Speed Slim Diet: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ స్పీడ్ స్లిమ్ డైట్‌ను నెలరోజులు పాటించండి
Speed Slim Diet: బరువు తగ్గాలనుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది. అధిక బరువు వల్ల అనేక సమస్యలు వస్తుండడంతో స్లిమ్ గా మారేందుకు ఎంతో మంది సిద్ధమవుతున్నారు. అలాంటి వారికోసం ఇక్కడ మేము స్పీడ్ స్లిమ్ డైట్ ఇచ్చాము. ఇది ఫాలో అవ్వండి.
Speed Slim Diet: అధిక బరువు ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు క్యాన్సర్లు వంటి రావడానికి అధిక బరువే ప్రధాన కారణంగా చెబుతారు. చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అలాంటివారు త్వరగా బరువు తగ్గాలని అనుకుంటారు. ఇక్కడ మేము స్పీడ్ స్లిమ్ డైట్ గురించి ఇచ్చాము. శరీరానికి పోషణ అందిస్తూనే, వేగంగా బరువు తగ్గడం ఈ డైట్ పద్ధతి. దీనికి ఏం చేయాలో తెలుసుకోండి.
వీటిని తినండి
ముందుగా స్పీడ్ స్లిమ్ డైట్‌లో పోషకాలు ఉండే ఆహారాలపైనే దృష్టి పెట్టాలి. ఈ పోషకాలు ఉన్న ఆహారం తింటే పొట్ట త్వరగా నిండుతుంది. కాబట్టి ఎక్కువ ఆహారాన్ని తినరు. ఓట్స్, బార్లీ, కూరగాయలు వంటి ఫైబర్ ఉన్న ఆహారాలను తినేందుకు ప్రయత్నించండి. ఇవి కొంచెం తింటే చాలు పొట్ట నిండినట్టుగా అవుతుంది. కాబట్టి ఆ రోజంతా మీరు తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. కొన్ని రోజుల్లోనే ఆ ప్రభావం మీకు శరీరం పై పడుతుంది. మీరు సన్నగా మారడం ప్రారంభిస్తారు.
ఫైబర్ బరువు తగ్గించే విషయంలో హీరో అనే చెప్పాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎంతగా తింటే మీరు అంత త్వరగా బరువు తగ్గుతారు. ఇది తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. కానీ దీన్ని జీర్ణం చేయడానికి మాత్రం ఎక్కువ శక్తి అవసరం. దీనివల్ల శరీరంలో ఉన్న అదనపు క్యాలరీలు తగ్గిపోతాయి. కాబట్టి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినడం అలవాటు చేసుకోండి. కొన్ని రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.
ఆహారం తగ్గించకండి
బరువు తగ్గడానికి ఎక్కువ మంది చేసే పని తక్కువ ఆహారాన్ని తింటారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తోంది. మీరు ఎంత తింటున్నారు అనేది ముఖ్యం కాదు, ఏం తింటున్నారు అనేదే ముఖ్యం. పోషకాల నిండిన ఆహారం తినడమే ముఖ్యం. రోజుకు రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లు బ్రేక్ ఫాస్ట్ లో తినండి చాలు. అవి ఎంతో శక్తినిస్తాయి. ఆ రెండు కోడిగుడ్లు మధ్యాహ్నం వరకు మీకు ఆకలి వేయకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల మీరు ఇతర ఆహారాలను తినరు ఇలా స్పీడ్ స్లిమ్ డైట్ లో భాగంగా మీ ప్లేటును పోషకాలు అధికంగా ఉన్న ఆహారాలతో నింపండి. అంతేతప్ప ఆహారాన్ని తీసుకోవడం తగ్గించకండి.
బ్రేక్ ఫాస్ట్ ఇలా చేయండి
మీ ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, జింక్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలతో నిండిన ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. తీపి పదార్థాలకు, వేయించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండండి. కూల్ డ్రింకులు, సోడాలు మానేయండి. ధూమపానం, మద్యపానం కూడా మానేయండి. ఇవన్నీ మిమ్మల్ని బరువు పెరిగేలా చేస్తాయి. ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన కోడిగుడ్లతో రోజును మొదలు పెట్టండి. రెండు కోడిగుడ్ల గురించి తినకపోవడం మంచిది. ఇది ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే శక్తిని అందిస్తుంది. కోడిగుడ్లను తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం వరకు ఏమీ తినకుండా అలానే ఉండండి.
లంచ్ ఇలా తినండి
మధ్యాహ్నం భోజనంలో ఒక కప్పు రైస్, ఒక కప్పు కూరగాయలతో వండిన కూర, ఒక కప్పు పెరుగుతో ముగించండి. రాత్రి పూట వీలైతే ఒక చపాతీ తినండి. సాయంత్రం మాత్రం గుప్పెడు నట్స్ తినేందుకు ప్రయత్నించండి. ఇవన్నీ కూడా పోషకాలు నిండుగా కలిగి ఉంటాయి. కానీ అదనపు క్యాలరీలను మాత్రం శరీరంలో చేర్చవు. ఇలా భోజనం చేస్తూ రోజుల్ ఒక గంట పాటు వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం అలవాటుగా మార్చుకోండి. నెల రోజుల్లోనే మీలో మంచి మార్పు కనిపిస్తుంది. నెల రోజుల్లో కనీసం మూడు నుంచి నాలుగు కిలోలు సులువుగా తగ్గుతారు. ఇలా తగ్గడం ఆరోగ్యకరం కూడా.
టాపిక్