Girls Do Not Propose : ఈ అమ్మాయిలకు ఏమైంది? ముందుగా ఎందుకు ప్రపోజ్ చేయరు?-why girls do not propose first all you need to know boys ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Girls Do Not Propose : ఈ అమ్మాయిలకు ఏమైంది? ముందుగా ఎందుకు ప్రపోజ్ చేయరు?

Girls Do Not Propose : ఈ అమ్మాయిలకు ఏమైంది? ముందుగా ఎందుకు ప్రపోజ్ చేయరు?

HT Telugu Desk HT Telugu
Sep 01, 2023 02:30 PM IST

Why Girls Not Propose : వందలో 99 ప్రేమ కథల్లో అబ్బాయిలే ముందుగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అమ్మాయిలు మాత్రం ఒప్పుకొనేందుకు కూడా చాలా ఆలోచిస్తారు. అబ్బాయిలే ముందుగా ఎందుకు ప్రపోజ్ చేస్తారు? అమ్మాయిలు ఎందుకు చేయరు?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

మనం ఎవరితో ప్రేమలో పడతామో చెప్పలేం. ఆ ప్రేమ విజయవంతం కావడానికి ప్రేమను క్లెయిమ్ చేసుకోవడం చాలా ముఖ్యం. తమ ప్రేమను లేదా మనసులోని విషయాన్ని వ్యక్తీకరించడంలో అబ్బాయిలు ముందుంటారు. చాలా మంది అమ్మాయిలు తమ హృదయంలో ఒక అబ్బాయి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. కానీ దానిని చెప్పడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే దాని వెనక చాలా కారణాలు ఉంటాయి. అమ్మాయిలు తమ ప్రేమను ముందుగా ఎందుకు ఒప్పుకోరు? అని ఎప్పుడైనా ఆలోచించారా?

అమ్మాయిల మనసులో అబ్బాయిలండి.. విపరీతమైన ప్రేమ ఉన్నా.. చెప్పాలనిపించదు. అబ్బాయిలు మాత్రం ముందుగానే చెప్పేస్తారు. మనసులో మాట చెబితే.. ఒప్పుకుంటారేమోనని అబ్బాయిలకు ఓ ఆశ. కాబట్టి అబ్బాయిలు ముందుగా ప్రేమను చెప్పాలనుకుంటారు. భారతీయ సంస్కృతిలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. బయట సమాజం ఏం అంటుందోనని భయం ఉంటుంది అమ్మాయిలకు. అందుకే కొన్ని నిబంధనల వల్ల అమ్మాయిలు తమ ప్రేమను ముందుగా ఒప్పుకోవడానికి వెనుకాడతారు. అబ్బాయిలు చెప్పడానికి రెడీగా ఉంటారు.

చాలా సందర్భాల్లో అబ్బాయిలే తమ ప్రేమను ఒప్పుకుంటారు. ముందుగా తన ప్రేమను చెబితే ఏమనుకుంటారోనని భయం అమ్మాయిలకు ఉంటుంది. ముందుగా అమ్మాయి చెబితే.. విషయం బయటకు తెలిస్తే.. జనాలు ఆమె ప్రవర్తన గురించి మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అమ్మాయిలు తమ ప్రేమను ముందుగా ఒప్పుకోవడానికి సంకోచిస్తారు.

మనం ప్రేమలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అయితే ఆ ప్రేమ సఫలం కావాలంటే మనం ప్రేమించే వారి దగ్గర ఒప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ఇష్టపడే అబ్బాయి మనపై ఆసక్తి చూపకపోతే ఆ ప్రేమను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అబ్బాయిలు తమ ప్రేమను తిరస్కరించి వదిలేస్తారేమోనని చాలా మంది అమ్మాయిలు భయపడుతుంటారు. నిజానికి అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. తట్టుకోవడం ఏ మాగాడి వల్ల కాదు.. ఇది నిజం.

అమ్మాయిలు సాధారణంగా అబ్బాయిలలో చాలా విషయాలు గమనిస్తారు. తగిన అబ్బాయి కోసం వెతుకుతారు. ఆమె తన వ్యక్తిత్వానికి సరిపోయే ఆదర్శవంతమైన అబ్బాయి కోసం వెతుకుతుంది. అబ్బాయి మంచివాడా కాదా అని నిర్ణయించుకోవడానికి అమ్మాయిలు సమయం తీసుకుంటారు. అందుకే ముందుగా ప్రపోజ్ చేయరు.

ప్రేమ విషయంలో గొడవలు జరగడం మామూలే. ఇలా కొట్లాటలు జరిగితే అబ్బాయిలు తమవైపు వేలెత్తి చూపుతారనే భయం అమ్మాయిల్లో ఉంటుంది. నువ్వే కదా.. నన్ను ఇష్టపడింది.. భరించు అనే ప్రమాదం ఉంది. ఈ కారణాల వల్ల అమ్మాయిలు తమ ప్రేమను ముందుగా ఒప్పుకోవడానికి భయపడతారు.

Whats_app_banner