Wife gives slow poison to husband: ‘స్లో పాయిజన్ ఇచ్చి భర్తను చంపాలనుకుంది’
Wife gives slow poison to husband: అతడు అమెరికాలో పెరిగాడు. అక్కడ జాబ్ కూడా చేశాడు. కానీ మూఢ నమ్మకాలకు విశ్వసించాడు. తాజాగా, తన భార్యతో పాటు మరో ముగ్గురు తనను చంపడానికి కుట్ర చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాజస్తాన్ లోని జైపూర్ కు చెందిన నితిన్ ఉపాధ్యాయ్ ఒక ఎన్ఆర్ఐ. రెండేళ్ల వయసులో తండ్రితో పాటు అమెరికా వెళ్లి అక్కడే పెరిగాడు. వివాహం అయ్యాక భార్య కోరిక మేరకు ఇండియా తిరిగి వచ్చాడు. ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేశాడు.
Wife gives slow poison to husband: విషం ఇచ్చారు..
నితిన్ ఉపాధ్యాయ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య తనకు స్లో పాయిజన్ ఇచ్చి చంపడానికి ప్రయత్నించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల తన ఆరోగ్యం బాగా క్షీణించడంతో డాక్టర్ ను కలిసి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నానని, ఆ పరీక్షల్లో తన శరీరంలో విషం ఆనవాళ్లు బయటపడ్డాయని వివరించాడు.
Wife gives slow poison to husband: మాంత్రికుడితో కలిసి..
దాంతో, పోలీసులు నితిన్ ఉపాధ్యాయ్ భార్యను, మొహమ్మద్ యూసుఫ్ అనే మంత్రగాడిని, నితిన్ కంపెనీలో పనిచేసే శివ గౌతమ్ ను, తన ఇంట్లో సర్వెంట్ గా ఉన్న సక్సేనాను అరెస్ట్ చేశారు. వారిపై హత్యాయత్నం కేసు పెట్టారు.
Wife gives slow poison to husband: కాల సర్ప దోషం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నితిన్ భార్య మాంత్రికుడైన మొహమ్మద్ యూసుఫ్ తో కలసి ఈ కుట్ర పన్నింది. వారిద్దరు కలిసి తనకు కాల సర్ప దోషం ఉందని నితిన్ ఉపాధ్యాయను నమ్మించారు. ఆ దోషం పోవడానికి రకరకాల పూజలు చేయించారు. రకరకాల పొడులను, ద్రవాలను ఇచ్చేవారు. చివరకు, భారత్ లో ఉంటే, చావు తప్పదు కాబట్టి అమెరికా వెళ్లిపోవాలని భయపెట్టి, అతడిని అమెరికా పంపించారు. దోషం పోవాలని కొన్న పొడులను వారు అమెరికా కూడా పంపించారు. వాటిలో కొద్ది కొద్దిగా విషం కలిపేవారు. ఆయనలో భయాన్ని మరింత పెంచడం కోసం భారత్ లోని ఆయన బెడ్ రూమ్ లో పాములు తిరుగుతున్నట్లు వీడియోలు సృష్టించి ఆయనకు పంపించారు. దాంతో నితిన్ ఉపాధ్యాయ వారిని పూర్తిగా విశ్వసించారు. ఈ లోపు, నితిన్ ఉపాధ్యాయ ఆస్తులను శివ, సక్సేనాలతో కలిసి అమ్మేశారు.
Wife gives slow poison to husband: ఇండియా వచ్చాక..
ఇండియా తిరిగి వచ్చిన తరువాత ఈ మోసాన్ని నితిన్ గుర్తించాడు. దాంతో, భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ భార్య తన భర్తను, కుమారుడిని వదిలేసి వెళ్లిపోయింది. ఇంతలో నితిన్ ఉపాధ్యాయ ఆరోగ్యం బాగా క్షీణించడంతో స్లో పాయిజన్ విషయం బయటపడింది.