Sleeping Naked | నగ్నంగా నిద్రిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?-sleeping naked health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sleeping Naked Health Benefits

Sleeping Naked | నగ్నంగా నిద్రిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Apr 05, 2022 10:27 PM IST

ఏసీలు, కూలర్లు ఎందుకు? మొత్తం విప్పుకొని పడుకుంటే అంతకుమించిన ఏసీ ఉంటుందా ఎక్కడైనా? నగ్నంగా నిద్రిస్తే సౌకర్యంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Drop those clothes off when you are off to sleep. Image courtesy: Shutterstock
Drop those clothes off when you are off to sleep. Image courtesy: Shutterstock

నగ్నంగా నిద్రపోవడం అనే ఆలోచన అనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఇతరులకు మనవల్ల ఇబ్బంది కలగనంతవరకు మన పడక గదిలో మనకు ఇష్టమొచ్చినట్లుగా పడుకోవడం పూర్తిగా వ్యక్తిగతం. ఇలా నగ్నంగా పడుకుంటే ఎంతో సౌకర్యంగా ఉండటంతో పాటు ఆరోగ్యపరంగా విశేష ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

త్వరగా నిద్రపడుతుంది

శరీర ఉష్ణోగ్రత తగ్గినపుడు మెదడు నిద్రకు సంబంధించిన సంకేతాలను పంపుతుంది. బట్టలు అసౌకర్యంగా ఉంటే నిద్రపట్టదు. అదే నగ్నంగా పడుకుంటే సౌకర్యంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంద, ఈ క్రమంలో వెంటనే నిద్రపడుతుంది.

నాణ్యమైన నిద్ర

నగ్నంగా నిద్రపోవడం ద్వారా నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. REM (Rapid Eye Movement) నిద్ర అనేది నాణ్యమైన నిద్రగా చెప్తారు, ఈ సమయంలో ఎక్కువగా కలలుకంటారు. అయితే బాగా చల్లగా, లేదా వేడిగా ఉన్నప్పుడు కంటి కదలికలు నిద్రకు సహకరించవు. ఇలాంటి సందర్భాల్లో నగ్నంగా దుప్పటి కప్పుకుని పడుకుంటే నిద్రలో నాణ్యత పెరుగుతుందని అధ్యయనాలు తెలిపాయి.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

నగ్నంగా నిద్రించడం వలన చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఒక చిన్న అధ్యయనంలో తేలింది. శరీరంపై చేసుకున్న చిన్న గాయాన్ని బట్టలు వేసుకొని పడుకున్నప్పటితో, పోలిస్తే బట్టలు లేకుండా నిద్రించినపుడు వేగంగా నయమైంది.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది

నగ్నంగా నిద్రించడం ఒక మంచి జీవనశైలి మార్పు కావొచ్చు. సుఖమయ నిద్ర కలిగినపుడు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలైనా మాయమైపోయి తర్వాత లేచాక ఉల్లాసంగా ఉంటారు.

పురుషుల్లో సంతాన సామర్థ్యం పెరుగుతుంది

మగవారిలో వృషణాలపై ఒత్తిడి, ఉష్ణోగ్రత పెరిగినపుడు అది వారి స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుంది. తద్వారా భాగస్వామితో శృంగారం చేసేటపుడు, ఆపై పిల్లల్ని కనే విషయంలో ఆందోళనకు గురవుతారు. లోదుస్తులు లేకుండా నిద్రించడం ద్వారా ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది.

స్త్రీలలో యోని ప్రాంతం ఆరోగ్యంగా ఉంటుంది

మన సమాజంలో స్త్రీలకు కట్టుబాట్లు ఎక్కువ కాబట్టి వారు నిండైన వస్త్రాలతో ఉంటారు. దట్టమైన లోదుస్తులతో పాటు పీరియడ్స్ సమయంలో కూడా ప్యాడ్స్ ధరిస్తారు కాబట్టి వారికి ఆ ప్రాంతంలో తేమగా మారి అది ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదానికి దారితీస్తుంది. అప్పుడప్పుడు స్త్రీలు లోదుస్తులు లేకుండా నిద్రపోవడం ద్వారా వారికి మేలైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెప్తున్నారు.

ఇవే కాకుండా కేలరీలు తగ్గించడంలో, టైప్ 2 మధుమేహం నియంత్రణలో, వ్యక్తిత్వం పెరగడానికి ఇలా మరెన్నో ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్