Tech layoffs this week: బైజూస్, ఆపిల్, అమెజాన్ ల్లో ఉద్యోగుల తొలగింపు; లే ఆఫ్స్ దిశగా ఇతర కంపెనీలు-tech layoffs this week byjus apple amazon cut jobs citing downsizing shifts ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tech Layoffs This Week: బైజూస్, ఆపిల్, అమెజాన్ ల్లో ఉద్యోగుల తొలగింపు; లే ఆఫ్స్ దిశగా ఇతర కంపెనీలు

Tech layoffs this week: బైజూస్, ఆపిల్, అమెజాన్ ల్లో ఉద్యోగుల తొలగింపు; లే ఆఫ్స్ దిశగా ఇతర కంపెనీలు

HT Telugu Desk HT Telugu
Apr 06, 2024 05:11 PM IST

Tech layoffs this week: ఇటీవలి కాలంలో మెగా టెక్ కంపెనీలు కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మరోసారి ప్రారంభించాయి. కొరోనా సమయంలో అవసరానికి మించి నియామకాలు చేపట్టడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నిర్వహణ ఖర్చులను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా కంపెనీలు లే ఆఫ్స్ బాట పడ్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇటీవలి కాలంలో అమెజాన్, ఆపిల్, బైజూస్ తదితర కంపెనీలు భారీగా తమ ఉద్యోగులను తొలగించాయి. Layoffs.fyi ప్రకారం.. 2024 లో ఇప్పటివరకు 235 కంపెనీలు 57,785 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 121 కంపెనీలు 34,007 మంది ఉద్యోగులను తొలగించగా, ఫిబ్రవరిలో 74 కంపెనీలు 15,379 ఉద్యోగాలను తొలగించాయి.

అమెజాన్ 100 ఉద్యోగాల కోత

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన వెబ్ సర్వీసెస్ డివిజన్ లోని సేల్స్, మార్కెటింగ్, టెక్ విభాగాల నుంచి కొన్ని వందల ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. సంస్థలో స్ట్రీమ్ లైన్ చేయాల్సిన కొన్ని ఏరియాలను గుర్తించామని, ఆయా ఏరియాల నుంచి ఉద్యోగుల సంఖ్యను క్రమబద్ధీకరించాలని నిర్ణయించామని తెలిపింది. ప్రైమ్ వీడియో సర్వీస్, హెల్త్ కేర్, అలెక్సా వాయిస్ అసిస్టెన్స్ యూనిట్ సహా పలు విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను ఆమెజాన్ తొలగించింది (Layoffs). కరోనా మహమ్మారి కాలంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టిన ఆమెజాన్.. గత రెండేళ్లుగా 27,000కు పైగా కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించినట్లు సమాచారం. అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం నుంచి కూడా 500 మంది ఉద్యోగులను ఇటీవల తొలగించారు.

500 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్

ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ (Byju’s) తన ఉద్యోగులలో దాదాపు 500 మందిని తొలగిస్తున్నట్లు ఇటీవల తెలిపింది. బైజూస్ లోని మొత్తం 15,000 మంది ఉద్యోగులలో దాదాపు 3 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. తీవ్రమైన నిధుల సంక్షోభం, వాల్యుయేషన్‌లో మార్క్‌డౌన్‌తో బైజూస్ ఇబ్బంది పడుతోంది. దాంతో, సంస్థ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా దాదాపు 4,500 మంది ఉద్యోగులను తొలగించింది.

నుంచి 600 ఉద్యోగులకు ఉద్వాసన

కాలిఫోర్నియా లోని ఆఫీస్ లో విధుల్లో ఉన్న వారిలో దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ (Apple) ప్రకటించింది. వివిధ ప్రాజెక్టుల మూసివేతతో పాటు, నిర్వహణ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయ తీసుకున్నట్లు తెలిపింది. ఆపిల్ ఇప్పటికే కార్ డిస్ ప్లే, స్మార్ట్ వాచ్ డిస్ ప్లే ప్రాజెక్టులను మూసివేసిన విషయం తెలిసిందే.

Whats_app_banner