Summer Food Poisoning : ఫుడ్ పాయిజన్ అవుతుందా? ఇలా చేస్తే తగ్గిపోతుంది
Summer Food Poison : వేసవిలో ఫుడ్ పాయిజన్ సమస్యను కొంతమంది ఎదుర్కొంటారు. బయటకు వెళ్లేటప్పుడు ఆహారం పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయట తాగే నీరు శుభ్రంగా లేకపోయినా.. సమస్యలు తప్పవు.
వేసవిలో ఫుడ్ పాయిజనింగ్(Summer Food Poisoning) అవుతుంటుంది. దీనికి ప్రధాన కారణం పొడి వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే. అలాగే గ్రిల్డ్, తందూరీ వంటి నాన్ వెజ్ ఫుడ్స్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా వండకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువ. తిన్న ఆహారం.. ఫుడ్ పాయిజన్ అయిందో లేదో తెలుసుకోవాలి. కింది విషయాలను గుర్తించాలి.
Food Poisoning ఎలా గుర్తించాలి?
ఆహారం తిన్న తర్వాత వాంతులు
కడుపు నొప్పి
విపరీతమైన అలసట.
రెండు మూడు సార్లు వాంతులు చేసుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
ఫుడ్ పాయిజనింగ్‌ను ఎలా నివారించాలి?
పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే తినండి, బయట తినడానికి వెళ్లవద్దు.
ఆహారాన్ని బాగా వండుకుని తినాలి.
ఎండలో ఆరుబయట కూర్చుని ఆహారం తినకూడదు.
ఆహారాన్ని తయారు చేయడానికి శుభ్రమైన నీటిని వాడాలి.
పండ్లు, కూరగాయలను కడిగి తినండి.
కుళ్ళిన కూరగాయలు, పండ్లు ఉపయోగించవద్దు.
మీకు వికారంగా అనిపిస్తున్నందున నీరు తీసుకోవడం తగ్గించవద్దు. గంజి, నీరు, పుదీనా టీ, బ్లాక్ టీ వంటివి తీసుకోవాలి.
ORS వినియోగించండి.
ఫుడ్ పాయిజనింగ్‌కు హోం రెమెడీ
యాపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు వేడి నీటిలో 2-3 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, ఆహారానికి ముందు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది.
శొంఠి పొడి : ఒక గ్లాసు వేడి నీటిలో 1/2 చెంచా అల్లం పొడి, తేనె కలిపి తాగాలి.
పెరుగు, మెంతి : ఒక కప్పు పెరుగులో ఒక చెంచా మెంతి వేసి తినండి. మెంతులు నమలకండి, పూర్తిగా మింగండి.
నిమ్మరసం : ఒక గ్లాసు వేడి నీళ్లలో నిమ్మరసం, ఉప్పు, పంచదార కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది.
చల్లని పాలు : చల్లని పాలు అసిడిటీని తగ్గిస్తుంది. ఎసిడిటీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ఉన్నప్పుడు, ఒక గ్లాసు చల్లని పాలు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
జీలకర్ర నీరు : నీళ్లలో జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి 2-3 సార్లు తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.
ఇలాంటివి చేసిన తర్వాత కూడా తగ్గకపోతే.. వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకోండి. చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. వంటగదిలో శుభ్రత పాటించండి. డీప్ ఫ్రీజర్‌లో ఆహారాన్ని ఉంచవద్దు. కోలుకుంటున్న వారికి విశ్రాంతి, మంచి నిద్ర అవసరం.
ఫుడ్ పాయిజన్ అయితే ఏం తినొద్దు?
సాలిడ్ ఫుడ్ తినకూడదు, స్ట్రీట్ ఫుడ్ తినకూడదు
ఫుడ్ పాయిజన్ అయితే కొన్ని రోజులు కారంగా, వేయించిన ఆహారం తినకూడదు.
మాంసం తినకూడదు.
మద్యం, పొగ తాగకూడదు.
నీటిని మరిగించి తాగాలి. వీలైతే ప్రయాణంలో ఆహారాన్ని తీసుకెళ్లండి, లేకపోతే పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే తినండి.
సంబంధిత కథనం