Korean Egg Fried Rice: కొరియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేశారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు
Korean Egg Fried Rice: కొరియన్ వారు ఎక్కువగా తినేది ఎగ్ ఫ్రైడ్ రైస్ అది చాలా టేస్టీగా ఉంటుంది. కారం తక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు నచ్చుతుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
Korean Egg Fried Rice: కొరియన్లు తినే ఆహారంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్.ఇందులో అన్నంతో పాటు కోడిగుడ్డు స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్,మిరియాల పొడి ఉంటాయి.ఇవి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీకు కూడా ఎంతో నచ్చుతుంది. మనం కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఒకసారి తెలుసుకోండి.
కొరియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
వండిన అన్నం - ఒక కప్పు
గుడ్లు - రెండు
స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - పావు కప్పు
సోయా సాస్ - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
నువ్వులు గింజలు - అర స్పూను
నువ్వుల నూనె - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొరియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
1. ఎగ్ ఫ్రైడ్ రైస్‌కు ఎక్కువ మంది అభిమానులే ఉంటారు.
2. మీకు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చితే ఒకసారి కొత్తగా కొరియన్ స్టైల్‌లో చేసి చూడండి.
3. ముందుగా అన్నాన్ని వడ్డించి పక్కన పెట్టుకోండి.
4. అది పొడిపొడిగా ఉండేలా ఒక ప్లేట్లో ఆరబెట్టుకోండి.
5. ఒక గిన్నెలో కోడిగుడ్లను కొట్టి వేయండి.
6. అందులోనే ఉప్పు వేసి బాగా కలుపుకోండి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
8. ఆ నూనెలో స్ప్రింగ్ ఆనియన్స్ తరిగి పచ్చివాసన పోయేదాకా వేయించండి.
9. తర్వాత ముందుగా కొట్టిన కోడిగుడ్లను వేసి వేయించుకోండి.
10. అలాగే సోయాసాస్, మిరియాల పొడి కూడా వేసి వేయించండి.
11. ముందుగా వండుకున్న అన్నాన్ని అందులో వేసి కలపండి.
12. స్టవ్ ఆఫ్ చేసి వేయించిన నువ్వులను పైన చల్లుకోండి.
13. అంతే టేస్టీ కొరియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే.
14. ఇది చాలా సింపుల్ రుచిగా కూడా ఉంటుంది.
15. దీనిలో మనం వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.
16. దీన్ని నువ్వుల నూనెతో చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
17. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
18. దీన్ని చిన్న మంట మీద చేయాలి. లేకుంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది.
కొరియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ పిల్లలకు తినిపించి చూడండి. వారికి కొత్తగా టేస్టీగా ఉంటుంది. పెద్దలకు ఇదే నచ్చుతుంది. దీనిలో మనం పచ్చిమిర్చి, కారం వంటివి వెయ్యలేదు. కేవలం మిరియాలు మాత్రమే వేసాము. మిరియాలలోని ఘాటు మాత్రమే నాలికకు తగులుతుంది. కారం ఉండదు. కాబట్టి పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు.
టాపిక్