Valentine's Week Full List : వాలెంటైన్స్ వీక్ ఫుల్ లిస్ట్.. ఏ రోజు ఏంటి?
Valentine's Week Full List In Telugu : ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికులకు ఎక్కడా లేని ఆనందం. ప్రియమైన వారితో గడపాలని అనుకుంటారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు.. కానీ వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7 నుంచే మెుదలవుతుంది. ఏ రోజు ఏంటో తెలుసుకుందాం.
ఫిబ్రవరి నెల కోసం ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తారు. తమ ప్రియమైన వ్యక్తికి ప్రేమికుల దినోత్సవం రోజున ఎన్నో విషయాలు చెప్పాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఎన్నో బహుమతులు ఇవ్వాలని ఆలోచిస్తారు. అయితే వారి కోసం వాలెంటైన్స్ వీక్ మెుత్తం సెలబ్రేట్ చేసేలా ప్లాన్ చేయండి.
ఒకప్పుడు ప్రేమికుల దినోత్సవం అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ రానురాను వాలెంటైన్స్ డేని కిందటి సంవత్సరం కంటే ఎక్కువ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న అయినా ఫిబ్రవరి 7 నుంచే వాలెంటైన్స్ వీక్ మెుదలవుతుంది. మొదట రోజ్ డే నుండి వాలెంటైన్స్ డే వరకు జరుగుతుంది. ఆ రోజుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
ఫిబ్రవరి 7-రోజ్ డే
మీరు ప్రేమించిన వ్యక్తికి ఎరుపు గులాబీ లేదా గులాబీ పువ్వుల గ్రీటింగ్ కార్డ్ పంపడం గులాబీ దినోత్సవం ప్రత్యేకం. ప్రతి గులాబీ రంగు ఒక సంబంధం గురించి చెబుతుంది. తెల్ల గులాబీ స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం. ఎరుపు గులాబీ తీవ్రమైన ప్రేమకు చిహ్నం. తెలుపు, ఎరుపు గులాబీలు మీ లోతైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమను సూచిస్తుంది. మీ ప్రియమైన వారికి రోజ్ డే రోజున గులాబీ పువ్వులు పంపండి. వాలెంటైన్స్ వీక్ ఈరోజుతోనే మెుదలవుతుంది.
ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే
ఈ రోజు మనం ఇష్టపడే వ్యక్తికి మన ప్రేమను వ్యక్తపరిచే రోజు. ఎవరికైనా మీ ప్రేమ గురించి చెప్పాలి అనుకుంటే భయం లేకుండా చెప్పేసేయండి. మీ ప్రియమైన వారికి కూడా కొత్తగా ప్రపోజ్ చేయాలి.
ఫిబ్రవరి 9 చాక్లెట్ డే
ఈ రోజున మీ ప్రియమైన వారికి, నచ్చిన వ్యక్తికి చాక్లెట్లు ఇవ్వండి. చాక్లెట్ ఇచ్చి.. మీ ప్రేమను వ్యక్తపరచండి. విషెస్ చెప్పండి. ప్రేమికులు మాత్రమే కాదు, పెళ్లయిన వారు తమ భాగస్వామికి చాక్లెట్ గిఫ్ట్ ఇస్తే తప్పకుండా సంతోషిస్తారు.
ఫిబ్రవరి 10 టెడ్డీ డే
ఈ రోజున అబ్బాయిలు తమ స్నేహితురాలికి మంచి టెడ్డీ బేర్‌ని ఇస్తారు. సాధారణంగా అమ్మాయిలు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టంగా తీసుకుంటారు. మిమ్మల్ని గుర్తుచేసుకుంటూ.. టెడ్డీని కౌగిలించుకుంటారు. టెడ్డీని చూసినప్పుడల్లా మీరే వారికి గుర్తుకువస్తారు. వాలెంటైన్స్ వీక్ మెుత్తం టెడ్డీని చూస్తూ ఉండిపోతారు.
ఫిబ్రవరి 11 ప్రామిస్ డే
నీ సుఖ దుఃఖాలలో ఎప్పుడూ నీ వెంటే ఉంటానని వాగ్దానం చేసే రోజు. మీ ప్రియమైన వారికి మీరు భరోసా ఇవ్వాలి. మీతో జీవితాంతం ఉంటానని చెప్పాలి. అప్పుడే వారు సంతోషంగా ఉంటారు.
ఫిబ్రవరి 12 హగ్ డే
కొన్నిసార్లు మన కౌగిలింతలే మనకు ఎంత ప్రేమ ఉందో వ్యక్తికరిస్తాయి. మన ప్రేమపూర్వక కౌగిలింతలు మనం వారిని ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేస్తాయి. హగ్ డే రోజున మీ ప్రియమైన వారిని కౌగిలించుకుని ఐ లవ్ యూ చెప్పండి. వాలెంటైన్స్ వీక్‌లో ఇది చాలా ముఖ్యమైన రోజు
ఫిబ్రవరి 13 కిస్ డే
కిస్ డే రోజున ప్రేమికులు విదేశాలలో ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. మీరు ఈ రోజును ఇక్కడ ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. నుదిటిపై ప్రేమతో ఒక్క ముద్దు పెట్టండి. చాలా రోజులు గుర్తుండిపోయేలా ఉంటుంది.
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. మీ ప్రేమ గురించి వారికి చెప్పండి. మీతో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారో వివరించండి. మీ ప్రేమను ఎంతో స్వచ్ఛమైనదో తెలపండి. వాలెంటైన్స్ వీక్‌లో ఇది ముఖ్యమైనది.