Attractive Things in Women | అవి చూసే మగవారు ఆడవారికి ఆకర్షితమవుతారట!-what do men see in women these qualities men find attractive in women
Telugu News  /  Lifestyle  /  What Do Men See In Women, These Qualities Men Find Attractive In Women
 Attractive Things in Women
Attractive Things in Women (iStock)

Attractive Things in Women | అవి చూసే మగవారు ఆడవారికి ఆకర్షితమవుతారట!

28 February 2023, 20:20 ISTHT Telugu Desk
28 February 2023, 20:20 IST

Attractive Things in Women: ఆడవారిలో మగవారికి నచ్చేవి ఏంటి? వారిలో ఏం చూసి మగవారు ఆకర్షితమవుతారు? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటే ఈ స్టోరీ చదవండి.

మనిషి వ్యతిరేక లింగానికి ఆకర్షితం అవడం అనేది చాలా సహజం. అబ్బాయిలకు కొంతమంది అమ్మాయిలను చూడగానే నచ్చేస్తారు. మగవారికి ఇలా తొలిచూపులోనే నచ్చడం చాలాసార్లు జరుగుతుంది. కొందరికి ఒక అమ్మాయి కళ్లు నచ్చితే, మరికొందరి పళ్లు నచ్చుతాయి, ఇలా నచ్చడానికి చాలా ఉంటాయి. అయితే ఇలా ఆడవారి అందచందాలకు ఆకర్షితం అవడం అనేది వయసు ప్రభావం లేదా హార్మోన్ల ప్రభావంతో కలిగే ఆకర్షణ. కానీ ఇదికాకుండా, మగవారికి కూడా ఆడవారు నచ్చడానికి, నచ్చకపోవడానికి అనేక అంశాలు ఉంటాయి.

Attractive Things in Women- ఆడవారిలో మగవారికి నచ్చే అంశాలు

కొంతమంది ఆడవారిని చూసి మగవారు ఆకర్షితమవుతారు. ఆడవారిలో ఎలాంటి అంశాలు మగవారిని ఆకర్షిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆత్మవిశ్వాసం: ఎవరైనా స్త్రీ తనపైన, తన సామర్ధ్యాలపై నమ్మకంగా ఉన్నప్పుడు, అది పురుషులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న స్త్రీని పురుషులు ఆరాధిస్తారు. ఆమె జీవితం నుండి ఏమి కోరుకుంటున్నారో తెలుసు.

సెన్స్ ఆఫ్ హ్యూమర్: ఎప్పుడూ మగవారు మాత్రమే నవ్వించడం కాదు. గొప్ప హాస్య చతురత కలిగి ఉండే స్త్రీలు అంటే పురుషులు ఎంతో అభిమానిస్తారు. నవ్వించే ఒక ఆడవ్యక్తి తమ జీవితంలో ఉంటే ఎలాంటి బాధలు ఉన్నా హాయిగా ఎదుర్కోవచ్చనే ధైర్యం మగవారికి కలుగుతుందట.

మేధస్సు: ఏమి తెలియని ఆడవారి కంటే మంచి లోకజ్ఞానం కలిగిన స్త్రీలంటే పురుషులకు అభిమానం. బాగా ఆలోచించగల, మంచి నిర్ణయాలు తీసుకోగల శక్తి ఉన్న స్త్రీలను చూసి పురుషులు ఆకర్షితమవుతారు. తమ జీవితంలోనూ మంచి సలహాలు ఇస్తూ, తమకు సరైన మార్గనిర్దేశం చేసే ఆడవారిని మగవారు కోరుకుంటారు.

అభిరుచి: జీవితంలో ఏదో ఒక అంశంపై లేదా నైపుణ్యంపై మక్కువ ఉన్న స్త్రీల పట్ల పురుషులు ఆకర్షితులవుతారు. తమకంటూ సొంత అభిరుచిని కలిగి ఉండి, ఆ దిశగా అడుగులు వేసే స్త్రీని చూసి పురుషులు ఆకర్షితం అవుతారు.

దయాగుణం: దయాగుణం ఉన్న స్త్రీలను చూసి పురుషులు ఆకర్షితులవుతారు. ఇతరులపై నిష్కపటంగా, కరుణ, దయ కలిగి ఉండే స్త్రీ తమ జీవితంలో ఉంటే ఇంకెంత బాగుంటుందోనని కోరుకుంటారు.

స్వతంత్రత స్వభావం: స్వతంత్రంగా వ్యవహరిస్తూ, అన్ని పనులను చక్కబెడుతూ, తమను తాము చూసుకోగలిగే మహిళల పట్ల పురుషులు ఆకర్షితులవుతారు. స్త్రీ స్వావలంబనగా ఉండటం వలన, ఇంట్లో ఎవరూ లేకపోయినా, ఒంటరిగా ప్రయాణించినా, వారు జాగ్రత్తగా చూసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని మగవారికి ఒక భరోసా ఉంటుంది.

శారీరక సౌందర్యం: తమ శరీర రూపాన్ని జాగ్రత్తగా చూసుకునే మహిళల పట్ల సహజంగా పురుషులు ఆకర్షితులవుతారు. ఇది మీ చర్మం, జుట్టు, గోర్లు ఇలా శరీరానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలను కలిగి ఉండే స్త్రీలకు పురుషులు ఆకర్షితులవుతారు.

పొదుపు చేయడం: డబ్బును ఇష్టారీతిన ఖర్చు చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేసే గుణం కలిగిన స్త్రీలను చూసి పురుషులు ఆకర్షితమవుతారు.

భావోద్వేగ స్థిరత్వం: నిత్యం గొడవలు పెట్టుకునే స్త్రీలంటే పురుషులకు నచ్చరు. మానసికంగా స్థిరంగా ఉంటూ ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా మౌనంగా, ధైర్యంగా ఎదుర్కోగల స్త్రీలు, పరిణతి కలిగిన స్త్రీలను చూసి పురుషులు ఆకర్షితమవుతారు.

ఆడవారిలో మగవారికి నచ్చేవి ఇవే. ఇలాంటి గుణగాణాలు చూసే మగవారు ఆడవారికి ఆకర్షితమవుతారట. ఔనంటారా? కాదంటారా..!

సంబంధిత కథనం