Early Puberty । షాకింగ్.. పిల్లలు త్వరగా వయసు పెరగడానికి కారణాలివే, తస్మాత్ జాగ్రత్త!-6 shocking reasons of precocious in kids know symptoms of early puberty and treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  6 Shocking Reasons Of Precocious In Kids, Know Symptoms Of Early Puberty And Treatment

Early Puberty । షాకింగ్.. పిల్లలు త్వరగా వయసు పెరగడానికి కారణాలివే, తస్మాత్ జాగ్రత్త!

Early Puberty/ Precocious Puberty
Early Puberty/ Precocious Puberty (shutterstock)

Early Puberty: మీ పిల్లలు ఊహించిన దాని కంటే చాలా ముందుగానే యుక్తవయస్సు సంకేతాలను చూపుతున్నారా? వారి శరీరం మార్పులకు లోనవుతుందా? అయితే అందుకు కారణాలు తెలుసుకోండి, దీనిని అశ్రద్ధ చేయకూడదు.

కొంతమంది పిల్లలు చాలా త్వరగా పెరుగుతారు. వారిలో చాలా తొందరగా యుక్తవయసు సంకేతాలు కనిపిస్తాయి. మగపిల్లలకు త్వరగా గడ్డాలు, మీసాలు మొలవడం ప్రారంభమైతే, ఆడపిల్లలు చిన్న వయసులోనే రజస్వల కావడం వంటివి జరగవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

మీ బిడ్డ ఊహించిన దాని కంటే చాలా ముందుగానే యుక్తవయస్సు సంకేతాలను చూపుతుంటే, తల్లిదండ్రులుగా మీ పిల్లలపై మీరు మరింత శ్రద్ధ చూపడం అవసరం. ఎందుకంటే ఇది భవిష్యత్తులో వారి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. మారుతున్న శరీరాలు, శరీర భాగాల గురించి గురించి పిల్లలు కూడా ఆందోళనకు గురికావచ్చు. పిల్లలలో సామాజిక, భావోద్వేగ సమస్యలకు దారి తీస్తుంది. వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి వారిని ఒక కంట కనిపెడుతుండటం, వారు ఏ విధంగా అనుభూతి చెందుతున్నారో తెలుసుకోవడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత.

పిల్లల్లో త్వరగా యుక్తవయసు సంకేతాలు రావడాన్ని వైద్య పరిభాషలో ప్రీకోసియస్ (Precocious Puberty) గా చెబుతారు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు పిల్లల శరీరం వేగంగా వివిధ మార్పులకు లోనవుతుంది. సాధారణంగా అమ్మాయిలు యుక్త వయసులోకి వచ్చినపుడు రొమ్ము పెరుగుదల, జఘన లేదా అండర్ ఆర్మ్ వెంట్రుకలు, ఋతుస్రావం మరియు అండోత్సర్గము వంటి లక్షణాలు ఉంటాయి. ఇది బాలికల్లో సగటు వయసు 8 -14 ఏళ్ల నుంచి ప్రారంభం అవుతుంది. మరోవైపు అబ్బాయిలలో సగటు వయసు 9 - 16 ఏళ్ల నుంచి పురుషాంగం విస్తరించడం, జఘన లేదా అండర్ ఆర్మ్ హెయిర్, మోటిమలు, స్వరంలో మార్పు, ముఖంపై వెంట్రుకలు మొదలైన లక్షణాలు ఉంటాయి. అయితే పిల్లలు 8 ఏళ్ల లోపు వయసు నుంచి ఇలాంటి లక్షణాలను కనబరుస్తున్నారంటే దానిని ప్రీకోసియస్ యుక్తవయసుగా నిర్ధారించవచ్చు. ఈ స్థితిలో పిల్లలు వయసు రీత్యా పెద్దగా కనిపించినప్పటికీ వారికి ఉండాల్సిన మానసిక పరిణితి ఉండదు.

Reasons For Early Puberty- ముందస్తు యుక్తవయసు రావడానికి కారణాలు

ముందస్తు యుక్తవయసుకు చికిత్స తీసుకోవడం వలన ఈ పరిస్థితిని నయం చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ విషయంలో అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. పిల్లల్లో ముందస్తు యుక్తవయసు సంకేతాలు రావడానికి దారితీసే కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Protein Foods Intake - ప్రోటీన్ ఆహారం అధికమవడం

