Nutrients for Male Fertility। పురుషుల్లో ఆ సామర్థ్యం పెరగాలంటే, ఈ పోషకాలు అవసరం!-key nutrients for male fertility vitamins food and supplements to boost sperm count ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Key Nutrients For Male Fertility, Vitamins Food And Supplements To Boost Sperm Count

Nutrients for Male Fertility। పురుషుల్లో ఆ సామర్థ్యం పెరగాలంటే, ఈ పోషకాలు అవసరం!

HT Telugu Desk HT Telugu
Mar 29, 2023 03:33 PM IST

Nutrients for Male Fertility: స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం , స్పెర్మ్ కదలికలో సమస్యలు మొదలైనవి పురుషులలో వంధ్యత్వానికి కారణంగా ఉంటాయి. సరైన పోషకాలు అందించడం వలన పరిస్థితిని నయం చేయవచ్చు

Nutrients for Male Fertility
Nutrients for Male Fertility (Unsplash)

ఇటీవలి కాలంలో సంతాన లేమి సమస్యలు పెరుగుతున్నాయి. పిల్లలు కలగకపోవడానికి భార్యాభర్తల ఇద్దరి పాత్ర ఉంటుంది, ఇందులో ఏ ఒక్కరి లోపాన్నో ఎత్తి చూపడానికి లేదు. నేటి జీవనశైలి కారణంగా స్త్రీ, పురిషులిద్దరిలో సంతానోత్పత్తి సమస్యలు సర్వసాధారణంగా మారుతున్నాయి. పురుషుల విషయానికి వస్తే.. రోజువారీ ఒత్తిడి , జీవనశైలి అలవాట్లు, మద్యంపానం, ధూమపానం, మాదకద్రవ్యాల వ్యసనం, ఊబకాయం, వృషణానికి గాయం, ఇన్ఫెక్షన్ వంటివి పురుషులలో వంధ్యత్వ సమస్యలు కలగడానికి కారణం అవుతున్నాయి.

స్త్రీకి పీసీఓడీ, PCOS వంటి ఎలాంటి సమస్యలు లేని సందర్భంలో, ఎలాంటి గర్భనిరోధకాలు ఉపయోగించనప్పటికీ, ఒక సంవత్సరం కాలంలో లైంగిక సంపర్కం తర్వాత కూడా ఆమె గర్భం దాల్చలేనప్పుడు అది పురుషుడి వంధ్యత్వాన్ని నిర్ధారిస్తుంది. వృషణాల పనితీరు మందగించడం, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి అవయవాలలో సమస్యలు వంటివి పురుషుల వంధ్యత్వానికి కారణం కావచ్చు.

పురుషుల వంధ్యత్వానికి సంబంధించిన సగం కేసులలో కారణం కనుగొనడం సాధ్యం కాదు. అయితే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం , స్పెర్మ్ కదలికలో సమస్యలు మొదలైనవి కూడా పురుషులలో వంధ్యత్వానికి కారణంగా ఉంటాయి. సరైన పోషకాలు అందించడం వలన కొంత వరకు పరిస్థితిని నయం చేయవచ్చు.

Key Nutrients for Male Fertility - పురుషుల సామర్థ్యాన్నిపెంచే పోషకాలు

పురుషుల సంతాన సామర్థ్యంను పెంచడంలో కొన్ని పోషకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మగవారు కొన్ని విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం వలన వారిలో సంతానోత్పత్తికి అవకాశం ఉంది. ఆ పోషకాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

విటమిన్ సి

ఇది స్పెర్మ్ నాణ్యత, పరిమాణాన్ని పెంచడంలో సహాయపడే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. విటమిన్ సి స్పెర్మ్ చలనశీలతను పెంచడంతో పాటు, సరైన ఆకృతిలో లేని స్పెర్మ్ కణాల సంఖ్యను తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. సిట్రస్ పండ్లు, క్యాప్సికమ్, స్ట్రాబెర్రీలు, బొప్పాయిలు, కివీస్, గూస్‌బెర్రీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

విటమిన్ B12

ఇది స్పెర్మ్ ఉత్పత్తి ప్రక్రియకు చాలా ముఖ్యమైన పోషకం. విటమిన్ B12 సాల్మన్ చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులలో ఉంటుంది వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

జింక్

మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి జింక్ అవసరం. ఈ పోషకం సామర్థ్యాన్ని పెంచుతుంది, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. జింక్ పరిమాణం తక్కువగా ఉంటే, స్పెర్మ్ పరిమాణంలో తగ్గుదల, నాణ్యత లేకపోవడం, సంతానోత్పత్తి రేటు లేకపోవడం వంటివి ఉండవచ్చు. పుట్టగొడుగులు, పాలకూర, గుమ్మడి గింజలు, చిక్‌పీస్, మసూరి పప్పు, పెరుగు మొదలైన ఆహారాల్లో జింక్ ఉంటుంది.

విటమిన్ డి

విటమిన్ డి శాతం ఎక్కువగా ఉన్న వ్యక్తి మెరుగైన సామర్థ్యం, స్పెర్మ్ రేటును కలిగి ఉంటాడు . ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇందుకోసం సాల్మన్ చేపలు, కాడ్ లివర్ ఆయిల్, పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు.

ఫోలేట్

ఫోలేట్ సంతానోత్పత్తికి చాలా ముఖ్యమైన పోషకం. ఫోలేట్‌లను సప్లిమెంట్ చేయడం వల్ల శరీరంలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, బీన్స్, వేరుశెనగ, బటర్ నట్స్, మొక్కజొన్న, సోయాబీన్స్, డ్రై ఫ్రూట్స్ లో ఈ పోషకం ఉంటుంది.

విటమిన్ ఇ

ఇది యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది. ఇది పురుషులలో స్పెర్మ్ దెబ్బతినకుండా సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, పాలకూర, బ్రకోలీలో విటమిన్ ఇ ఉంటుంది.

సెలీనియం

ఇది ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది. సెలీనియం లోపం స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి సీఫుడ్, ఉడికించిన బీన్స్, పనీర్, అవిసె గింజలు తీసుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం