Watermelon Recipes : పుచ్చకాయతో 6 రకాల జ్యూస్‌లు.. ఎంతో ఆరోగ్యం-varieties of watermelon recipes try it these 6 juices in home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Watermelon Recipes : పుచ్చకాయతో 6 రకాల జ్యూస్‌లు.. ఎంతో ఆరోగ్యం

Watermelon Recipes : పుచ్చకాయతో 6 రకాల జ్యూస్‌లు.. ఎంతో ఆరోగ్యం

Anand Sai HT Telugu
Apr 28, 2024 03:30 PM IST

Watermelon Juices : వేసవిలో దొరికే పండు పుచ్చకాయ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో పలు రకాల జ్యూస్‌లు చేసుకోవచ్చు. వాటిని చూద్దాం..

పుచ్చకాయతో జ్యూస్‌లు
పుచ్చకాయతో జ్యూస్‌లు (Unsplash)

పుచ్చకాయ పండు వేసవిలో తినేందుకు బాగుంటుంది. నేరుగా తినేయెుచ్చు. అయితే వేసవిలో జ్యూస్ తాగితే బాగుంటుంది. పంచదార వేయకుండా రుచికరమైన పుచ్చకాయతో 6 రకాల పుచ్చకాయ రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

పుచ్చకాయ, పుదీనా జ్యూస్

3 కప్పుల పుచ్చకాయ, 1 కప్పు పైనాపిల్ రసం, 1 నిమ్మకాయ, 5 పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ అల్లం తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ గ్రైండ్ చేసి అందులో 2 పుదీనా ఆకులు, అవసరమైతే ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి.

పుచ్చకాయ, నిమ్మరసం జ్యూస్

పుచ్చకాయ పండు ఒకటి, 2 నిమ్మకాయలు, 4-5 పుదీనా ఆకులు తీసుకోవాలి. మెుదట పుచ్చకాయ, పుదీనా ఆకులు, ఒక నిమ్మకాయ రసం గ్రైండ్ చేసుకోవాలి. అయ్యాక పైన నుంచి మరో నిమ్మకాయ రసం పిండుకోవాలి. చల్లగా ఉంటుంది.

పుచ్చకాయ, ఆపిల్ జ్యూస్

పుచ్చకాయ, ఆపిల్ కలయిక బాగుంటుంది. పుచ్చకాయ పండు 2 కప్పులు, 1 యాపిల్, కొద్దిగా అల్లం, నిమ్మరసం తీసుకోవాలి. పుచ్చకాయ పండు, ఆపిల్, అల్లం మెత్తగా చేసుకుని నిమ్మరసం జోడించండి.

పుచ్చకాయ, బీట్‌రూట్ జ్యూస్

పుచ్చకాయ, బీట్‌రూట్ రసం బాగుంటుంది. సగం పుచ్చకాయ, 1 బీట్‌రూట్, 1 ఆపిల్, కొద్దిగా అల్లం, 1/2 నిమ్మరసం తీసుకోవాలి. పుచ్చకాయ, బీట్‌రూట్, యాపిల్, అల్లం గ్రైండ్ చేసుకుని జ్యూస్ చేయాలి. తర్వాత నిమ్మరసం పిండుకుని రుచి చూడండి.

పుచ్చకాయ, ద్రాక్ష జ్యూస్

పుచ్చకాయ, ద్రాక్ష కలయిక రుచి సూపర్ గా ఉంటుంది. సగం పుచ్చకాయ, ద్రాక్ష, కొద్దిగా అల్లం, కొద్దిగా తేనె పక్కకు పెట్టుకోవాలి. పుచ్చకాయ, అల్లం, ద్రాక్ష వేసి వాటిని జ్యూస్ చేసి అందులో తేనె కలుపుకుంటే జ్యూస్ రెడీ.

పుచ్చకాయ, అల్లం జ్యూస్

3 కప్పుల పుచ్చకాయ, 1 చిన్న కప్పు నిమ్మరసం, కొద్దిగా అల్లం తీసుకోవాలి. పుచ్చకాయ పండు, కొద్దిగా అల్లం రసం, కొద్దిగా నిమ్మరసం జోడించండి. కివీ పండును కూడా జోడించవచ్చు. పుచ్చకాయ పండుతో అనేక రుచులలో జ్యూస్ తయారు చేయవచ్చు. ఈ జ్యూస్‌లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఎందుకంటే వీటిలో చక్కెర వేయరు. ఐస్ జోడించవచ్చు.

పుచ్చకాయ ప్రయోజనాలు

పుచ్చకాయ పండు తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది. పొటాషియం, కాల్షియం అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ పండులో నీటిశాతం ఉండటం వల్ల, మూత్రవిసర్జన ద్వారా మురికిని బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఇది లైకోపీన్ కంటెంట్ కారణంగా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్‌ను నివారించడంలో బాగా సహాయపడుతుంది. లైకోపీన్ కంటెంట్ ప్రోస్టేట్, కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ఈ రకమైన క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా సాయపడుతుంది.

పుచ్చకాయ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో రక్తపోటు పెరిగితే పక్షవాతం, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. శరీరంలో నీటిశాతం మెయింటెయిన్‌కి సహాయపడుతుంది. పుచ్చకాయ వేసవిలో ప్రతిరోజూ తింటే మంచిది. పుచ్చకాయ తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉన్నాయి. ఇది కంటి ఆరోగ్యానికి ఉపయోగకరం.

Whats_app_banner