Diwali Tips for Pregnant Women । దీపావళి వేళ గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి!-pregnant women should follow these safety tips on diwali 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Tips For Pregnant Women । దీపావళి వేళ గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి!

Diwali Tips for Pregnant Women । దీపావళి వేళ గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి!

HT Telugu Desk HT Telugu
Oct 24, 2022 06:40 PM IST

Diwali Safety Tips for Pregnant Women: గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి దీపావళి పండగ సమయంలో వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఇక్కడ చూడండి.

Diwali Safety Tips for Pregnant Women
Diwali Safety Tips for Pregnant Women

దీపావళి పండుగను అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా టపాకాయలు కాల్చడం ఈ పండగలో ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. సాయంత్రం వేళ ఇంటి ముందు దీపాల వరుసలు, రంగురంగుల లైట్ల అలంకరణలు అద్భుతంగా అనిపిస్తాయి. అయితే ఈ పండగలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. టపాకాయలు కాల్చడం మూలానా గాలి కాలుష్యం అయిపోతుంది. భారీ టపాసుల మోతలతో ధ్వని కాలుష్యం కూడా ఉంది. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి చాలా జాగ్రత్తగా, సురక్షితంగా ఈ పండగను జరుపుకునే అవసరం ఎంతైనా ఉంది.

పసిపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఈ దీపావళి వేళ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Diwali Safety Tips for Pregnant Women

గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఇదే సమయంలో కాలుష్యం, టపాసుల మోతలతో గర్భిణీ స్త్రీలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, వాటిని పాటించండి.

మిమ్మల్ని మీరు రక్షించుకోండి

గర్భధారణ సమయంలో ఏదైనా గాయం అయితే చికిత్స చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ దీపావళి వేళ కాలిన గాయాలు అవకుండా పటాకుల వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే రోడ్లపై, రద్దీ ప్రదేశాలలో ఉండవద్దు. ఈ సమయంలో బయటకు వెళ్లకపోవటమే మంచిది.

దద్దరిల్లే పటాకుల మోతకు దూరం

గర్భిణీ స్త్రీలు సున్నితంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో, పెద్ద శబ్దం వీరికి సులభంగా చెవిపోటును కలిగిస్తుంది. అలాగే పెద్ద శబ్దాలకు ఒక్కసారిగా మీరు అనుభవించే ఆకస్మిక షాక్ వల్ల లోపలి బిడ్డ కూడా ప్రభావితమవుతుంది. కాబట్టి ఈ పెద్ద శబ్దాలను నివారించడానికి ఇంటి లోపల ఉండండి లేదా ఇయర్‌ప్లగ్‌లను ఉపయోగించండి.

కాలుష్యాన్ని నివారించండి

గర్భధారణ సమయంలో ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. దీపావళి సమయంలో మీ చుట్టూ ఉన్న గాలి మరింత కలుషితమవుతుంది, కాబట్టి ఇది శిశువుకు సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు బాగా వెంటిలేషన్ ప్రదేశంలో ఉండాలి. కాలుష్యం నుండి దూరంగా ఉండాలి. పండగ తర్వాత కూడా కనీసం 2 నుండి 3 రోజులు బయటకు రాకుండా ఉండండి. బయటకు వెళ్లాల్సి వస్తే నాణ్యమైన మాస్క్‌ని వాడండి. పొగ వల్ల ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, తలనొప్పి లేదా వికారం వంటివి ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

బరువైన బట్టలు ధరించవద్దు

పూజా సమయంలో, మహిళలు బరువైన సాంప్రదాయ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. ఇది ఎముకలపై ఒత్తిడి తెచ్చి నొప్పిని కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఇప్పటికే చాలా నొప్పులతో బాధపడుతుంటారు, కాబట్టి భారీ సాంప్రదాయ దుస్తులకు బదులుగా సౌకర్యంగా ఉండే మోడ్రన్ కాటన్ దుస్తులను ధరించండి.

ఆరోగ్యకరమైన ఆహారం తినండి

దీపావళి సమయంలో అడపాదడపా స్నాక్స్ , స్వీట్లు సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో దుకాణాల్లో తయారు చేసే మిఠాయిల్లో కల్తీ ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీరు గర్భవతి అయితే మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉప్పు, పంచదార తక్కువగా తినండి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి అలాగే టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.

Whats_app_banner

సంబంధిత కథనం