Banana Flower vada: అరటి పువ్వుతో వంటకాలు చేసే వారి సంఖ్య తక్కువే. అరటి పువ్వుతో చేసే గారెలు చాలా రుచిగా ఉంటాయి. ఇది వారానికి ఒకసారి తింటే ఆరోగ్యానికి మంచిది. అరటి పువ్వు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దక్షిణ భారతదేశంలో అరటి పువ్వు వంటకాలు చాలా ఫేమస్. అరటి పువ్వుతో కూరలు, వేపుళ్ళు కూడా చేసుకుంటారు. ఇక్కడ మేము గారెలు ఎలా చేయాలో చెప్పాము. దీన్ని రెసిపీ ఎలాగో చూద్దాం.
అరటి పువ్వు - ఒకటి
కందిపప్పు - పావు కప్పు
నూనె - సరిపడినంత
మినప్పప్పు - రెండు స్పూన్లు
శనగపప్పు - అయిదు స్పూను
పచ్చిమిర్చి - మూడు
కరివేపాకులు గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - ఒక స్పూను
కొత్తిమీర - మూడు స్పూన్లు
1. కందిపప్పు, సెనగపప్పు, మినప్పప్పు వంటి వాటిని కలిపేసి ఒక గిన్నెలో వేయాలి. ఓ గంట పాటు నీటిలో నానబెట్టాలి.
2. ఒక గిన్నెలో అరటి పువ్వును చిన్నగా తరిగి వేయాలి.
3. ఇప్పుడు నానబెట్టిన పప్పులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఆ పిండిని అరటి పువ్వు తరుగులో వేసి కలుపుకోండి.
5. రుచికి సరిపడా ఉప్పును వేయండి. కరివేపాకులు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.
7. నూనె వేడెక్కాక అరటి పువ్వు మిశ్రమాన్ని గారెల్లా ఒత్తుకొని నూనెలో వేయండి.
8. ఇరువైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోండి.
9. అంతే అరటి పువ్వు గారెలు రెడీ అయినట్టే.
అరటి పువ్వుతో చేసిన వంటకాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడానికి అరటి పువ్వు సహాయపడుతుంది. శరీరంలో బ్యాక్టీరియా పెరగకుండా ఇది అడ్డుకుంటుంది. ఒక మందు వలే శరీరంలో అద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్, గుండె సమస్యలతో పోరాడేందుకు శరీరానికి సహాయపడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు అరటి పువ్వులతో రెసిపీలను తయారు చేసుకొని తింటే మంచిది.
టాపిక్