Pooping After Eating : తిన్న వెంటనే టాయిలెట్‌కు పరుగెడుతున్నారా?
Toilet After Eating : కొంతమందికి తిన్న వెంటనే టాయిలెట్ కు పరుగెడుతారు. మలవిసర్జన చేస్తేనే వారు.. కూల్ అవుతారు. అయితే ఇది అలవాటు కావొచ్చు. లేదంటే.. ఆరోగ్య సమస్య కావొచ్చు.
కొంతమంది ఏం తిన్నా.. వెంటనే టాయిలెట్(Toilet)కి వెళ్లే అలవాటు ఉంటుంది. అది వారి అలవాటు లేదా ఆరోగ్య సమస్య కావచ్చు. ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా సీరియస్‌గా తీసుకోవాలి. తిన్న తర్వాత చాలాసార్లు మలవిసర్జన చేస్తారు. అయితే ఓ వైపు తిని.. రెండు నిమిషాలు కాకముందే.. కొంతమంది పరుగెడతారు. మీ కడుపు ఆరోగ్యంగా ఉంటే, మీ శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ కడుపు(Stomach)లో ఏదైనా తప్పు జరిగితే, మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదయాన్నే బాత్‌రూమ్‌కి వెళ్లడం అనేది దినచర్య. కానీ తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్తున్నారంటే ఆలోచించాల్సిందే.
ఆహారం(Food) తిన్న తర్వాత మలవిసర్జన చేయడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన సంకేతం. మీరు రోజుకు మూడుసార్లు తింటారనుకోండి. ఆ మూడుసార్లు తిన్న వెంటనే టాయిలెట్ వెళితే.. శరీరం మరింత దిగజారుతుంది. ఇలా మీకు దానిని డేంజర్ బెల్‌గా పరిగణించండి. వైద్యుల ప్రకారం, తిన్నవెంటనే అలా వెళ్లడం టాయిలెట్‌కు వెళ్లడం లేదా తిన్న వెంటనే పేగు కదలికలు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వల్ల సంభవిస్తాయి.
సాధారణంగా మీ జీవనశైలి(Lifestyle) సరిగా లేకుంటే గ్యాస్ట్రోకోలిక్ సమస్య వస్తుంది. మీరు ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే, మీరు జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగం పొట్ట. ఆహారం తిన్నప్పుడు పొట్ట మొత్తం విద్యుత్ తరంగాల వంటి సంచలనం ఉంటుంది. ఇది రిఫ్లెక్స్ అయినప్పుడు, మొత్తం ఆహార పైపు, కడుపులో కదలిక అవుతుంది. దీని తర్వాత వ్యక్తి బాత్రూమ్‌కు వెళ్లాలని భావిస్తాడు. దీని తరువాత, ఆహారం జీర్ణం అయిన తర్వాత మిగిలిపోయిన చెడు టాక్సిన్స్ పెద్దపేగు ద్వారా ప్రయాణించిన తర్వాత బయటకు రావాలి.
గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కారణాలు చాలానే ఉన్నాయి. వైద్యుల ప్రకారం, ఎక్కువ ఆత్రుతగా, ఒత్తిడికి గురయ్యే వ్యక్తులలో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారిలో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.
పేగులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆహారం తిన్న తర్వాత బాత్‌రూమ్‌కు వెళ్లడానికి అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. ఇది ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి, సిలియా, గ్యాస్ట్రిక్, ఫుడ్ అలర్జీ, పేగు ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. తిన్న వెంటనే బాత్ రూంకి వెళ్లే వారికి ఆహారం జీర్ణం కాకుండా బయటకు వచ్చిందనే చెప్పాలి. తిన్నవెంటనే టాయిలెట్ వెళ్లే అలవాటును తగ్గించుకోవాలి.