Men's Hygiene । మగవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు!-sleeping in underwear to shaving hair men should avoid common mistakes in their personal hygiene ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Men's Hygiene । మగవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు!

Men's Hygiene । మగవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు!

HT Telugu Desk HT Telugu
Apr 14, 2023 08:40 PM IST

Men's Hygiene: మగవారు తెలియకుండానే కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. పురుషులుపొరపాటున కూడా చేయకూడని తప్పులు, వాటి పరిష్కారాలు ఇక్కడ చూడండి.

Men's Hygiene Tips
Men's Hygiene Tips (Unsplash)

Men's Personal Hygiene: వేసవిలో ఉండే తీవ్రమైన ఎండవేడి కారణంగా చెమట ఎక్కువపడుతుంది. ఆపై దుమ్ముధూళి, బ్యాక్టీరియా కూడా చేరి శరీరం నుంచి అసహ్యకరమైన వాసన వస్తుంది. కాబట్టి ఈ సీజన్ లో పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా మగవారికి వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారి వ్యక్తిగత పరిశుభ్రత (Perosnal Hygiene) విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగం, ఒకరి వ్యక్తిగత పరిశుభ్రతే వారి వ్యక్తిత్వాన్ని పెంచడంలో, వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే చాలా మంది మగవారు తమ వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తమకు తెలియకుండానే కొన్ని సాధారణ తప్పులు చేస్తారు, ఇది శరీరంపై బ్యాక్టీరియా, జెర్మ్స్ ఆవిర్భావానికి దారితీస్తుంది.

Men's Hygiene Mistakes- పరిశుభ్రతలో మగవారు చేసే తప్పులు

మగవారు అవగాహన లేకుండా చేసే కొన్ని అలవాట్లను గుర్తించడం, మంచి పరిశుభ్రతను కలిగి ఉండటం ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. చాలా మంది పురుషులు తమ వ్యక్తిగత పరిశుభ్రతతో చేసే సాధారణ తప్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

1. Tongue Scrapping- నాలుకను స్క్రాప్ చేయకపోవడం

నోటి దుర్వాసన అనేది మీ భాగస్వామితో మీ సన్నిహిత క్షణాలను అడ్డుకోవచ్చు. నోటి దుర్వాసనకు ప్రధాన కారణం సరైన నోటి పరిశుభ్రత పాటించకపోవడం. దంతాలను ప్రతిరోజూ బ్రష్ చేస్తారు సరే.. కానీ, దంతాలను ఫ్లాస్ చేయడం, నాలుకను శుభ్రం చేయడం మరిచిపోతారు. నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి, పుష్కలంగా నీరు త్రాగడం, విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు టీ, పాలు, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలను తగ్గించాలి, ధూమపానం, పొగాకు నమలడం పూర్తిగా మానేయాలి. దంతాల సందుల్లో ఇరుక్కున ఆహార ఫలకాలను ఫ్లాసింగ్ (Flossing) చేసి తొలగించాలి, నాలుకను కూడా స్క్రాప్ చేయాలి.

2. Frequent Hair wash- తరచుగా జుట్టు కడగడం వద్దు

పురుషులు పొట్టి జుట్టును కలిగి ఉంటారు; కాబట్టి తమ జుట్టును తరచుగా కడగడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తగ్గిపోతాయి. తద్వారా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు త్వరగా నెరిసిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

3. Private Part Shaving- అక్కడ పూర్తిగా షేవింగ్

జననావయవాల చుట్టూ ఉండే వెంట్రుకలు (Pubic Hair), ఆ భాగంలో ఏర్పడే చెమట, ధూళి, జిడ్డును సేకరించే ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా అవి సున్నితమైన ప్రాంతాలు కాబట్టి అక్కడి చర్మంపై రాపిడి జరగకుండా ఇవి అడ్డుకుంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా షేవింగ్ చేయకపోవడమే మంచిది. అంతేకాకుండా పదునైన రేజర్ ను సున్నితమైన చర్మంపై నడిపించడం ద్వారా చీరికలు, గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, అక్కడి వెంట్రుకలను ట్రిమ్ చేయడమే తెలివైన ఎంపిక. ట్రిమ్ చేసేటపుడు కూడా జాగ్రత్త వ్యవహరించాలి.

4. Foreskin Washing- ప్రైవైట్ భాగాన్ని కడగకపోవడం

మగవారు తమ అంగం చర్మాన్ని కూడా లేపి శుభ్రపరచాలి. కేవలం అక్కడ నీళ్లు పోయడం ద్వారా సరిగ్గా శుభ్రం అవ్వదు. మీరు సున్తీ (Circumcision) చేసుకోని వారైతే చర్మం కింది భాగాన్ని కూడా శుభ్రపరచాలి. ఇందుకోసం తేలికపాటి మాయిశ్చరైజింగ్ సబ్బును ఉపయోగించండి. అరచేతిలో కొంత నురగ తీసుకొని సున్నితంగా పూయండి, గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. ఆ ప్రాంతాన్ని కడిగేటపుడు సుకుమారంగా వ్యవహరించండి, వేగంగా తీవ్రంగా కడగడం చేయకూడదు. సువాసన కలిగిన సబ్బులు ఉపయోగించవద్దు.

5. Sleeping in Underwear - లోదుస్తులతో పడుకోవడం

లోదుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ పై ఉక్కపోత పెరిగి చెమట పట్టవచ్చు, లోదుస్తుల రాపిడి చర్మ సమస్యలను కలిగించవచ్చు. అలాగే బిగుతైన లోదుస్తులు ధరించడం వలన వృషణాలపై ఒత్తిడి పెరిగి వాటి సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా మీ సంతాన సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట లోదుస్తులు లేకుండా వదులుగా గాలి తగిలేలా ఉంచడం ఆరోగ్యకరం.

6. Changing of Cloths- విపరీతమైన వాడకం

కొంతమంది మగవారు నిద్రించేటపుడు వేసుకునే షార్ట్ లేదా నైట్ వేర్ ను రోజుల తరబడి వేసుకుంటారు. అది చెమట, ఇతర స్రావాలతో నిండిపోయి మాసిపోతుంది. కాబట్టి ఎల్లప్పుడు శుభ్రమైనవి ధరించండి. అలాగే బెడ్‌షీట్‌లను కూడా రోజుల తరబడి ఉపయోగిస్తుంటారు, వాటిపై ఇన్ఫెక్షన్ కలిగించే బాక్టీరియా, శిలీంధ్రాలు పెరిగే ఆస్కారం ఉంటుంది. అందువల్ల కనీసం ప్రతీ వారానికి ఒకసారి వాటిని గోరువెచ్చని నీటిలో ఉతకడం, ప్రతీవారం శుభ్రమైన బెడ్‌షీట్‌ను ఉపయోగించడం చేయాలి.

WhatsApp channel

సంబంధిత కథనం