Sweet Potato Cutlet Recipe : చలికాలంలో చిలగడదుంప కట్లెట్.. ఆరోగ్యానికి బెస్ట్..
Sweet Potato Cutlet Recipe : చలికాలంలో మనకు దొరికే వాటిలో చిలగడదుంపలు ఒకటి. ఇవి స్వీట్నెస్తో పాటు.. చాలా పోషకాలతో నిండి ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిని ఉడికించి, కాల్చుకుని కూడా తినొచ్చు. అయితే కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారు మాత్రం చిలగడదుంప కట్లెట్ చేసుకోవచ్చు.
Sweet Potato Cutlet Recipe : చిలగడ దుంపలతో కట్లెట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఒక్కసారి తింటే.. ఇన్ని రోజులు దీనిని ఎందుకు మిస్ అయ్యాము అనిపిస్తుంది. అంత రుచికరంగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు. పైగా చిలగడదుంప ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. మరి ఈ కట్లెట్ ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* చిలగడదుంపలు - 4
* అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీస్పూన్
* శనగపిండి - 3 స్పూన్లు
* చాట్ మసాలా - 1 టీస్పూన్
* ఆమ్చూర్ పొడి - అర టీస్పూన్
* నిమ్మరసం - 1 టీస్పూన్
* జీలకర్ర - 1 టీస్పూన్
* గరం మసాలా - పావు టీస్పూన్
* ఉప్పు - తగినంత
* నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత
తయారీ విధానం
చిలగడదుంపలను మెత్తగా ఉడికినంత వరకు ఓవెన్‌లో కాల్చండి. ఉడికించిన చిలగడ దుంపల గుజ్జును ఓ గిన్నెలోకి తీసుకోండి. దానిలో చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, నిమ్మరసం, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి-అల్లం పేస్ట్, శనగపిండిని వేయండి. ఇవన్నీ బాగా కలిసేలా కలపండి. అనంతరం వాటిని కట్‌లెట్ రూపంలో చేయండి. వీటిని మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయండి. టేస్టీ టేస్టీ చిలగడ దుంప కట్లెట్ రెడీ.
సంబంధిత కథనం