Banana Stem Benefits : అరటి కాండం తినండి.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందండి-how to eat banana stem for amazing health benefits cure white discharge in women ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Stem Benefits : అరటి కాండం తినండి.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Banana Stem Benefits : అరటి కాండం తినండి.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Anand Sai HT Telugu
Feb 06, 2024 12:30 PM IST

Banana Stem Health Benefits : అరటి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు అరటి కాండంతోనూ అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

అరటి కాండం ప్రయోజనాలు
అరటి కాండం ప్రయోజనాలు (Unsplash)

అరటి చెట్టులోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిద్వారా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు చాలా ఆరోగ్యకరమైనదని మనకు తెలుసు. అదేవిధంగా అరటి కాండం కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. కానీ దీనిని దాన్ని మెత్తగా చేసి ఉడికించి తినాలన్నా, రసం పిండుకుని తాగాలన్నా మనకు బద్ధకం.

ఈ అరటి కాండం అద్భుతంగా పనిచేస్తుంది. అనేక వ్యాధులను నయం చేస్తుంది. సాంప్రదాయ వైద్యంలోనూ అరటి కాండం ఉపయోగిస్తారు. వ్యాధులను నయం చేసేందుకు అరటి కాండం తింటే మంచిది. అరటి కాండంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మన ఆహారంలో ఇది తరచుగా చేర్చుకోవాలి. మన పేగులలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపే శక్తి దీనికి ఉంది.

మూత్ర విసర్జన సమస్యలకు చెక్

మూత్ర విసర్జన సరిగా రాని వారు, లేదా మూత్ర విసర్జన సమయంలో చిరాకుగా ఉన్నవారు తరచుగా అరటి కాండం భోజనంలో చేర్చుకోవడం వల్ల మూత్ర విసర్జన సులువు అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా పరిష్కారమవుతుంది. చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కొంటారు. అరటి కాండం తింటే ప్రయోజనాలు పొందవచ్చు.

అరటి కాండం రసం తాగితే ప్రయోజనాలు

అరటి కాండం నరాల సమస్యలను నయం చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. రోజూ రెండు లేదా మూడు చెంచాల అరటి కాండం రసాన్ని తాగితే తరచుగా వచ్చే పొడి దగ్గు నయమవుతుంది. ఎక్కువగా దాహం వేసే వారు అరటి కాండం చూర్ణం చేసి ఆ రసాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. చెవులకు సంబంధించిన సమస్యలు, గర్భాశయ సంబంధిత వ్యాధులు, రక్తశుద్ధి తదితర సమస్యలు సరిచేయాలంటే ప్రతిరోజూ ఒక కప్పు అరటి కాండం సూప్ తాగండి.

కామెర్లకు పరిష్కారం

కామెర్లు ఉన్నవారు అరటి కాండంను ఎండలో బాగా ఆరబెట్టి పొడిలా చేసుకుని.. రోజూ ఒక చెంచా తీసుకుని అందులో తేనె కలుపుకొని తీసుకోవాలి కామెర్లు సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంది. కాలిన గాయాలు ఎక్కువ కాలం మానకపోతే అరటి కాడను తీసుకుని నిప్పులో కాల్చి బూడిదను తీసుకుని కొబ్బరినూనెతో కలిపి రాసుకోవాలి. ఎలాంటి కాలిన గాయమైనా నయం అవుతుంది.

మహిళల సమస్యలకు పని చేస్తుంది

అరటి కాండంలో కాస్త ఆవాలు కలుపుకొని తింటే అలెర్జీ, చర్మ చికాకు, మూలవ్యాధి సమస్యలు తగ్గుతాయి. రుతుక్రమం సమయంలోనూ మహిళలకు వచ్చే వివిధ సమస్యలకు అరటి కాండం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. మీరు అరటి పువ్వు రసాన్ని కూడా తాగవచ్చు. అరటి రసం బలమైన ఆస్ట్రింజెంట్ రుచిని కలిగి ఉంటుంది. దీన్ని యథాతథంగా తాగితే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. పిల్లలకు ఇస్తే బెల్లం లేదా తాటి బెల్లం కలిపి ఇవ్వవచ్చు. తెల్ల చక్కెర వేయకపోవడమే మంచిది.

అరటి కాండం అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. అయితే కొందరికి అలెర్జీ కూడా అవ్వవచ్చు. అందుకే ఏదైనా కొత్త పద్ధతి పాటించే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఆ తర్వాతే ప్రయత్నం మెుదలుపెట్టాలి. అరటి కాండాన్ని కూడా ఎవరైనా ఉపయోగించాలనుకుంటే నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి.

Whats_app_banner