Walking for LifeSpan: రోజుకు 11 నిమిషాలు నడవండి చాలు అకాల మరణాన్ని తప్పించుకోవచ్చు ఆయుష్షును పెంచుకోవచ్చు
Walking for Long Life: ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయినా కూడా వాకింగ్ చేసే వారి సంఖ్య ఎక్కువగా తక్కువగానే ఉంది రోజుకు 11 నిమిషాలు నడవండి చాలు మీ ఆయుష్షు పెరుగుతుంది
Walking for Long Life: రోజులో పదకొండు నిమిషాల నడక మిమ్మల్ని అకాల మరణం నుండి తప్పిస్తుంది. మీ ఆయుష్షును పెంచుతుంది. అకాల మరణం అనేది దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వచ్చే అవకాశం ఉంది. అలాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకపోతే అకాల మరణం సంభవించే అవకాశం ఉండదు. మీ ఆరోగ్యాన్ని కాపాడి ఎలాంటి వ్యాధులు రాకుండా చేసే శక్తి నడకకు ఉంది. కేవలం రోజులో 11 నిమిషాలు వేగంగా నడిచి చూడండి. మీకే దాని విలువ తెలుస్తుంది.
నిశ్చల జీవనశైలి వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గుండె సమస్యలు, డయాబెటిస్, అధిక బరువు, అధిక రక్తపోటు వంటివి వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. ఎప్పుడైతే మీరు రోజులో 11 నిమిషాల పాటు నడుస్తారో మీ మెదడు శక్తి పెరుగుతుంది. మెదడు సృజనాత్మకంగా ఆలోచిస్తుంది. అంతేకాదు ప్రతిరోజు 11 నిమిషాల పాటు నడవడం వల్ల ఇంకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజు కనీసం 11 నిమిషాలు నడవడం వల్ల మీకు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల అకాల మరణం సంభవించే అవకాశం పాతికశాతం తగ్గుతుంది. ఈ అధ్యయనాన్ని మూడు కోట్ల మందికి పైగా ప్రజలపై నిర్వహించారు. వారి ఆరోగ్య డేటాను విశ్లేషించారు. ఎవరైతే ప్రతిరోజూ వాకింగ్ చేస్తారో వారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉన్నాయని, వారి ఆయుష్షు కూడా పెరిగిందని అధ్యయనంలో గుర్తించారు.
బరువు తగ్గడానికి
11 నిమిషాల పాటు నడవడం అనేది బరువు తగ్గించే పద్ధతి కాకపోవచ్చు, కానీ ఇది అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఈ 11 నిమిషాలు మీరు వేగంగా నడవడం వల్ల బరువు ఎంతో కొంత కచ్చితంగా తగ్గుతారు.
నడక మీ సృజనాత్మక ఆలోచనలను తట్టి లేపుతుంది. సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో ముందుంటుంది. మైండ్ ఫుల్ నెస్, ఓపెన్ థింకింగ్ ను ప్రోత్సహిస్తుంది.
గుండె ఆరోగ్యానికి
రోజూ 11 నిమిషాల పాటు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నడక గుండెకు రక్తప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. గుండెకు ఇతర అవయవాలకు ఆక్సిజన్, ఇతర పోషకాల సరఫరా పెరుగుతుంది. దీనివల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
ఒత్తిడి నిర్వహించే శక్తిని కూడా నడక మీకు ఇస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉండేలా చూస్తుంది. మానసిక స్థితిని పెంచే ఎండార్పిన్లను విడుదల అయ్యేలా చేస్తుంది. రోజువారీ ఒత్తిళ్ళను తగ్గిస్తుంది.
ప్రతిరోజూ నడిచే వారిలో కీళ్ల నొప్పులు తక్కువగా వస్తాయి. కీళ్లపై ఎలాంటి ఒత్తిడి పడదు. ఆర్థరైటిస్ వంటి వాటిని ఇది సమర్థంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. అలాగే కొవ్వును కరిగించడంలో కూడా ముందుంటుంది.
డయాబెటిస్
టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఇప్పుడు అందరికీ ఉంది. డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ప్రతిరోజు 11 నిమిషాల పాటు వేగంగా నడవాలి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం గంటకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో నడవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని తేలింది. కాబట్టి డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే నడకని ఈరోజు నుంచే మొదలుపెట్టండి.
నిద్రలేమి సమస్యలను కూడా నడక తగ్గిస్తుంది. నడక మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడు కణాలను సరికొత్తగా పుట్టేలా చేస్తుంది.జీర్ణ ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది.
టాపిక్