Banana Flower Benefits : వారానికోసారి అరటి పువ్వు తినండి.. శరీరంలో మ్యాజిక్ చూడండి-weekly once eat banana flower see magic in body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Flower Benefits : వారానికోసారి అరటి పువ్వు తినండి.. శరీరంలో మ్యాజిక్ చూడండి

Banana Flower Benefits : వారానికోసారి అరటి పువ్వు తినండి.. శరీరంలో మ్యాజిక్ చూడండి

Anand Sai HT Telugu
Feb 19, 2024 02:00 PM IST

Banana Flower Benefits In Telugu : అరటి చెట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అంతేకాదు అరటి పువ్వుతోనూ చాలా లాభాలు ఉన్నాయి.

అరటి పువ్వు ప్రయోజనాలు
అరటి పువ్వు ప్రయోజనాలు (Unsplash)

అరటి చెట్టులోని అన్ని భాగాలు మనకు మేలు చేస్తాయి. మన వంటల్లో అరటి పువ్వు కలపడం చాలా అరుదుగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా అరటి చెట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే అరటి పువ్వు అనేది చాలా తక్కువగా ఉపయోగిస్తుంటారు. మనం దానిని ఎక్కువగా ఉపయోగించం. అరటి పువ్వు ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత, మీరు ఖచ్చితంగా అరటి పువ్వును వంటలో ఉపయోగిస్తారు.

అరటి పువ్వుతో ప్రయోజనాలు

అరటి పువ్వును రెండు వారాల పాటు తీసుకోవడం వల్ల బ్లడ్ లిపిడ్లు తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల రక్తహీనత రాదు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అరటి పువ్వును ఐదు నెలల పాటు వండుకుని తింటే కడుపు ఉబ్బరం, జీర్ణ రుగ్మతలు, ఒత్తిడి వల్ల వచ్చే పొట్టలో పుండ్లు తగ్గుతాయి.

అరటి పువ్వు మూలవ్యాధి, రక్తస్రావం, కురుపులు, మలబద్ధకానికి మొదలైన వాటికి ఔషధంగా ఉపయోగిస్తారు. నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అరటి పువ్వు వండుకుని తింటే నోటి దుర్వాసన పోతుంది. గొంతు నొప్పి నయమవుతుంది.

గర్భాశయ లోపాలు, తెల్లటి ఉత్సర్గ, రుతుక్రమ రుగ్మతలు మొదలైన వాటితో బాధపడే స్త్రీలకు ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అరటి పువ్వులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకానికి ఔషధంగా వాడుతారు. అరటి పువ్వులో కొవ్వు పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఉడికించిన అరటిపండు పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే హైపోగ్లైసీమిక్ రసాయనం ఇందులో ఉంటుంది.

అరటి కాండం ప్రయోజనాలు

అరటి పువ్వుతోనే కాదు.. అరటి కాండంతోనూ చాలా ప్రయోజనాలు దొరుకుతాయి. మూత్ర విసర్జన సమయంలో చిరాకుగా ఉన్నవారు తరచుగా అరటి కాండం భోజనంలో చేర్చుకోవడం వల్ల మూత్ర విసర్జన సులువు అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా పరిష్కారమవుతుంది.

అరటి కాండానికి నరాల సమస్యలను నయం చేసే శక్తి ఉంది. రోజూ రెండు లేదా మూడు చెంచాల అరటి కాండం రసాన్ని తాగితే తరచుగా వచ్చే పొడి దగ్గు నయమవుతుంది. ఎక్కువగా దాహం వేసే వారు అరటి కాండం చూర్ణం చేసి ఆ రసాన్ని తాగాలి. చెవులకు సంబంధించిన సమస్యలు, గర్భాశయ సంబంధిత వ్యాధులు, రక్తశుద్ధి తదితర సమస్యలు సరిచేయాలంటే ప్రతిరోజూ అరటి కాండం సూప్ తాగొచ్చు.

కామెర్లు ఉన్నవారు అరటి కాండంను ఎండలో బాగా ఆరబెట్టి పొడిలా చేసుకోవాలి. రోజూ ఒక చెంచా తీసుకుని అందులో తేనె కలుపుకొని తాగితే కామెర్లు సమస్య పరిష్కారం అవుతుంది. కాలిన గాయాలు ఎక్కువ కాలం మానకపోతే అరటి కాడను తీసుకుని నిప్పులో కాల్చి బూడిదను తీసుకుని కొబ్బరినూనెతో కలిపి పెట్టుకోవాలి.

అరటి కాండంలో కాస్త ఆవాలు కలిపి తింటే అలెర్జీ, చర్మ చికాకు, మూలవ్యాధి సమస్యలు తగ్గించుకోవచ్చు రుతుక్రమం సమయంలోనూ మహిళలకు వచ్చే వివిధ సమస్యలకు అరటి కాండం ద్వారా పరిష్కారం సులువుగా దొరుకుతుంది. ఈ సమస్యల కోసం అరటి పువ్వు రసాన్ని తాగొచ్చు. అరటి రసం బలమైన ఆస్ట్రింజెంట్ రుచిని కలిగి ఉంటుంది. పిల్లలకు ఇస్తే బెల్లం లేదా తాటి బెల్లం కలిపి ఇవ్వొచ్చు.