Beetroot Cutlet : బీట్‌రూట్ కట్‌లెట్.. సాయంత్రం హాయిగా లాగించేయెుచ్చు.-how to prepare beetroot cutlet for snacks heres simple process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Cutlet : బీట్‌రూట్ కట్‌లెట్.. సాయంత్రం హాయిగా లాగించేయెుచ్చు.

Beetroot Cutlet : బీట్‌రూట్ కట్‌లెట్.. సాయంత్రం హాయిగా లాగించేయెుచ్చు.

Anand Sai HT Telugu
Jan 21, 2024 03:30 PM IST

Beetroot Cutlet Recipe : బీట్‌రూట్ ఆరోగ్యానికి మంచిది. అయితే దీనిని ఉపయోగించి.. కట్‌లెట్ తయారు చేయండి. స్నాక్స్ గా తినేందుకు బాగుంటుంది.

బీట్‌రూట్ కట్‌లెట్
బీట్‌రూట్ కట్‌లెట్ (unsplash)

సాయంత్రం కాఫీ, టీ తాగేటప్పుడు మీ కుటుంబ సభ్యులు స్నాక్స్ అడుగుతున్నారా? బజ్జీ, బొండ, వడ లాంటివి వద్దు అంటే కొత్తగా ట్రై చేయండి. కట్లెట్స్ తయారు చేసి ఇవ్వండి. మీ ఇంట్లో బీట్‌రూట్ ఉంటే మంచి రుచికరమైన కట్లెట్స్ చేయెుచ్చు. ఈ కట్‌లెట్ తయారు చేయడం చాలా సులభం. ఈ కట్‌లెట్.. బీట్‌రూట్ తినని వారు కూడా ఇష్టంగా తింటారు. బీట్‌రూట్ కట్‌లెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. బీట్‌రూట్ కట్‌లెట్ రెసిపీ కోసం కింది పద్ధతులను పాటించండి. ఈజీగా తయారు చేయెుచ్చు.

బీట్‌రూట్ కట్‌లెట్‌కు కావాల్సిన పదార్థాలు

బీట్‌రూట్ - 1, బంగాళదుంప - 3, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి), పచ్చి బఠానీలు - 2 టేబుల్ స్పూన్లు, అల్లం - 1, టీస్పూన్ (తురిమినవి), వెల్లుల్లి - 1 టీస్పూన్ (తురిమినవి), పసుపు పొడి - 1/4 టీస్పూన్, కారం - 1/2 స్పూన్, గరం మసాలా - 1/4 టీస్పూన్, సేమియా - 1/4 కప్పు, బ్రెడ్ పౌడర్ - 3/4 కప్పు, ఉప్పు - రుచి ప్రకారం, మైదా - 2-3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా, నూనె - 4-5 టేబుల్ స్పూన్

బీట్‌రూట్ కట్‌లెట్‌ తయారీ విధానం

ముందుగా బంగాళదుంప, బీట్‌రూట్‌లను కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి ఓవెన్‌లో పెట్టి కుక్కర్‌ను మూతపెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత దించాలి. విజిల్ అయిపోగానే.. కుక్కర్ తెరిచి బంగాళదుంపలు, బీట్‌రూట్‌లను తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు సేమియాను వేడినీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని వడపోసి విడిగా ఉంచుకోవాలి. అదే సమయంలో పచ్చి బఠానీలను నీటిలో వేసి మరిగించి పక్కన పెట్టుకోవాలి.

బంగాళదుంపలను మెత్తగా చేయాలి. బీట్‌రూట్‌ను ఒకసారి గ్రైండ్ చేయండి. తర్వాత ఓవెన్‌లో కడాయి పెట్టి అందులో 2 టీస్పూన్ల నూనె పోసి వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగించాలి. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసి అందులో మెత్తని బంగాళదుంప, బీట్‌రూట్, సేమియా, మసాలా పొడులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు బాగా మరిగించి, కొత్తిమీర చల్లి చల్లార్చాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి కట్లెట్స్‌లా చేసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇంతలో ఒక గిన్నెలో మైదా, చిటికెడు ఉప్పు, నీళ్లు కలపాలి. మరో ప్లేటులో బ్రెడ్ పౌడర్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కట్లెట్ ను తీసుకుని మైదాలో ముంచి బ్రెడ్ పౌడర్ లో వేసి ప్లేట్ లో పెట్టుకోవాలి. చివరగా ఓవెన్‌లో బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో కట్‌లెట్‌ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుంటే రుచికరమైన బీట్‌రూట్‌ కట్‌లెట్‌ రెడీ.

Whats_app_banner