Weightloss in Hours: కొన్ని గంటల్లోనే బరువు తగ్గించే వ్యాయామం ఏదైనా ఉందా? ఆ ఎక్సర్ సైజ్ చేస్తే నిజంగానే బరువు తగ్గుతారా?
Weightloss in Hours: ఒలింపిక్స్ ఫైనల్లో వినేశ్ ఫోగట్ అనర్హత వేటుకు గురికావడంతో అధిక బరువుపై చర్చ జరిగింది. వేగంగా బరువు తగ్గించే వ్యాయామం ఏదైనా ఉందా అని వెతికే వాళ్లు ఉన్నారు.
వినేశ్ ఫొగాట్ కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఎక్కువగా ఉందని ఫైనల్ నుంచి అనర్హత బారిన పడింది. దీంతో బరువుపై చర్చ మరోసారి ముదిరింది. వాస్తవానికి, అథ్లెట్లకు బరువు నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. నిజానికి వినేశ్ ఫోగట్ కంటే ముందు బాక్సర్ మేరీకోమ్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. బరువు పెరగడం వల్ల అనర్హత వేటు పడుతుందనే భయం క్రీడాకారులకు ఉంటుంది. వినేష్ ఫోగట్ అనుకోకుండా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కేవలం ఒక్క రాత్రిలోనే ఆమె దాదాపు రెండు కిలోల దాకా బరువు తగ్గింది. ఇలా గంటల్లోనే బరువు తగ్గే అవకాశం ఉందా అని ఎంతో మంది గూగుల్ లో వెతుకుతున్నారు.
వాస్తవానికి, 2018 లో పోలాండ్లోని సిలేసియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో రెగ్యులర్ వెయిట్ చెకప్ సమయంలో, మేరీ కోమ్ 48 కిలోలకు పైగా బరువు ఉంది. ఆమెపై అనర్హత వేటు పడుతుందని భయపడింది. కానీ మేరీకోమ్ త్వరగా తన పెరిగిన బరువును తగ్గించుకుని బరువును నియంత్రించుకుంది. గంటపాటు ఆమె వ్యాయామం చేసింది బరువును తగ్గించుకుంది.
హై ఇంటెన్సిటీ వర్కవుట్స్
హైఇంటెన్సిటీ వర్కవుట్స్ చేయడం వల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. కాసేపు ఫాస్ట్ యాక్టివిటీ, ఆ తర్వాత స్లో యాక్టివిటీ చేయడం ద్వారా వేగంగా బరువు తగ్గుతారు. హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ జీవక్రియను పెంచడానికి, తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
జంపింగ్ రోప్
జంపింగ్ రోప్ చేయడం ద్వారా కూడా త్వరగా బరువు తగ్గవచ్చు. వినేష్, మేరీ కోమ్ వంటివారు గంటల్లో బరువు తగ్గేందుకు జంపింగ్ రోప్ వ్యాయామాన్నే ఎంపిక చేసుకున్నారు. ఇది అధిక తీవ్రత కలిగిన వ్యాయామాలలో ఒకటి. ఒక నిమిషం జంపింగ్ రోప్ చేయడం వల్ల 10-16 కేలరీలను బర్న్ చేస్తుంది. ఈ విధంగా మీరు వేగంగా బరువు తగ్గవచ్చు. జంపింగ్ రోప్ అనేది చాలా తక్కువ స్థలంలోనే చేసే వ్యాయామం. కేవలం ఒక్క తాడు సహాయంతో సులభంగా బరువు తగ్గవచ్చు. దీన్ని మనం తాడాట అంటారు. ఇది చేయడం వల్ల కండరాలు బలంగా, గుండె, ఊపిరితిత్తులు దృఢంగా మారుతాయి. దీంతో పాటు కాళ్లు, చేతులు, మనసును కూడా బలోపేతం చేస్తుంది. జంపింగ్ తాడు మనస్సు, శరీరాన్ని ఒకదానితో ఒకటి సమతుల్యం చేస్తుంది. అందుకే జంపింగ్ రోప్ ఉత్తమ వ్యాయామాలలో ఒకటి.
మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ అరగంట పాటూ జంపింగ్ రోప్ వ్యాయామం చేయండి. ఇది ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది. కాబట్టి ఒక్క రోజులో, ఒక్క గంటలో బరువు తగ్గడానికి బదులు జంపింగ్ రోప్ వ్యాయామం ద్వారా నెలలో మూడు నుంచి అయిదు కిలోలు చాలా సులువుగా తగ్గవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి…మీకు కచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది.
టాపిక్