Fatty Liver Diseases Signs : కాలేయ సమస్యల లక్షణాలను ఇలా గుర్తించండి..-dont take neglect these symptoms of fatty liver diseases ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fatty Liver Diseases Signs : కాలేయ సమస్యల లక్షణాలను ఇలా గుర్తించండి..

Fatty Liver Diseases Signs : కాలేయ సమస్యల లక్షణాలను ఇలా గుర్తించండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 01, 2022 02:50 PM IST

Fatty Liver Diseases Signs : కాలేయ వ్యాధి అనగానే ఆల్కహాల్ వల్ల అనేసుకుంటారు. కానీ మన జీవనశైలిలోని మార్పుల వల్ల, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కూడా కాలేయ సమస్యలు వస్తాయి అంటున్నారు.

ఫ్యాటీ లివర్ డిసీజ్
ఫ్యాటీ లివర్ డిసీజ్

Fatty Liver Diseases Signs : కాలేయ సమస్యలు ఎంత భయంకరమైనవో అందరికి తెలిసిందే. సాధారణంగా మన కాలేయం 5 నుంచి 6 శాతం కొవ్వును పీల్చుకోగలదని వైద్యులు చెబుతున్నారు. అయితే కొవ్వు ఎక్కువైతే ప్రమాదం తప్పుదు. ఇది ప్రాణాంతకం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాలేయం సమస్య వల్ల ఊబకాయం కూడా వస్తుంది. అయితే ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయ సమస్యలు వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ఆలోచన పూర్తిగా సరైనది కాదు. దీని లక్షణాలు కూడా అంత సులువుగా కనిపించవు. అయితే కొన్ని సంకేతాలతో ఈ సమస్యను ముందే గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అలసట

మీరు చిన్న పని చేసినా కూడా వెంటనే అలసిపోతున్నారంటే.. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. ఒక్కోసారి ఇతరత్ర కారణాల వల్ల కూడా నీరసంగా ఉండొచ్చు. కానీ తరచూ ఈ సమస్యను అనుభవిస్తున్నారంటే.. మీరు కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అర్థం. ఇది ఫ్యాటీ లివర్ సమస్యకు ఓ సంకేతమని వైద్యులు చెప్తున్నారు.

మూత్రంలో మార్పులు

మూత్రం వాసనపై శ్రద్ధ వహించాలి. మీరు కొవ్వు కాలేయాన్ని కలిగి ఉంటే.. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించవచ్చు. దుర్వాసనతో కూడిన, నిరంతరం పసుపు మూత్రాన్ని చూసినట్లయితే అప్రమత్తంగా ఉండండి. ఇది నిరంతరం కొనసాగితే మీరు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.

స్వీట్లపై మక్కువ పెరిగితే..

బరువు పెరగడంతో పాటు మీ ఆకలి కూడా పెరిగితే అది కాలేయ సమస్యల్లోని భాగమే. అంతేకాకుండా స్వీట్లపై మీ వ్యసనం పెరుగుతుందో లేదో గమనించండి. స్వీట్ క్రావింగ్స్ పెరుగుతూ ఉన్నాయంటే.. దాని అర్థం కూడా ఫ్యాటీ లివర్ సమస్యల్లోని భాగమే అంటున్నారు.

అయితే మీరు ఇలాంటి లక్షణాలు ఏమి ఎదుర్కొన్నా.. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించండి. కాలేయ సమస్యలు త్వరగా బయటపడవు. దీనివల్ల దానిని గుర్తించే సరికి.. సమస్య తీవ్రత పెరిగిపోతుంది. కాబట్టిమీరు ఈ విషయంపై తగిన జాగ్రత్త తీసుకోండి. వైద్యుడి సలహాలను పాటించండి.

సంబంధిత కథనం

టాపిక్