Liver Health Tips : 24 గంటల్లో లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఎలా?
Liver Health Tips : మనిషికి లివర్ ఆరోగ్యం చాలా ముఖ్యం. మన కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మలినాలను బయటకు పంపాలి. మీ కాలేయాన్ని 24 గంటల్లోనే శుభ్రపరచవచ్చు. ఎలా చేయాలో చూద్దాం.
గుండె, కిడ్నీల ఆరోగ్యం గురించి ఎక్కువమంది మాట్లాడుకుంటారు. కాలేయం(Liver) గురించి చర్చించరు. కానీ కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాలేయ ఆరోగ్యం(Liver Health) ఒక్కసారి దెబ్బతింటే రికవరీ అవ్వడం చాలా కష్టం. అయితే కొన్ని పద్ధతులను పాటించి.. మీ లివర్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి.
క్రాన్ బెర్రీ జ్యూస్ కాలేయాన్ని శుభ్రపరచడానికి చాలా మంచిది. కావలసినవి.. నీరు, జాజికాయ, అల్లం, 3 నారింజ, 3 నిమ్మకాయలు. క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో 3 కప్పుల నీరు వేసి, ఇప్పుడు 1/2 చెంచా అల్లం పొడి, 1/2 చెంచా జాజికాయ వేసి ఉడికించాలి. 20 నిమిషాలు తక్కువ మంటలో ఇలా చేయాలి. చల్లబరచడానికి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. ఇప్పుడు క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో 3 నారింజ పళ్లు, 3 స్క్వీజ్‌ల నిమ్మరసం(Lemon), అవసరమైతే కాస్త నేచురల్ స్వీటెనర్ జోడించండి. రోజంతా ఈ పానీయం తాగండి
మీరు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కాలేయ ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా పండ్లు(Fruits), నట్స్, క్యారెట్ వంటి ఆహారాన్ని తినండి. కాలేయాన్ని శుభ్రపరిచే టీని తయారు చేసి తాగండి. నీళ్లు 2 కప్పులు, నిమ్మకాయ 1, టేబుల్ స్పూన్ తురిమిన అల్లం నీరు మరిగించి, అందులో అల్లం వేసి కాసేపు మరిగించి, వడకట్టి నిమ్మరసం తాగాలి. కాలేయ ఆరోగ్యానికి ఈ టీ చాలా మంచిది.
పొటాషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలతో శుభ్రం చేసుకోండి. చిలగడదుంప, టొమాటో సాస్, పచ్చి బఠానీలు, పాలక్ వంటి ఆహారాలను తీసుకోండి. కాలేయ ఆరోగ్యాన్ని(Liver Health) మెరుగుపరచడంలో కాఫీ(Coffee) కూడా సహాయపడుతుంది. రోజూ కాఫీ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకూడదు.
పసుపు, జీలకర్ర ఉపయోగించి లివర్ సప్లిమెంట్స్ ద్వారా లివర్ డిటాక్స్(Liver Detox) కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంజైమ్ ప్యాకెట్‌ని తీసి రెండు లీటర్ల నీటిలో కలిపి మీ ఆహారంలో తీసుకోవాలి. ఒక సీసాలో 60 మి.లీ ఆలివ్ ఆయిల్, 30 మి.లీ ఎంజైమ్స్ లిక్విడ్ వేసి, 2 లీటర్ల నీరు వేసి ఈ నీటిని తాగాలి. రాత్రి ఈ నీటిని తీసుకున్న అరగంట తర్వాత నిద్రపోండి. ఇలా చేయడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
డ్రగ్, ఆల్కహాల్, టాటూ, వైరల్ ఇన్ఫెక్షన్, రసాయన లేదా ఫ్యాక్టరీ వాతావరణంలో పనిచేయడంలాంటివి కాలేయ వ్యాధికి దారితీసే కారకాలు. వాంతులు, తలతిరగడం, ఆకస్మిక అనారోగ్యం, పొత్తి కడుపు ఉబ్బరం, దిగువ పొత్తికడుపు నొప్పి కాలేయం చెడిపోవడం లక్షణాలు. కాలేయాన్ని శుభ్రపరచండి, తద్వారా అనేక రకాల వ్యాధులు దగ్గరకు రావు.