్చ పొరను క్రియేట్ చేస్తాయి.

జంక్ ఫుడ్ లేదా బీఫ్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఎసిడిటీ పెరుగుతుంది. శరీరంలో ఎసిడిటీ పెరిగినప్పుడు రాగి నగలు వేసుకుంటే చర్మంపై ఆకుపచ్చని పొర ఏర్పడి శరీరంలోని ఎసిడిటీని సూచిస్తుంది. శరీరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెబుతుంది.

మీరు రాగి ఆభరణాల కారణంగా ఆకుపచ్చ చర్మాన్ని నివారించాలనుకుంటే, మంచి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. చర్మంపై ఆకుపచ్చగా అభివృద్ధి చెందితే, నీటితో పూర్తిగా కడగాలి. రాగి ఆభరణాలు వందల సంవత్సరాలుగా ధరిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం దానిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలే. రాగి ఆభరణాలు ధరిస్తే చర్మానికి మంచి జరుగుతుందని చెబుతారు.

రాగి లోహం మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో శక్తిని పెంచుతుంది. రాగి లోహాన్ని ఉంగరంగా ధరించడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలో రక్త ప్రసరణకు ఎంతో మేలు జరుగుతుందని అంటారు. ఇది వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది.

రాగి ఉంగరం ధరించడం కారణంగా రక్తపోటు అదుపులో ఉంచుకోవచ్చు. రాగి ఉంగరం శరీరంలోని రక్తపోటును సమతుల్యం చేసేందుకు సాయపడుతుంది. కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడేవారు రాగి ఉంగరం లేదా బ్రాస్‌లెట్ ధరించడం మంచిది. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగకరం. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రాగి ఉంగరం లేదా ఆభరణాలు ధరించడం చర్మానికి చాలా మంచిది. ఇది చర్మకాంతిని పెంచుతుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా యవ్వనంగా కనిపించేందుకు ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలను నివారించడంలో రాగి సహాయపడుతుంది. చేతులు, వేళ్లు, పాదాల్లో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

Whats_app_banner