Masturbation । మగవారు అతిగా హస్తప్రయోగం చేసుకుంటే ఈ సమస్యలు తప్పవు!-masturbation pros and cons myths vs facts know side effects of excess masturbation in males ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masturbation । మగవారు అతిగా హస్తప్రయోగం చేసుకుంటే ఈ సమస్యలు తప్పవు!

Masturbation । మగవారు అతిగా హస్తప్రయోగం చేసుకుంటే ఈ సమస్యలు తప్పవు!

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 09:30 PM IST

Masturbation: హస్తప్రయోగం మంచిదేనా? అతిగా హస్తప్రయోగం చేసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, హస్తప్రయోగంపై వాస్తవాలు, అపోహలు ఇక్కడ తెలుసుకోండి.

Masturbation
Masturbation (Unsplash)

హస్తప్రయోగం అనేది పురుషులు, స్త్రీలు తమ దైనందిన జీవితంలో చేసుకొనే ఒక సాధారణ కార్యకలాపం. హస్తప్రయోగంలో తమకు తాముగా వారి జననాంగాలను ప్రేరేపిపించుకుంటారు. ఇది శరీరంలో లైంగిక ఉద్రిక్తతను పెంపొందించడానికి, భావప్రాప్తిని (Orgasm) పొందడానికి, శృంగార సంతృప్తిని పొందడానికి ఒక మార్గం. లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భాగస్వామి తోడు లేనపుడు శృంగార కోరికను సంతృప్తి పరచటానికి హస్తప్రయోగం ఒక సురక్షిత మార్గం. ఈ చర్య మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మీరు మీ భాగస్వామితో శృంగారం (Sex) చేసే ముందు హస్తప్రయోగం ద్వారా లైంగిక ఉద్దీపన పొందడానికి కూడా తోడ్పడుతుంది.

అయితే, హస్తప్రయోగం (Musturbation) చేసుకోవడం వలన ఎలాంటి హానికరమైన దుష్ప్రభావాలు ఉండవు. కానీ అధిక హస్త ప్రయోగం లేదా రోజువారీగా హస్తప్రయోగం చేసుకుంటే అది అనేక విధాల దుష్ప్రభావాలను కలిగిస్తుంది, మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక సర్వే ప్రకారం, ప్రతిరోజూ హస్తప్రయోగం చేసుకునే వాళ్లలో ఆడవారు సగటున 27 శాతం ఉండగా, మగవారు 65 శాతం ఉన్నారు.

హస్తప్రయోగం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, అతిగా హస్తప్రయోగం చేసుకుంటే కలిగే దుష్ప్రభావాలు (Masturbation Pros and Cons) ఏమిటి? ఈ విషయంపై వాస్తవాలు, అపోహలను (Masturbation myths and facts) ఇప్పుడు తెలుసుకుందాం.

Benefits of Masturbation- హస్తప్రయోగం వలన కలిగే ప్రయోజనాలు

  • ఒత్తిడి. ఆందోళన తగ్గుతుంది
  • మంచి నిద్ర కలుగుతుంది
  • మానసిక స్థితి మెరుగుపడుతుంది
  • డిప్రెషన్ భావాలు తగ్గుతాయి
  • శరీరానికి విశ్రాంతి లభిస్తుంది
  • ఆనందం, సంతృప్తికరమైన అనుభూతి లభిస్తుంది
  • నొప్పుల నుండి ఉపశమనం
  • లైంగిక ఒత్తిడిని విడుదల చేస్తుంది
  • ఆత్మగౌరవం పెరుగుతుంది
  • మంచి సెక్స్ లైఫ్ ఉంటుంది
  • మీ కోరికలు, లైంగిక అవసరాలపై అవగాహన ఏర్పడుతుంది
  • గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు కొంతమంది గర్భిణీలకు (Pregnant women) లైంగిక కోరికను పెంచుతాయి. గర్భధారణ సమయంలో లైంగిక ఒత్తిడిని వదిలించుకోవడానికి హస్త ప్రయోగం సురక్షితమైన మార్గం.

Myths on Masturbation- ఈ కింది వాటికి హస్తప్రయోగం కారణం కాదు

హస్తప్రయోగం చేసుకోవడం వలన కొన్ని సమస్యలు వస్తాయని భావిస్తారు, నిజానికి అవన్నీ అపోహలే. ఆ అపోహలు ఏమిటో ఈ కింద చూడండి.

  • నిర్జలీకరణము (Dehydration)
  • హార్మోన్ల అసమతుల్యత
  • పురుషాంగం పరిమాణం లేదా ఆకృతిలో మార్పులు
  • స్పెర్మ్ కౌంట్ తగ్గడం (sperm count)
  • దృష్టి నష్టం
  • మొటిమలు రావడం
  • వెంట్రుకల అరచేతులు
  • అంగస్తంభన లోపం (erectile disfunction)
  • లైంగిక కోరికలు తగ్గిపోవడం

Disadvantages of Excess Masturbation- అతిగా హస్తప్రయోగం వలన కలిగే దుష్ప్రభావాలు

  • పురుషులు తరచుగా హస్తప్రయోగం చేసినప్పుడు, పురుషాంగంలో మంట, నొప్పులు, గాయాలు కావచ్చు. కొన్నిసార్లు శరీర భాగాలు ఉబ్బి ఎడెమా సమస్యకు దారితీస్తుంది.
  • అతిగా హస్తప్రయోగంతో టెస్టోస్టెరాన్‌ సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది తక్కువ స్పెర్మ్ కౌంట్‌కు ఒక కారణం కావచ్చు. హస్తప్రయోగం దుష్ప్రభావాలలో అజోస్పెర్మియా ఒకటి.
  • పురుషులు అతిగా హాస్తప్రయోగం చేసుకుంటే Dhat Syndromeకు దారితీయవచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్రం ద్వారా వీర్యం బయటకు వెళ్లిపోతుంది. అంగస్తంభనలో ఇబ్బందులు, తిరోగమన స్ఖలనం మొదలైన స్ఖలన సమస్యలకు కారణం కావచ్చు.
  • హస్తప్రయోగంకు అలవాటుపడిన పురుషులు నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. వీర్య స్ఖలనం జరిగేంత వరకు నిద్రపోరు.
  • హస్తప్రయోగంకు అలవాటుపడిన వారు అతిగా పోర్న్ చూడటం, ఎప్పుడూ లైంగిక ఆలోచనలు కలిగి ఉండటం చేస్తారు. ఫలితంగా వారిలో ఏకాగ్రత లోపిస్తుంది, వారి ఉత్పాదకత దెబ్బతింటుంది.
  • హస్తప్రయోగంకు అలవాటుపడిన వారు శృంగారం ద్వారా లైంగిక సంతృప్తిని పొందలేరు.

మీరు అతిగా హస్తప్రయోగం చేస్తున్నట్లు మీకు అనిపిస్తే, మీరు హస్తప్రయోగానికి అలవాటుపడితే. హస్తప్రయోగం కోసం పనులను వాయిదా వేయాల్సి వస్తే, దానిని తగ్గించుకోవడం మంచిది.

WhatsApp channel