3 నుండి 7 సంవత్సరాల వయస్సులో పిల్లలకు ఎక్కువ మొత్తం ప్రోటీన్ పదార్థాలు తినిపించడం, మాంసాహారం అందించడం వలన బాలికలు త్వరగా ఋతుస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. అధిక ప్రోటీన్ తీసుకోవడం హార్మోన్ స్థాయిలను పెంచుతుంది, శరీర పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఇది అబ్బాయిలలో యుక్తవయస్సు ప్రారంభాన్ని వేగవంతం చేస్తుంది. అనేక ప్రోటీన్ షేక్‌లు దుష్ప్రభావాలను కలిగించే హార్మోన్‌లను కలిగి ఉంటాయి. మగవారికి రొమ్ముల అభివృద్ధి , ఆడవారికి అవాంఛిత రోమాల పెరుగుదలను ప్రోత్సహించవచ్చు. కాబట్టి ఆహారంలో ప్రోటీన్ల మోతాదుకు మించి తీసుకోకూడదు. పిల్లలకు మటన్ లాంటి మాంసాహారం వారానికి రెండు సార్లకు మించి తినిపించకూడదు. అయితే మొక్కల ఆధారిత ప్రోటీన్ పదార్థాలను తినిపించవచ్చు.

Child Obesity - ఊబకాయం

శరీరంలోని అధిక కొవ్వు ఈస్ట్రోజెన్, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. దీనివలన త్వరగా యుక్తవయస్సు ప్రభావం కనిపించవచ్చు. పిల్లల్లో ఊబకాయం నివారించడానికి వారిని క్రీడలు ఆడించడం, చిన్నచిన్న పనులు అప్పజెప్పడం, వారానికి కనీసం మూడుసార్లు 45 నిమిషాల పాటు శారీరక శ్రమ కలిగించే కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించడం ద్వారా అధిక బరువు, ఊబకాయం రాకుండా అడ్డుకోవచ్చు. చిన్నతనంలో ఊబకాయానికి ప్రధాన కారణాలలో జంక్ ఫుడ్. బేకరీలు, ఫాస్ట్ ఫుడ్, ఇతర అనారోగ్యకరమైన ఆహారాలకు పిల్లలను దూరంగా ఉంచాలి.

BPA ప్లాస్టిక్

పిల్లలకు టిఫిన్ బాక్సులు పంపించేటపుడు అవి BPA ప్లాస్టిక్ రహితమైనవిగా నిర్ధారించుకోండి. ఆహారం నిల్వ చేసే కంటైనర్లు BPA సమ్మేళనాలను కలిగి ఉంటే అవి అమ్మాయిలలో త్వరగా ఋతుస్రావం, ఋతు చక్రంలో అసమానతలు, బలహీనమైన ప్రత్యుత్పత్తి, PCOS, PCOD వంటి అసాధారణతలను కలిగించవచ్చు. కాబట్టి ఆహార పానీయాల కోసం స్టీల్ లేదా గాజు లేదా మట్టి పాత్రలను ఎంచుకోండి. BPA ప్లాస్టిక్ లేని టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు ఉండేలా జాగ్రత్త వహించండి.

Cow Milk - ఆవు పాలు

రీకాంబినెంట్ బోవిన్ సోమాటోట్రోపిన్ (RSBT) అనేది ప్రొటీన్ పదార్థానికి సింథటిక్ వెర్షన్. ఇది ఆవులు పాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. పిల్లలు ఆవు పాలు అతిగా తాగడం వలన,ఇది బాలికలలో రొమ్ము పెరుగుదల, ఋతుచక్రాన్ని ప్రారంభిస్తుంది. అబ్బాయిలకు శరీరంపై వెంట్రుకల పెరుగుదలను పెంచుతుంది. పిల్లలకు ఆవు పాలను అధికంగా తాగించడం మానుకోండి.

Adult Content - అడల్ట్ కంటెంట్‌

పిల్లల్లో యుక్తవయస్సు త్వరగా రావడానికి సమాజం, సోషల్ మీడియా, ఇతర ప్రసార సాధనాలు కూడా బాధ్యత వహిస్తాయి. పిల్లలు ఎక్కువగా అడల్ట్ కంటెంట్‌ చూడటం ద్వారా వారి మెదడుపై, ముఖ్యంగా పిట్యూటరీ గ్రంధిపై ప్రభావం చూపుతుంది. వారు లైంగిక ప్రేరేపనకు గురైనపుడు ఈ గ్రంథి హార్మోన్లను స్రవిస్తుంది. ఫలితంగా పిల్లల్లో సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి మరింత ప్రేరేపిస్తుంది, టెస్టోస్టెరాన్ , ఈస్ట్రోజెన్ ఉత్పత్తి జరిగితే పిల్లలో యుక్తవయసు త్వరగా వచ్చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం